మరిచిపోతే చరిత్ర మనలను మన్నించదు!!
2023 దావోస్ నుండి జగన్ మన ఆంధ్రాకు ఒక విప్లవం తీసుకువచ్చారు. ఆ వేదికలో తనను కలిసిన బైజూస్ సంస్థ నేతతో ఎంఓయూ చేసుకున్నారు. అది విద్యా విప్లవం అని ₹686 కోట్లు ట్యాబులకు కేటాయించారు. బెంగళూరులో కనీసం ఆర్‌ఎమ్‌జెడ్ (RMZ) లాంటి పార్కులలో కార్యాలయాలు లేకుండా.. కళ్యాణీ, ప్రెస్టీజ్ భవనాల్లో అద్దెలు కూడా చెల్లించలేక.. డిపాజిట్ల నుండి తీసుకోమని సర్దుబాటు చేస్తోంది అప్పటికే ఈ బైజూస్. అదే ఏడాది 2023లో బైజూస్‌ను దివాళా తీసినట్లు ప్రకటించాలని, తమ అప్పులు తీర్చడం లేదని బీసీసీఐ దావా వేసింది. అక్కడి నుండి దాని పతనం మొదలైంది. అందరి దగ్గరా అప్పు చేసి, తీర్చలేని స్థితిలో ఉన్న బైజూస్‌కు జగనన్న విద్యా విప్లవం కింద అక్షరాలా ₹686 కోట్లు మన ఆంధ్రా సొమ్మును అప్పనంగా ఇచ్చాం.
ఈ ఘనత గురించి మరిచిపోయిన వైకాపా పేటీఎంలు, నాయకులు జగన్‌కు క్రెడిట్ ఇవ్వకపోవడం శోచనీయం.
వీరికి రియల్ ఎస్టేట్ బిల్డర్లకు, ఆర్‌ఎమ్‌జెడ్ (RMZ) లాంటి గ్లోబల్ టెక్ ఇన్ఫ్రా గ్రూపుకు తేడా తెలియదు. 2020లో బ్రూక్‌ఫీల్డ్‌తో జరిగిన ఒప్పందం తర్వాత ఆర్‌ఎమ్‌జెడ్ గ్రూప్ పూర్తిగా రుణరహిత సంస్థ. కెనడా పెన్షన్ ప్లాన్, జపాన్‌కు చెందిన మిట్సుయ్ ఫుడోసన్ వంటి గ్లోబల్ ఇన్వెస్టర్లు ఇందులో వేల కోట్లు పెట్టుబడి పెట్టారంటే అదీ వీరి స్థాయి.
జారే కత్తిని దావోస్ నుండి పట్టుకొచ్చి, అప్పుల్లో ఉన్న ఆంధ్రా చేతులను ₹686 కోట్లకు చీరేసిన ఘనుడికి ఈ క్రెడిట్ ఇవ్వకపోతే ఎలా? వీరు కూడా ఆర్‌ఎమ్‌జెడ్ – ఆంధ్రా ఎంఓయూను విమర్శిస్తున్నారు సిగ్గులేకుండా! దానికి ఒక స్పెషల్ ఫ్లైట్.. లండన్ డైవర్షన్, ల్యాండింగ్, పిల్లలను పికప్ చేసుకుని, జనం సొమ్ముతో జగన్ ఫ్యామిలీ అంతా స్విజర్లాండ్ బలాదూర్. కోట్లు బొక్క! ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి, దాని ఇంపాక్ట్ ఆంధ్రాకు ఎంత అనే ఇంగిత జ్ఞానం లేని వైకాపా నాయకుల వాగుడును, చంద్రబాబు, లోకేశ్ శ్రమను ప్రజలు గమనిస్తున్నారు.