– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ధిక్కరించి తన తాత రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తోన్న జగన్ అనే నియంత సర్కారుకి రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు లేదు. రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులకి దిక్కులేదు. నిలదీస్తే నిర్బంధం. సర్కారు అవినీతి, అరాచకాలని ప్రశ్నిస్తే ప్రాణాలు తీసిన జగన్ ఆటవిక పాలనని అంతమొందించేందుకు ప్రజలు ఉద్యమించాలి. జగన్ నేర క్రూర పాలనకి బలైన వారందరికీ కన్నీటి నివాళులు. ప్రజాస్వామ్య విలువలు కాపాడటానికి, అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో పని చేస్తున్న మహానుభావులు, ప్రజలకి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.