-జగన్ రైస్ మిల్లర్ల ను వేధిస్తున్నాడు
-జగన్ విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు
-టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం
-జగన్ పెంచిన ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గిస్తాం
-ప్లాస్టిక్ కవర్లు వాడే వ్యాపారస్తుల పై ఫైన్లు వెయ్యడం దారుణం
-రోశయ్య గారి సేవలు గుర్తు ఉండేలా మ్యూజియం ఏర్పాటు చేస్తాం
-టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వ్యాపారస్తులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో నారా లోకేష్
రైస్ మిల్లర్లు జగన్ పాలన లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. సెస్ పెంచారు దానితో ఇబ్బంది పడుతున్నాం. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు. పెనాల్టీల పేరుతో వేధిస్తున్నారు. సబ్సిడీలు ఇవ్వడం లేదు.
జగన్ పాలనలో భవన నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. చిరు వ్యాపారస్తులు జీఎస్టీ రిటర్న్స్ వెయ్యడంలో ఆలస్యం అయితే ఫైన్ల పేరుతో వేధిస్తున్నారు.
ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే కంపెనీలను నియంత్రించకుండా కవర్లు కస్టమర్లకు ఇచ్చే వ్యాపారస్తులను జగన్ ప్రభుత్వం వేధిస్తుంది. ఫైన్లు విపరీతంగా వేస్తున్నారు.
ట్రాన్స్ పోర్ట్ రంగాన్ని జగన్ కోలుకోలేని దెబ్బతీశాడు. లారీలు తిప్పలేని పరిస్థితి వచ్చింది.
ప్రొఫెషనల్ ట్యాక్స్ పేరుతో జగన్ ప్రభుత్వం వ్యాపారస్తుల్ని వేధిస్తుంది.
నిమ్మ రైతులు, వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నాం.
బంగారం వ్యాపారస్తులను జగన్ ప్రభుత్వం వేధిస్తుంది. కేసులు పెట్టి నరకం చూపిస్తున్నారు.
– టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కోవూరు నియోజకవర్గం వ్యాపారస్తులు
అందుకు స్పందించిన లోకేష్ ఏమన్నారంటే..
కరోనా కంటే ప్రమాదకరం జగనోరా వైరస్.అన్ని వ్యవస్థల్ని జగనోరా వైరస్ నాశనం చేసింది. వ్యాపారస్తులు కూడా జగనోరా వైరస్ బాధితులే. జగనోరా వైరస్ కి వ్యాక్సిన్ చంద్రబాబు.టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకునే వారు.
జగన్ పాలనలో క్రాప్ హాలిడే, ఆక్వా హాలిడే చూశాం. త్వరలో వ్యాపారస్తులు బిజినెస్ హాలిడే ప్రకటించే ప్రమాదం ఉంది. జగన్ సొంత పార్టీ నాయకుడు సుబ్బారావు గుప్తా బండిలో గంజాయి పెట్టి వేధించారు.చెత్త పన్ను, బోర్డు పన్ను, విద్యుత్ ఛార్జీలు, ప్రొఫెషనల్ టాక్స్ పెంచి వ్యాపారస్తులను వేధించాడు జగన్. చెత్త పన్ను కట్టకపోతే చెత్త తీసుకొచ్చి షాపు ముందు పొయ్యడం దారుణం.
రైస్ మిల్లర్ల సమస్యలు నాకు తెలుసు. జగన్ రైస్ మిల్లర్ల ను వేధిస్తున్నాడు. పన్నులు, సెస్ పెంచేసి ఇబ్బంది పెడుతున్నారు. జగన్ పెంచేసిన పన్నులు అన్ని తగ్గిస్తాం.కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి వ్యాపారాలు చేసుకోవడానికి అయ్యే ఖర్చులు తగ్గిస్తాం.
జగన్ విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు. రకరకాల పేర్లు చెప్పి భాదేస్తున్నాడు.సర్ ఛార్జ్ కాదు జే ఛార్జ్ వలనే విద్యుత్ బిల్లులు అంతగా పెరిగిపోయాయి.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం.జగన్ పాలనలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపి నంబర్ 1 గా ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గిస్తాం.
బియ్యం ఎగుమతులు కోసం కేంద్రం వసూలు చేస్తున్న పన్ను తగ్గించేలా మా ఎంపీలు పోరాటం చేస్తారు. జగన్ హాఫ్ నాలెడ్జ్ తో భవన నిర్మాణ రంగాన్ని బ్రష్టు పట్టించాడు. ఇసుక లో జగన్ రోజుకి మూడు కోట్లు సంపాదిస్తున్నాడు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన ఇసుక విధానం తీసుకొస్తాం. ఇసుక ధర తగ్గిస్తాం. చిరు వ్యాపారస్తులు జీఎస్టీ రిటర్న్స్ చెల్లింపుల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఫైన్స్ కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనలు సడలించేలా మా ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తారు. జగన్ అనాలోచిత నిర్ణయాల వలన వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు.
ప్లాస్టిక్ కవర్ల తయారీ చేసే కంపెనీలను నియంత్రించకుండా ప్లాస్టిక్ కవర్లు వాడే వ్యాపారస్తుల పై ఫైన్లు వెయ్యడం దారుణం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వేధింపుల కంటే ప్లాస్టిక్ వినియోగం వలన వచ్చే ప్రమాదాల పై అవగాహన పెంచే చర్యలు తీసుకుంటాం.
జగన్ వ్యాపారస్తులు వేధిస్తున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వేధింపులు లేకుండా చేస్తాం. ట్రాన్స్ పోర్ట్ రంగాన్ని జగన్ దెబ్బ తీశాడు. విపరీతంగా పన్నులు పెంచాడు. లారీలు తిప్పలేని పరిస్థితి. కాంపౌండ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, క్వార్టర్ ట్యాక్స్ అన్ని పెంచేశాడు.జగన్ ట్రాన్స్ పోర్ట్ రంగం పై పెంచిన అన్ని పన్నులు తగ్గిస్తాం.
అప్పు చేసి సంక్షేమం చెయ్యడం వలన అన్ని రంగాల పై పన్నులు పెంచాడు జగన్.టిడిపి సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలను అందించింది.టిడిపి సైకిల్ కి అభివృద్ది, సంక్షేమం రెండు చక్రాలు. నిమ్మ లో ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకి కావాల్సిన రకాలు ఇక్కడ పెంచే విధంగా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. కోల్డ్ స్టోరేజ్ లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతులకు, వ్యాపారస్తులకు సాయం అందిస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పెంచిన ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రొఫెషనల్ ట్యాక్స్ రద్దు చేస్తాం.ఫీడ్, సీడ్ యాక్ట్ తీసుకొచ్చి జగన్ ఆక్వా రంగాన్ని కోలుకోలేని దెబ్బతీశాడు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్వా రంగాన్ని ఆదుకోవడానికి గతంలో ఇచ్చిన సబ్సిడీలు అన్ని అందిస్తాం.జగన్ స్వర్ణకారులను వేధిస్తుంది. అక్రమ కేసులు పెట్టి నరకం చూపిస్తున్నారు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే స్వర్ణకారులకు వేధింపులు లేని విధానం తీసుకొస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రోశయ్య గారి సేవలు గుర్తు ఉండేలా మ్యూజియం ఏర్పాటు చేస్తాం. ఆర్య వైశ్యుల కార్పొరేషన్ బలోపేతం చేస్తాం.ఆర్య వైశ్యుల సంఘం వ్యవహారం లో రాజకీయ జోక్యం లేకుండా చేస్తాం.ఆర్య వైశ్యుల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం.
టిడిపి ఇంఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ..
చేనేత కార్మికులు, ఆక్వా రైతులు, రైసు మిల్లర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు.జగన్ ప్రభుత్వం వ్యాపారుల పై విపరీతంగా పన్నులు పెంచి దోచుకుంటుంది.