Suryaa.co.in

Andhra Pradesh

నరసరావుపేట కేంద్రంగా జగన్ ముఠా రూ.750 కోట్ల విలువైన ట్రెమడాల్ డ్రగ్ ను ఉత్పత్తి చేసింది

– అక్రమ మద్యం, గంజాయి, మాదకద్రవ్యాలతో యువతను నాశనంచేస్తూ వేలకోట్లు దండుకుంటున్న జగన్ రెడ్డి, తన అత్యాశకు అంతేలేదన్నట్లు తనముఠా సాయంతో నిషేధిత ట్రెమడాల్ డ్రగ్ తయారీ కేంద్రంగా ఏపీని మార్చాడు
• దేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడ పట్టుబడ్డా ఏపీ మూలాలు బయటపడుతున్నాయి.
• తాజాగా సుమారు రూ.750 కోట్లు విలువైన ట్రెమడాల్ డ్రగ్స్ ఏపీ కేంద్రంగా ఉత్పత్తి అయ్యి విదేశాలకు ఎగుమతి అయ్యి ఉండవచ్చని నిఘా వర్గాల అంచనా
• నరసరావుపేట కేంద్రంగా సేఫ్ ఫార్ములేషన్స్ లో ఉత్పత్తి అయిన రూ. 21 కోట్ల విలువైన 10 లక్షల నిషేదిత ట్రెమడాల్ ట్యాబ్లెట్ స్ట్రిప్స్ ఫిబ్రవరి 27 న ముంబయిలో పట్టుబడ్డాయి.
• ఫార్మ్ ఎక్సిల్ (ఫార్మాస్యూటికల్ ఎక్స్ ఫోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్) వారు గతంలో కూడా సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థ మరో రూ.730 కోట్ల విలువైన 3.31 కోట్ల ట్రెమడాల్ స్ట్రిప్స్ విదేశాలకు ఎగుమతి చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.భారతప్రభుత్వం 2018లో నిషేధించిన ట్రెమడాల్ డ్రగ్ ను ఏపీలో జగన్ ముఠా తయారుచేస్తోంది
• కాల్షియం కార్బొనేట్ ట్యాబ్లెట్ల ముసుగులో దేశందాటించి ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది.
• ఐసిస్ (ISIS) ఉగ్రవాదులు తరచూ తీసుకునే డ్రగ్స్ తయారీ రాష్ట్రంలో జరుగుతుంటే ముఖ్యమంత్రి, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఏంచేస్తున్నారు?
• ప్రభుత్వానికి తెలియకుండా ఇదంతా జరగనే జరగదు
• సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థతో పాటు, రాష్ట్రంలోని పలుఫార్మాసంస్థల్నిజగన్ ముఖ్యమంత్రి అయ్యాకే హస్తగతం చేసుకున్న శనగల శ్రీధర్ రెడ్డి, బాలినేని గోవిందరెడ్డి, బాలినేని అరుణలు ఎవరు?
• కేంద్రప్రభుత్వ సంస్థలు రాష్ట్రంలోని ఫార్మాకంపెనీలకు నోటీసులు ఇచ్చేవరకు జగన్ ప్రభుత్వం మొద్దునిద్రపోతోందా?
• వారిని ముందుపెట్టి, వెనకుండి ఇంతభారీ కుంభకోణాన్ని నిర్వహిస్తున్న అసలు వ్యక్తులెవరో ప్రభుత్వం తేల్చాలి.
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

దేశంలో ఎక్కడ మాదకద్రవ్యాలు పట్టుబడినా మూలాలు ఏపీలోనే కనిపిస్తున్నాయని, గంజా యి, ఇతర మాదకద్రవ్యాల మాదిరే ఇటీవలే ట్రమడాల్ డ్రగ్ ముంబై ఎయిర్ పోర్ట్ లోని ఎయి ర్ కార్గోడివిజన్లో పట్టుబడిందని, భారతప్రభుత్వం 2018లో నిషేధించిన, రూ.21కోట్ల విలువైన 10లక్షల ట్రమడాల్ టాబ్లెట్స్ ను సెంట్రల్ ఇంటిలిజెన్స్ యూనిట్, ముంబై కస్టమ్స్ విభాగం పట్టుకుందని, దానిపై వారు జరిపిన విచారణలో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయ ని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే ..

“దేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడ పట్టుబడ్డా వాటికేరాఫ్ అడ్రస్ ఏపీలోనే కనిపిస్తోంది. 10లక్షల ట్రెమడాల్ ట్యాబ్లెట్లు ముంబై విమానాశ్రయం ఎయిర్ కార్గో డివిజన్లో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాయి. దానిపై వారు విచారించగా, ట్రెమడాల్ ట్యాబ్లెట్స్ బెంగుళూరుకు చెందిన ఫస్ట్ వెల్త్ సొ ల్యూషన్స్ సంస్థద్వారా సౌత్ సూడాన్ రాజధాని జూబాకు తరలిస్తున్నట్టు కనుగొన్నారు. ఫస్ట్ వెల్త్ సొల్యూషన్స్ సంస్థకు మనరాష్ట్రంలో నరసరావుపేట కేంద్రంగా పనిచేస్తున్న సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థ, ఈ ట్రెమడాల్ ట్యాబ్లెట్లను సరఫరాచేస్తున్నట్టు కస్టమ్స్ అధికారుల విచారణలో తేలింది. గతంలో ఐటీ, వ్యవసాయ, ఆటోమొబైల్ ఉత్పత్తుల ఎగుమతుల్లో నంబర్-1 గా ఉన్న రాష్ట్రం నేడుమత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల ఎగుమతుల్లో ముందుండటం సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి నేత్రత్వంలో మత్తుపదార్థాల ఎగుమతుల్లో మనరాష్ట్రం ప్రపంచంలోనే ముందు ఉండటం నిజంగా ప్రజలందరూ సిగ్గుపడాల్సిన విషయం.

పొరుగుదేశాలవారు మనల్ని, మనరాష్ట్రాన్ని అపహాస్యం చేస్తుంటే తెలుగువారైన మనం తలదించుకోవాల్సిన పరిస్థితికి ఈ జగన్ రెడ్డే కారణం. లిక్కర్, ఇసుక, భూములు, మైనిం గ్ కుంభకోణాలద్వారా వేలకోట్లు దండుకుంటున్న జగన్, ఆఖరికి తనముఠా ద్వారా నిషే ధిత డ్రగ్స్ తయారుచేయిస్తూ వందలకోట్లు దోచుకుంటున్నాడు. నరసరావుపేట సమీపంలోని ముప్పాళ్లమండలంలని గోళ్లపాడులో మాజీమంత్రి, మాజీ స్పీకర్ స్వర్గీయ కోడెల శివప్రసాదరావు గారు 1980లలో సేఫ్ ఫార్ములేషన్స్ ఫార్మా సంస్థను స్థాపించారు. సమీపగ్రామాల్లో ఉపాధికల్పన, ఆ ప్రాంత అభివృద్ధికొరకు ఆయన దాన్నిప్రారంభించారు. మొదట్లోదానిలో సెలైన్ బాటిల్స్ తయారయ్యేవి. ప్రారంభమైన ప్పటినుంచి, 2019వరకు సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థ కార్యకలాపాలు కోడెల కుటుంబం ఆధ్వర్యంలో ఎవరూ వేలెత్తిచూపకుండా కొనసాగాయి.

2019 జూన్ లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అనేకకంపెనీలు, వ్యాపారాల్ని ఆయనముఠా పలువురి వద్దనుంచి బెదిరించి గుంజుకుంది. అదేకోవలో కోడెల శివప్రసాద రావుని వెంటాడి, వేధించి ఆయన బలవన్మరణానికి కారకుడు అయ్యాడు ఈ జగన్ రెడ్డి. కోడెల కుటుంబంపై అనేకతప్పుడుకేసులు పెట్టి, వివిధప్రభుత్వశాఖల్ని వారిపైకి ఉసిగొల్పి, సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థను ఆయన కుటుంబంనుంచి బలవంతంగా గుంజు కున్నారు. మాజీమంత్రి, జగన్ కు బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డికి సన్నిహితులు అని చెప్పుకుంటున్న బాలినేని గోవిందరెడ్డి, బాలినేని అరుణ, గాదె కనిగిరి అనేవ్యక్తులు శనగ ల శ్రీధర్ రెడ్డి అనేవ్యక్తిని ముందుపెట్టి, కోడెల స్థాపించిన సంస్థను తమపరం చేసు కున్నారు.

ఆ సంస్థను వారిపరంచేసుకున్నాక, మాదకద్రవ్యాల ఉత్పత్తి, నిషేధిత డ్రగ్స్ తయారీకి కేంద్రబిందువుగా మార్చారు. భారత ప్రభుత్వం 2018, ఏప్రియల్ 26 న విడుదలచేసిన ప్రత్యేక గెజిట్ ద్వారా ట్రెమడాల్ డ్రగ్ ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ది నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టెన్సస్ యాక్ట్ -1985 కింద ఈ ఉత్తర్వులు ఇవ్వడంజరిగింది. ట్రెమడాల్ డ్రగ్ ను ‘ఐసిస్’ డ్రగ్ అనికూడా అంటారు. ‘ఐసిస్’ (ISIS) తీవ్రవాదులు ప్రపంచంలో ఎంతమారణహోమం సృష్టిస్తున్నారో చూస్తూనేఉన్నాం. అలాంటి తీవ్రవాదు లు ట్రెమ డాల్ డ్రగ్ ను విపరీతంగా వాడతారు. దాన్ని వాడటంవల్ల ఇన్ స్టెంట్ కిక్ వస్తుంది. శరీరంలో ఎక్కడా నొప్పితెలియకుండా చేయడమేగాక, నిద్రలేకుండా చేస్తుంది. అందుకే తీవ్రవాదులు ఎక్కువగా దీన్ని వినియో గించేవారు.

తీవ్రవాదులు వినియోగించే నిషేధిత డ్రగ్ ను సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థలో శనగల శ్రీధర్ రెడ్డి, బాలినేని గోవిందరెడ్డి, బాలినేని అరుణల నేత్రత్వంలోని జగన్ ముఠా, పెద్దఎత్తున ఉత్పత్తిచేస్తూ వందలకోట్లు మింగేయడం ప్రారంభించింది. ప్రభుత్వ సహకారంతో ఈ డ్రగ్ ఉత్పత్తి, రవాణా జరుగుతోందని కచ్చితంగా చెప్పవచ్చు. ప్రభుత్వసహకారం లేకుండా ఏ ఒక్కరూ నిషేధిత డ్రగ్ ఉత్పత్తిచేసే సాహసం చేయలేరు. ఇప్పటివరకు సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థ దాదాపు రూ.750కోట్ల విలువైన నిషేధిత ట్రెమడాల్ డ్రగ్ ను ఉత్పత్తిచేసి, వివిధమార్గాల్లో విదేశాలకు ఎగుమతి చేసి ఉండొచ్చని ఫార్మ్ ఎక్సెల్ (పార్మస్యూటికల్ ఎక్స్ పోర్ట్ ప్రమో షన్ కౌన్సిల్) నిఘా వర్గాల అంచనా.

ముంబైలో ట్రెమడాల్ డ్రగ్స్ పట్టుబడ్డాక, ఫార్మ్ ఎక్సెల్ (ఫార్మాస్యూటికల్ ఎక్స్ పోర్ట్ ప్రమో షన్ కౌన్సిల్) వారు సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థకు నోటీసులిచ్చారు. ముంబైలో కస్టమ్స్ అధికారులకు దొరికిన ట్రెమడాల్ ట్యాబ్లెట్స్ కాకుండా, రూ.730కోట్ల విలువైన 3.31లక్షల ట్రెమడాల్ స్ట్రిప్స్ ( అంటే 15,745 కేజీలు)ని సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థ ఉత్పత్తిచేసి, కాల్షియం కార్బొనేట్ ట్యాబ్లెట్ల ముసుగులో వివిధదేశాలకు తరలించి ఉండవచ్చని నిఘా వర్గాల అంచనా అని ఫార్మ్ ఎక్సెల్ సంస్థ తాను ఇచ్చిన నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది.

ఫార్మ్ ఎక్సెల్ డైరెక్టర్ జనరల్ ఉదయభాస్కర్, సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థ నిర్వాహకుడైన బాలినేని గోవిందరెడ్డికి నోటీసులిచ్చారు. తాము అడిగినవాటికి ఏప్రియల్ 27వ తేదీలోపు జవాబుచెప్పాలని, లేనిచో ట్రెమడాల్ ను చట్టవ్యతిరేకంగా ఉత్పత్తిచేస్తున్న మీ సంస్థ మెంబర్ షిప్ ను తాముఎందుకు రద్దుచేయకూడదని కూడా ప్రశ్నించారు. ఇంతజరిగితే ఏపీ ప్రభుత్వానికి తెలియదా? ఆ విధంగా మొన్న ముంబైలో పట్టుబడిన రూ.21కోట్ల విలువైన ట్రెమడాల్ డ్రగ్స్ తో కలి పి, నేటివరకు సుమారు రూ.750కోట్ల విలువైన ట్రెమడాల్ డ్రగ్స్ ను సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థలో జగన్ ముఠా ఉత్పత్తిచేసినట్టు అంచనా.

నరసరావుపేట కేంద్రంగా ట్రెమడాల్ డ్రగ్ ఉత్పత్తి అవుతుంతే, కలెక్షన్ క్వీన్, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ నేత్రత్వంలోని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (D.C.A) గడ్డిపీకుతోందా ? D.C.A చీఫ్ ఎస్. రవిశంకర్ నారాయణ ఏం చేస్తున్నారు? D.C.A కి తెలియకుండా, ప్రభుత్వసహకారం లేకుండా ట్రెమడాల్ ఉత్పత్తి అసాధ్యం. దీనికి సంబంధించి ముడుపులు కలెక్షన్ క్వీన్ విడదల రజనీనుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు కచ్చితంగా అందేఉంటాయి. రాష్ట్రప్రభుత్వమే ఇలాంటి నిషేధిత డ్రగ్స్ తయారీని ప్రోత్సహిస్తుంటే, రాష్ట్రంలోని యువతీ,యువకుల జీవితాలు ఏమైపోవాలి? తనకు అందాల్సిన సూట్ కేసులు అందాయికాబట్టి, కలెక్షన్ క్వీన్ రజనీ కళ్లకు గంతలు కట్టుకొని, సేఫ్ ఫార్ములేషన్స్ డ్రగ్ దందాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

నరసరావుపే ట సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థలో కరోనాసమయంలో మంత్రికాకముందు అంబటి రాంబాబు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు? ఆసంస్థ రెమిడెసివర్ ఇంజక్షన్లు తయారు చేసి, కరోనా బారినుంచి ప్రజల్ని కాపాడుతోందని ఎందుకు కితాబులిచ్చాడు? జగన్ ముఠాచేస్తున్న డ్రగ్స్ వ్యాపారానికి అంబటి ఇలా దగ్గరుండి కవరింగ్ ఇచ్చాడా? లేక తనవాటా ఎంతని అడగడానికి వెళ్లాడా? జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే బాలినేని గోవిందరెడ్డి, బాలినేని అరుణ, శనగల శ్రీధర్ రెడ్డి లకు ఫార్మాకంపెనీలపై మోజు ఎందుకు పుట్టింది. అనేకసంస్థల్లో ఉన్నట్టుండి వారంతా డైరెక్టర్లు, అడిషనల్ డైరెక్టర్లు ఎలాఅయ్యారు?

శనగల శ్రీధర్ రెడ్డి, బాలినేని గోవిందరెడ్డి, బాలినేని అరుణలు జగన్ ముఖ్యమంత్రి అయ్యా కే పెద్దఎత్తున ఫార్మా సంస్థల్ని హస్తగతంచేసుకోవడం ప్రారంభించారు. సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థతో పాటు అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, సేఫ్ పేరంట్రాల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రణయ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రణయ ఫార్మస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆరిషి మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ వంటివాటిని తమపరంచేసుకున్నారు.

ఈ సంస్థలన్నింటిలో శనగలశ్రీధర్ రెడ్డి, బాలినేని గోవిందరెడ్డి, అరుణలు జగన్ ముఖ్య మంత్రి అయ్యాకే కాళ్లుపెట్టారు. అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో బాలినేని గోవిందరెడ్డి డిసెంబర్ 2019లో డైరెక్టర్ గా జాయినయ్యాడు. శనగల శ్రీధర్ రెడ్డి జూలై 20 20లో డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు. సేఫ్ పేరంట్రాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో బాలినే ని గోవిందరెడ్డి ఫిబ్రవరి 2022లో అడిషనల్ డైరెక్టర్ గా చేరాడు. ప్రణయ లైఫ్ సైన్సెస్ ప్రైవే ట్ లిమిటెడ్ సంస్థలో బాలినేని గోవిందరెడ్డి 23 జూన్ 2021న డైరెక్టర్ గా చేరాడు. శనగల శ్రీధర్ రెడ్డి అక్టోబర్ 2019న జాయిన్ అయ్యాడు. ప్రణయ ఫార్మస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటె డ్ సంస్థలో బాలినేని గోవిందరెడ్డి 14 ఫిబ్రవరి 2022న అడిషనల్ డైరెక్టర్ గా చేరాడు. శన గల శ్రీధర్ రెడ్డి మార్చి 2020న జాయిన్ అయ్యాడు. ఆరిషి మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ సం స్థలో బాలినేని గోవిందరెడ్డి 23 డిసెంబర్ 2019న డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు.

ఈ తేదీలన్నీ చూస్తేనే అర్థమవుతోంది. బాలినేని గోవిందరెడ్డికి, బాలినేని అరుణ, శనగల శ్రీధర్ రెడ్డిలకు జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే ఫార్మాకంపెనీలపై మోజుపుట్టిందని. జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే ఫార్మాకంపెనీల ముసుగులో నచ్చిన డ్రగ్స్ తయారుచేసి, విదేశాలకు తరలించాలన్న బరితెగింపుతోనే ఈవిధంగా ఫార్మాకంపెనీల్ని హస్తగతం చేసు కున్నారు. ఇంత దారుణానికి తెగబడిన ఈ జగన్ ముఠా తీవ్రవాదులకంటే ప్రమాదకరమై నవాళ్లు. సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థ కోడెల కుటుంబం ఆధ్వర్యంలో నడిచినంతకాలం చిన్నరిమార్క్ కూడా ఎదుర్కోలేదు. రాష్ట్రంలో జరుగుతున్న నిషేధిత డ్రగ్స్ ఉత్పత్తిపై D.C.A ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇంతజరుగుతుంటే మంత్రి విడదల రజనీఏంచేశారు?

ఈవ్యవహారంలో కలెక్షన్ క్వీన్ రజనీకి ఎంతముట్టింది? బాగా ముడుపులు అందాయనే D.C.Aని కిమ్మనకుండా చేశా రా? నీలాంటి కలక్షన్ క్వీన్ లు మంత్రులుగా ఉండటం ప్రజలదౌర్భాగ్యం. ఎవరి సహకారంతో ఈ నిషేధిత డ్రగ్ ఉత్పత్తి అవుతోందో ముఖ్యమంత్రి సమా ధానం చెప్పాలి. బాలినేని గోవిందరెడ్డి, బాలినేని అరుణ, శనగల శ్రీధర్ రెడ్డిల బాగోతం ఏమిటి? వారి వెన క ఉన్నది ఎవరు? ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరగాలి. గతంలో ముంద్రా పోర్టులో డ్రగ్స్ పట్టుబడినప్పుడు కూడా ఇలానే లింక్ లు చాలా దూరం వెళ్లాయి. గంజాయి సరఫరాలో కూడా రాష్ట్రంలోని పెద్దతలకాయల పేర్లు బయటకువచ్చా యి. ఈ విధంగా అన్యాయంగా, అక్రమంగా, చట్టవిరుద్ధంగా, ప్రజల ప్రాణాలు బలితీసుకుం టూ ఎన్నిలక్షలకోట్లు అర్జిస్తారు? ఎందరి జీవితాలు బలితీసుకుంటారో ముఖ్యమంత్రి ప్రజ లకు సమాధానం చెప్పాలి.

సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో, కేంద్రవాణిజ్యశాఖ ఆధ్వర్యంలో నడిచే ఫార్మ్ ఎక్సిల్ కౌన్సిల్, ఎక్సైజ్ వారు ఇప్పటికే ఈ వ్యవహారంపై కేసునమోదుచేసి, శనగలశ్రీధర్ రెడ్డిని అదుపులో కి తీసుకున్నారు. దానికి కొనసాగింపుగా ఏపీ ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. వారివెనకున్న వ్యక్తులు ఎవరోకూడా బయటకురావాలి. ఎవరు అనుమతిలిస్తే ఫార్మా కంపెనీల ముసుగులో జగన్ ముఠా ఇంతదారుణానికి తెగించింది. వీటన్నింటిపై రాష్ట్ర వై ద్య ఆరోగ్యశాఖమంత్రి విడదలరజనీ సమాధానంచెప్పాల్సిందే. జగన్ తన దోపిడీకోసం రాష్ట్రాన్ని ఏవిధంగా డ్రగ్స్, మాదకద్రవ్యాల కేంద్రంగా మార్చాడో ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నాం.”

LEAVE A RESPONSE