– ప్రభుత్వశాఖల్లోనిఖాళీలు భర్తీచేయక, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచని ముఖ్యమంత్రి చేతగానితనంవల్లే యువతలో నిరాశానిస్పృహలు, రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువైంది
• రాష్ట్రంలో ఇప్పటివరకు 21,575 మంది బలవంతంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారన్న కేంద్రప్రభుత్వ నివేదికలపై ముఖ్యమంత్రి ఏం చెబుతాడు?
• ఏపీలో నిరుద్యోగం పెరుగుతుండటంతో, యువతలో నిరాశానిస్పృహలు అధికమవుతున్నాయి
• నాడు 2.30లక్షల ప్రభుత్వఉద్యోగాలు భర్తీచేస్తానన్న జగన్, నేడు 66వేల ఖాళీలు మాత్రమే ఉన్నాయనడం నిరుద్యోగయువతను వంచించడంకాదా?
• ఏటా జాబ్ క్యాలెండర్, డీఎస్సీనోటిఫికేషన్లపై ముఖ్యమంత్రి ఏం సమాధానంచెబుతాడు?
• రాష్ట్రయువత జగన్ పై ఆగ్రహావేశాలతో రగిలిపోతోంది అనడానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం
– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు
రైతులు, నిరుద్యోగులు, యువత ఆత్మహత్యలు రాష్ట్రంలో అధికమయ్యాయయని, మరీ ముఖ్యంగా 2019లో 6,465మంది, 2020లో 7,043మంది, 2021లో 8,067మంది మొత్తం గా 21,575మంది యువత బలవన్మరణాలకు పాల్పడ్డారని పార్లమెంట్ సాక్షిగా పచ్చి నిజా లు బట్టబయలయ్యాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. ఎస్.సీ.ఆర్.టీ నివేదిక ప్రకారం571మంది రాష్ట్రయువత గంజాయి, ఇతరమాదకద్రవ్యాలకు బలైపోయారని చెప్పా రు. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ నివేదిక, ఎస్.సీ.ఆర్.టీ నివేదికలోని అంశాలపై ముఖ్యమంత్రి, ఈచేతగాని ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే …
టీడీపీప్రభుత్వం 5,13,351 ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చిందని అసెంబ్లీలో చెప్పిన జగన్ ప్రభుత్వం, ఈ 4ఏళ్లలో యువతకు ఎన్నిఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలి. “రాష్ట్రంలో యువత బలవన్మరణాలకు పాల్పడటం పాలకులకే సిగ్గుచేటు. వెనుకబడిన రాష్ట్ర మైన బీహార్ కంటే ఏపీలోనే యువత, నిరుద్యోగులు జీవితాలు అధికంగా బలయ్యాయి. ఉద్యో గాలు దొరక్క, చదువుకి తగిన ఉపాధిదొరక్కే యువత ప్రాణాలు గాల్లోకలుస్తున్నాయి. పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన రాష్ట్రాన్ని, మాదకద్రవ్యాల హబ్ గా మార్చిన జగన్ ధనదాహంకూడా యువతని బలితీసుకుంటోంది. 2.30లక్షల ప్రభుత్వఉద్యోగాలు భర్తీచేస్తా నని, ఏటా డీఎస్సీ ప్రకటిస్తానని, జాబ్ క్యాలెండర్ అమలు చేస్తానన్న జగన్ హామీలన్నీ బుట్టదాఖలుకావడమే ఏపీయువత నిరాశానిస్పృహలు, భవిష్యత్ పై బెంగే ప్రధానకారణమని చెప్పాలి. టీడీపీప్రభుత్వంలో 5,13,351 మందికి ప్రైవేట్ సెక్టార్లో ఉపాధి లభించిందని ఈ ప్రభుత్వమే చెప్పింది. అసెంబ్లీలో దివంగతమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఒ కప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు చెప్పారు. టీడీపీ ప్రభుత్వం రెండేళ్లు డీఎస్సీలు అమలుచేసింది. అదికాకుండా అన్నిజిల్లాల్లో పరిశ్రమలునెలకొల్పి, యువతకు చేతినిండా ఉపాధి కల్పించింది. టీడీపీప్రభుత్వం యువతకు కల్పించినఉపాధి కళ్లముందు కనిపిస్తోంది. మరి ఈ 4ఏళ్లలో జగన్ రాష్ట్రయువతకు కల్పించిన ఉద్యోగాల మాటేమిటి?
2.30లక్షల ప్రభుత్వఉద్యోగాలు భర్తీచేస్తాను..ప్రత్యేకహోదాతెస్తాను..పరిశ్రమలతెచ్చి యువత ను ఉద్ధరిస్తాను అన్న జగన్ మాటలు ఏమయ్యాయి?
హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, ఆఖరికి అండర్ వేర్ (జాకీసంస్థ) ను కూడా రాష్ట్రంలో లేకుండా చేసిన ఘనుడు జగన్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక యువత పరిస్థితి దారుణంగా తయారైంది. 2.30 లక్ష ల ఉద్యోగాలు భర్తీచేస్తాను.. ప్రత్యేకహోదాతీసుకొచ్చి, పరిశ్రమలు రప్పించి నిరుద్యోగుల జీవితాల్ని ఉద్ధరిస్తానని జగన్ ప్రగల్భాలు పలికాడు. కానీ వాస్తవంలో అమలువుతున్నది మాత్రం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకురాకపోవడం. జగన్ అత ని ప్రభుత్వం దెబ్బకు భయపడి, రాష్ట్రంలో ఉన్నపరిశ్రమలే మూతపడుతున్నాయి. 15వేల మందికి ఉపాధికల్పించిన అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ రాష్ట్రానికి గుడ్ బైచెప్పి, తెలంగాణకు వెళ్లిపోయింది. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఒప్పందాలుచేసుకున్న అనేక జాతీయ, అంతర్జాతీయకంపెనీలు జగన్ రాకతో ఆ ఒప్పందాలనురద్దుచేసుకున్నాయి. ఉన్న అరకొరా పరిశ్రమలు ఏదోఅలాఅలా నెట్టుకొస్తూ, కాలంవెళ్లదీస్తున్నాయితప్ప, ఎక్కడా కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడంలేదు. హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ పరిశ్రమలతోపాటు, ఆఖరికి అండర్ వేర్స్ తయారీసంస్థ కూడా రాష్ట్రంవిడిచిపోయిందంటూ సోషల్ మీడియాలో జగన్ సర్కార్ పై ఛలోక్తులు వేసుకుంటున్నారు.
రాష్ట్రంలో 50వేలకు పైగా టీచర్ ఉద్యోగాలు ఖాళీలున్నాయి. డీఎస్సీ ఇప్పుడు ప్రకటించే పరి స్థితిలో ప్రభుత్వంలేదు. జగన్ జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తడంలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేసి, ఆసంస్థలోని ఉద్యోగాలను ప్రభుత్వఉద్యోగాల కింద చూపారు. సచివాలయ వ్యవ స్థలోని సిబ్బంది రెగ్యులరైజేషన్ ఇంకాపూర్తికాలేదు. విశాఖలో సమ్మిట్ పేరుతో 13 లక్ష లకోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నట్టు జగన్ అతని మంత్రివర్గం ఊదరగొట్టింది. ఆ లక్షల కోట్లు వచ్చేదిలేదని యువతకు అర్థమైంది. జగన్ గతంలో చెప్పినట్టుగా 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలహామీని ఎప్పుడు నెరవేరుస్తున్నారు అని టీడీపీసభ్యులు మండలిలో ప్రభుత్వాన్ని నిలదీశారు. దానిపై మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పుడు కేవలం 66వేల ఖాళీలుమాత్ర మేఉన్నాయని చెప్పాడు. మరి జగన్ చెప్పిన 2.30లక్షల ప్రభుత్వఉద్యోగాలహామీ హుళక్కే. జగన్ చేతగానితనం, అవినీతి, ధనదాహం వల్ల మరోపక్క ప్రైవేట్ రంగం పూర్తిగా నాశనమైం ది. ఆరంగంలో ఉపాధిలేక, ఇటుప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వనందునే రాష్ట్రయువత తీవ్రనైరాశ్యంలో కూరుకుపోతోంది. దానిఫలితమే యువత బలవన్మరణాల్లో ఏపీ ముందు ఉం డటం. ఏటా లక్షలమంది యువత పట్టాలుచేతబుచ్చుకొని బయటకు వస్తుంటే, జగన్ వంద ల్లో కూడా ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతున్నాడు.
టీడీపీ ప్రభుత్వం యువత ఆశల్ని, ఆశయాల్ని నిజం చేస్తుంది
టీడీపీప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమలుచేసి, రాష్ట్రవ్యాప్తంగా 2.94లక్షలమంది కి శిక్షణఇచ్చి, 70వేలవరకు ఉద్యోగాలు కల్పించింది. అలాంటిప్రాజెక్ట్ పై అవినీతి ఆరోపణలు చేసి, జగన్ దాన్ని అటకెక్కించాడు. జగన్ జమానాలో యువతకు తగిన నైపుణ్యాభివృద్ధి శిక్షణే అందడంలేదు. తక్కువ అభివృద్ధి చెందే రాష్ట్రమైన బీహార్ తో పోలిస్తే, ఏపీలోనే యువత మరణాలు ఎక్కువగా ఉన్నాయి. అన్నపూర్ణగా అభివృద్ధిలో దూసుకుపోయిన ఆంధ్రప్రదేశ్ లో యువత ఉద్యోగాలు, ఉపాధిలేక చనిపోతుంటే, జగన్ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ జీ.ఎస్. డీ.పీలో రాష్ట్రం ముందుంది అంటూ బూటకపుమాటలే చెబుతోంది. ప్రభుత్వానివి, ముఖ్యమంత్రివి కల్లబొల్లిమాటలే అనడానికి 7.7శాతంగాఉన్న రాష్ట్ర నిరుద్యోగరేటే నిదర్శనం. యువతకు ఉపాధి కల్పించే పారిశ్రామిక, పర్యాటక రంగాల్ని జగన్ సర్వనాశనం చేశాడు. యువత ప్రభుత్వంపై ఎంతటి ఆగ్రహావేశాలతో ఉందో చెప్పడానికి మొన్నజరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీఎన్నికలే నిదర్శనం. జగన్ అడ్డాఅయిన పులివెందులలోనే ప్రభుత్వంపై యువత ఎంతటి ఆగ్రహంతో ఉందో ఓట్లరూపంలో బయటపడింది. ఇప్పటికైనా జగన్ కల్లబొల్లి మాట లు, కట్టుకథలుచెప్పకుండా యువతకు న్యాయంచేసే దిశగా ఆలోచించాలి. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అరాచకం జగన్ చేస్తున్నాడని రాష్ట్ర యువత గ్రహించింది. ప్రజలు ఒక్క అవకాశమిచ్చినందుకు జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలుచేసి, 25ఏళ్లు వెనక్కుతీసుకెళ్లి, లక్షలకోట్లతో తనవ్యక్తిగత ఖజానా నింపుకున్నాడనేది మాత్రం పచ్చినిజం. జగన్ తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించి, యువతకు న్యాయంచేసేందుకు కృషిచేయాలని కోరుతున్నాం. రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులు నిరాశతో, వేదనతో బలవన్మరణాలకు పాల్పడకుండా టీడీపీప్రభుత్వం వచ్చేవరకు ఎదురుచూడాలి. చంద్రబాబు అధికారంలోకి రాగానే యువత ఆశల్ని ఆశయాల్ని తప్పకుండా నిజంచేస్తారు. నారాలోకేశ్ కూడా యువగళంయాత్రలో ఇప్ప టికే చాలాస్పష్టంగా తమప్రభుత్వం వచ్చిన వెంటనే యువత ఆశల్ని, ఆశయాల్ని నిజంచేస్తుందని చెప్పకనే చెప్పారు.” అని అశోక్ బాబు తెలిపారు.