– ప్రజాధనంను పీక్కుతిన్న ఖర్చులు!
2019 నుంచి 2024 మార్చి వరకు.. కేవలం ఐదేళ్ల పాలనలో, ముఖ్యమంత్రి ప్రయాణాల కోసం ప్రజల సొమ్మును దారుణంగా ఖర్చు చేశారు. హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్లలో విలాసవంతమైన ప్రయాణాల కోసం ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APAC) లెక్కల ప్రకారం ఖర్చు చేసిన మొత్తం ఎంతో తెలుసా?
* రూ. 222 కోట్లు పైగా! (ఖచ్చితంగా చెప్పాలంటే, మొత్తం ఖర్చు రూ. 2,22,85,25,893. అంటే రూ. 222 కోట్లకు పైనే! ) ఈ మొత్తంలో…
* హెలికాప్టర్ ఖర్చు రూ. 87 కోట్లు
* ఫిక్స్డ్ వింగ్ (స్పెషల్ ఫ్లైట్స్) ఖర్చు రూ. 122 కోట్లు
* ఇతర ఖర్చులు (వసతి, గ్రౌండ్ హ్యాండ్లింగ్, సిబ్బంది) రూ. 23 కోట్లు ఉన్నాయి.
ప్రజాధనం అంటే చింత లేదా? కరోనా లాక్డౌన్ ఉన్న కాలంలో కూడా భారీగా ఫ్లైట్ అద్దెలకు, ఛార్జీలకు చెల్లించారంటే, ప్రజల సొమ్ముకు వీరు ఎంత విలువ ఇచ్చారో అర్థమవుతోంది. బాధ్యత అంటే ఇదే! (రెండు ప్రభుత్వాల మధ్య తేడా) ఇదే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, మంత్రి లోకేష్ గారు కానీ, తమ ప్రయాణాల కోసం ఒక్క రూపాయి కూడా ప్రజా ధనం ఖర్చు చేయలేదని RTI ద్వారా స్పష్టమైంది. ఇది రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న తేడా! ఒకరు ప్రజల సొమ్మును విలాసాలకు వాడుకుంటే, మరొకరు ప్రజాధనంపై తమ బాధ్యతను నిరూపించుకున్నారు.
గమనిక : జగన్ జల్సాల ఖర్చులో కూలిన వందేళ్ల వృక్షాలు, మూసేసిన దుకాణాలు, కట్టిన పరదాలు, తవ్వేసిన రోడ్లు, కొన్న వలలు, సభల్లో త్రవ్విన కందకాలు లెక్కయ్యలేదు.
– చాకిరేవు