విజయవాడ: తాడేపల్లిలోని జగన్ కేంద్ర పార్టీ కార్యాలయాన్ని విజయవాడకు మార్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన మీడియా గదులు, కాన్ఫరెన్సు హాల్ లను మంగళవారం లేల్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ, మందపాటి శేషగిరిరావు ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్నటువంటి కార్యాలయాన్ని విజయవాడకు మార్చడం జరిగిందన్నారు. ఈనెల పది నుంచి జగన్ ఇక్కడి నుంచి కార్యకలాపాలు చేయనున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఇలా చేశామన్నారు.