– మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు
మంగళగిరి : ఎన్నికల తంతు పూర్తి చేసుకొని లండన్ పారిపోయేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తెలిపారు. జగన్ రూ.500 కోట్లు ఖర్చు చేసి విశాఖలోని రుషికొండను బోడిగుండు చేసి ఆ స్థానంలో ఓ గొప్ప ప్యాలెస్ నిర్మించుకున్నారు. కొద్దిరోజుల్లో వైజాగ్ లో క్యాంప్ ఆఫీస్ పేరిట జగన్ ఆ ప్యాలెస్ లో ఫ్యామిలీ పెట్టనున్నారు.
జగన్ కుటుంబం రుషికొండ ప్యాలెస్ కు త్వరలో వెళ్లబోతోంది. విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే విమానాన్ని వైజాగ్ నుంచి వెళ్లేలా మార్చారు. ఎన్నికల తంతు పూర్తిచేసుకొని విశాఖపట్నం రుషికొండ ప్యాలెస్ నుంచి సింగపూర్ విమానంలో జగన్ రెడ్డి కుటుంబం లండన్ పారిపోబోతోంది.
జగన్ అఘాయిత్యాలతో అమరావతి రైతుల అగచాట్లు
జగన్ అఘాయిత్యాల వల్ల అమరావతి రైతులు కొంతమంది జైళ్లకెళ్లగా.. మరికొంతమంది గుండెపోటుతో ప్రాణాలర్పించారు. ప్రభుత్వ భవనాల్ని, సచివాలయాన్ని తాకట్టు పెట్టే హక్కు జగన్ కు ఎవరిచ్చారు? రాష్ట్రానికి12 లక్షల కోట్లు అప్పు తెచ్చి జగన్ ఏం చేశారు?చంద్రబాబు రూ.68 వేల కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను పరుగులెత్తించారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేస్తే.. జగన్ అనేక ప్రాజెక్టులను పడకేయించారు. నిన్న విశాఖ ప్రభుత్వ కార్యాలయాలు, నేడు రాష్ట్ర సచివాలయం, రేపు ప్రయివేట్ భూములు ఇలా తాకట్టు పెడ్తు పోతున్నారు.
చార్జీల మోతతో చుక్కలు చూపిన జగన్
ఆర్టీసీ ఛార్జీలు, నిత్యవసర వస్తువుల ధరలు, చెత్తపన్ను, విద్యుత్ ఛార్జీలతో జనం విలవిలలాడుతున్నారు. సెంటు పట్టా పేరుతో జగన్ రూ. 7 వేల కోట్లు లూటీ చేసింది వాస్తవం కాదా? చంద్రబాబు పోలవరాన్ని 72 శాతం పూర్తి చేయిస్తే, జగన్ ఏం చేశాడు? జగన్ నాడు-నేడు పథకంలో రంగులు వేయడం, ప్రహరీగోడ, మట్టి, ప్లాస్టింగ్ పనుల్లో లూటీ చేశాడు. కోర్టుల్లో కేసులు వేయడానికి వందల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. రాయలసీమ ద్రోహే కాక రైతాంగ ద్రోహిగా కూడా జగన్ మారారు.
జగన్ కు సచివాలయాన్ని తాకట్టు పెట్టే అధికారం ఎవరిచ్చారు?
ఎవరి ఆస్తులని సచివాలయాన్ని జగన్ తాకట్టు పెట్టారు? తాడేపల్లి ప్యాలెస్ ని, హైదరాబాద్ లోని లోటస్ పాండ్ ని, ఇడుపులపాయిలోని ఎస్టేట్ ను, కడపలోని ఎస్టేట్ ని, మద్రాస్, కోయంబత్తూరు సముద్ర తీరాన ఉన్న భవనాలు, బెంగళూరులోని భవనాలను తాకట్టు పెట్టాలిగానీ ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టడానికి జగన్ కు అధికారం ఎవరిచ్చారు?
నవరత్రాల విడుదల సమయంలో, మేనిఫెస్టోలో, పాదయాత్రలో జనాలకు ముద్దులు పెట్టేటప్పుడు ప్రభుత్వ భవనాలను తాకట్టు పెడతానని చెప్పలేదు. ఇటీవల వైజాగ్ లో 24 ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, కాలేజీలు తాకట్టు పెట్టి 25 వేల కోట్లు అప్పులు తెచ్చారు. తెచ్చి ఏం చేశారో ప్రజలకు తెలపాలి. ఆర్ అండ్ బి ఆస్తులన్నీ తాకట్టు పెడుతున్నారు. రోడ్లకు 7 వేల కోట్లు అప్పు తెచ్చారు.ఏం చేశారో కూడా ప్రజలకు తెలియాలి. చంద్రబాబు ఇరిగేషన్ ను స్వర్ణ యుగంగా మార్చారు.
రాష్ట్రంలోని ఏ రోడ్డైనా బాగుందా?
రాష్ట్రంలో ఎక్కడైనా ఏ రోడ్డైనా బాగుందా. బాగున్న ఒక్క ఆర్ అండ్ బి రోడ్డును చూపగలరా? ఈ రోడ్లపై ప్రయాణం చేయలేక అనేకమంది ఆసుపత్రుల పాలవుతున్నారు. వందలాది మంది చనిపోతున్నా జగన్ కు చీమ కుట్టినట్లు కూడా లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు, ఆర్ అండ్ బి, పంచాయతీ రోడ్లపై జగన్ ఒకసారి నడిస్తే రహదారుల దుస్థితి మీకే అర్థమౌతుంది.
చెత్తమీద కూడా పన్ను వేసే చెత్త ప్రభుత్వం జగన్ ది
చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం జగన్ ది. జగన్ చేసేవన్నీ చెత్త, దుర్మార్గపు పనులే. దేశంలోని ఏ రాష్ట్రానికి కూడా చెత్తపై పన్ను వేయాలనే ఆలోచన రాలేదు. కేవలం జగన్ కు మాత్రమే వచ్చింది. జగన్ కు పరిపాలనపై పట్టులేదు. అందుకే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. జగన్ దళారులతో కుమ్మక్కై రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. 3 సార్లు బస్ ఛార్జీలు పెంచారు. ఒక్కొక్కరి మీద 8 లక్షల రూపాయలు తలసరి అప్పు ఉంది. రాష్ట్ర రాజదాని కోసం రైతులు 34 వేల ఎకరాలు ఇస్తే.. చంద్రబాబు ఆ భూముల్లో సెక్రటేరియేట్, హైకోర్టు భవనాలు నిర్మించారు.
హూ కిల్డ్ బాబాయ్ కి సమాధానం చెప్పాలి
హూ కిల్డ్ బాబాయి అని జనం హోరెత్తిస్తుంటే జగన్ మాత్రం మౌనం పాటిస్తున్నాడు. అవినాష్ రెడ్డి రిమాండ్ రోపోర్టు బయటికి రాలేదు. కోర్టుల నుంచి తప్పించుకోవచ్చుగానీ ప్రజా కోర్టు నుంచి జగన్, అవినాష్ రెడ్డి లాంటివారు తప్పించుకోలేరు.
మద్యం ద్వారా జనాన్ని ముంచారు
ప్రభుత్వ మద్యం సీసాల్లో జగన్ బ్రాండ్ మద్యం నింపి అమ్మి, ప్రజల ప్రాణాలను బలిగొటున్నారు. అనేకమంది మహిళల పుస్తెలను తెంచారు.
2024 కురుక్షేత్ర సంగ్రామం ఎప్పుడు జరిగినా తెలుగుదేశానిదే గెలుపు
2024 కురుక్షేత్ర సంగ్రామం ఎప్పుడు జరిగినా తెలుగుదేశానిదే గెలుపు. జగన్ దోపిడి, అవినీతి కార్యక్రమాలకు త్వరలో పుల్ స్టాప్ పడనుంది. తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారు. ఈ నా ప్రెస్ మీట్ చూసి జగన్ టీవీలు పగులగొడతావో, లేక జగన్ చెంచాలతో తిట్టిస్తాడో చూడాలని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తెలిపారు.