– అందుకే మమ్మల్ని పోలవరం ప్రాజెక్టుకు పోనీయడం లేదు
.- మంత్రులు, మీడియాను బస్సులో పోలవరం తీసుకువెళ్లే ధైర్యం ఉందా జగన్ రెడ్డి ?
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఛాలెంజ్
ఎన్టీఆర్ జిల్లా : జూలైలో గోదావరికి వరద వచ్చే లోపు 1000 కోట్లు ఎత్తేయడానికి ముఖ్యమంత్రి మమ్మల్ని పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్ళనివ్వలేదు? నేను ఛాలెంజ్ చేస్తున్న . వైసీపీ ఎమ్మెల్యేలను, మంత్రులను, మీడియాను ఏపీఎస్ఆర్టీసీ బస్సు పెట్టి డ్యామ్ సైట్ లోకి తీసుకు వెళ్లే దమ్ము నీకుందా జగన్ రెడ్డి ? చంద్రబాబు వస్తే లారీలు ప్రోక్లైన్లు అడ్డం పెట్టారు.. మొన్న నేను వస్తే పోలీసులతో అడ్డగించి మమ్మల్ని బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ లో పెట్టారు.
పోలవరం డ్యాంలో వెయ్యి కోట్లు బిల్లులు చేసుకోవడానికి ముఖ్యమంత్రి పోలవరం పర్యటనలకు అడ్డుపడుతున్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ పడ్డ గుంతలు సైజు ఎంత ఉన్నాయి ? మీరు ప్రతిరోజు చేసే పని ఎంత క్యూబిక్ మీటర్లు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ముఖ్యమంత్రిగా ఉందా ? ఇరిగేషన్ మంత్రికి ఉందా ?
చంద్రబాబు నాయుడు 72% పోలవరం పనులు పరుగులు పెట్టిస్తే… రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి నాశనం చేశారు ఇవాళ 1500 కోట్ల బిల్లులు చెల్లించాడు. పి ఎల్ ఆర్ ప్రాజెక్ట్స్ ఎంపీ మిథున్ రెడ్డిది 600 కోట్లు .. పి ఎల్ ఆర్ రాఘవ జాయింట్ వెంచర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సొంత మనిషి ! డిఎస్ఆర్ వీఆర్కేఎస్ మేడ రఘునాథరెడ్డి 250 కోట్లు ఎమ్మెల్యే తమ్ముడు జాయింట్ వెంచర్, MRKR కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్. 150 కోట్లకు కక్కుర్తి పడి చిన్న చిన్న ఏజెన్సీలను నాశనం చేసి సి ఎఫ్ ఎం ఎస్ తుంగలో తొక్కి దోపిడీ కార్యక్రమం చేస్తున్నాడు.
పంచాయతీ రాజ్ లో ఒక్క గుంత పూడ్చేవారు లేరు. లక్ష ఐదు వేల కుటుంబాల పోలవరం నిర్వాసితుల ఊసే పట్టలేదు. పోలవరం నిర్వాసితులు ఉసురు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగులుతుంది. న్యాయస్థానం, న్యాయవాదులపై రిక్కీ నిర్వహించే స్థాయికి వచ్చారంటే పోలీసులు వైసీపీ నాయకులు ఏవిధంగా ములాకత్ అయ్యారు అర్థమవుతుంది !
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో రైతాంగానికి ఖరిప్ వస్తున్న తరుణంలో కాల్వలు అన్ని పారుదల అయ్యే అవకాశం లేకుండా పోయింది.అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. జూన్ మొదటి వారంలో నీరు వదిలామని చాలా బడాయి కబుర్లు చెప్పారు, నేను అడుగుతున్నాను, కృష్ణ డెల్టా, గోదావరి డెల్టా ఎప్పుడూ నీరు వదిలారు. ఏ కాల్వకు నీరు వెళ్ళాయి, ఏ జిల్లాకి ఏంత నీరు వెళ్ళాయి చెప్పే ధైర్యం ఇరిగేషన్ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా?
సాగునీటి రంగంలో కాల్వల పరిస్థితి అధ్వానంగా ఉంది.పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి రెండు సంవత్సరాలు అవుతోంది, ఆ గేటు నిర్మాణ పనులు ఎక్కడ ఉన్నాయి.
గుండ్లకమ్మ మూడు గేట్లు ఇబ్బంది వచ్చింది ఎంతో ఖర్చు అవ్వదు పూర్తి చేయడానికి కానీ చేయడం లేదు, జేసిబి లు పెట్టీ ఇసుక తోడుకొవడానికి గేట్లు రిపేర్లు చేయడం లేదు. టెండర్లు ఇంకా పిలుస్తునే ఉన్నారు, ఇసుక తోడుకొవడానికి గేట్లు మరమ్మతులు చేయకుండా అపుతున్నారు
వైవీ సుబ్బారెడ్డి విశాఖపట్నం పోలీస్ కమీషనర్ ఎప్పుడు అయ్యారు? కేసు విచారణలో ఉండగా విశాఖ కమీషనర్ ముఖ్యమంత్రిని కలిశాడు, అధికారికంగా కలిసారా, అనధికారికంగా సమాధానం చెప్పాలి.
వైవీ సుబ్బారెడ్డి కి చెబితే మీడియాకు తెలిసేది కాదు, పత్రికలకు తెలిసేది కాదు, కిడ్నాప్ బయటకు వచ్చేది కాదు, గంజాయి బ్యాచ్ బయటకు వచ్చింది, ఇలా జరిగిందని ఎంపీకి తెలియగానే సుబ్బారెడ్డి కి చెబితే బయటకు వచ్చేది కాదు కదా అని చెప్పింది ఎవరు?
హైదారాబాద్ పోతే పో మాకు వచ్చే నష్టమేమీ, ఇంగ్లీష్ పత్రికకు ఎందుకు చెప్పావు అని అంటారా? ఈ సిగ్గులేని ప్రభుత్వం సిగ్గుపడాలి, నీ పార్టీ ఎంపీ వ్యాపారం హైదరాబాద్ లో చేసుకుంటాను అంటే పోతే పో అంటారా 175 సీట్లు కావాలన్న ముఖ్యమంత్రి , 20 మంది ఎమ్మెల్యేలు అడ్రస్ లేరు గడపలో అని అంటున్నాడు
మైక్ ఉందని నేనే మాట్లాడేది అన్నట్లు ఎమ్మెల్యేలను కూర్చో అన్నావు, సాయన్న ముసలోడు అన్నావు, సాయన్న ముసలోడు అయితే జగనన్న రేపు ముసలోడు అవడా? పెద్దవారి పట్ల జగన్ రెడ్డి అహంకారపూరిత వైఖరి ఎలా ఉందో చూడండి, 99.59 పనులు నువ్వు పూర్తి చేస్తే గడప గడపకు వెళ్ళడానికి నీ ఎమ్మెల్యేలు ఎందుకు భయపడుతున్నారు? 3 లక్షల మందిని మన మీదకి పంపుతున్నాడు, దేనికి ఓట్లు పీకడానికి?
జగన్ రెడ్డి రెండు నమ్ముకున్నాడు, ఒకటి ఓట్లు పీ కింది, దొంగ ఓట్లు చేర్చడం, రెండు నియోజకవర్గానికి 50 కోట్లు డంప్ చేశాడు అవినీతి సొమ్ము. దోచుకున్న డబ్బు లిక్కర్ షాప్ లో రోజు 2 వేల నోట్లు మార్చుతున్నారు, వ్యవస్థలు నిద్రపోతున్నాయి, రోజు తాగే సామాన్యుడి దగ్గర 2 వేల నోట్లు ఎక్కడివి ?