– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
జగన్ చేసిన పాపాలు రాయలసీమకి శాపాలుగా మారుతున్నాయి. జగన్ చేసిన నేరాలు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి ఉరివేస్తున్నాయి. అక్రమాస్తుల కేసుల మాఫీ కోసం ప్రత్యేకహోదా వదులుకున్నాడు. రుషికొండ గుండు కొట్టిన కేసు తప్పించుకునేందుకు విశాఖ రైల్వేజోన్ కి నీళ్లొదిలాడు. బాబాయ్ ని చంపించేసిన కేసులో తమ్ముడిని రక్షించుకునేందుకు ఏకంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుని ప్రశ్నార్థకం చేశాడు. రాయలసీమ బిడ్డనంటూ క్యాన్సర్ గడ్డలా పీడిస్తున్నాడు. జగన్ సర్కారు దారుణ వైఫల్యం వల్లే కృష్ణాజలాల కేటాయింపులు పునఃసమీక్ష జరుగుతోంది. ప్రజలారా జగన్ కి ఇచ్చిన ఒక్క చాన్స్‌తో ఏమేమి కోల్పోయారో గుర్తించండి. రాయలసీమ సాగు,తాగునీటి అవసరాలు తీర్చే కృష్ణాజలాలలో న్యాయబద్ధమైన వాటా కోల్పోతే, రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉంది.