– అధికారం కోల్పోయిన మాజీ సీఎంకు మతి భ్రమించింది
– అబద్దాలతో ప్రజలను నమ్మించాలని వైసీపీ అధినేత ఆరోపణలు
– జగన్ వద్ద అంబానీ, అదానీ, టాటా, బిర్లాలకు లేనన్ని ఆస్తులు
– తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ. లక్షల కోట్లు దోచిన జగన్
– వైఎస్ హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణలు
– విజయసాయి, జగన్ గత ఐదేళ్లు గాడిదల్ని కాశారా?
– నిప్పులు చెరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి
మంగళగిరి: మాజీ సీఎం జగన్ రెడ్డికి అవినీతి, ధనదాహం, అధికార పిచ్చి పరాకాష్ఠకు చేరిందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసత్యాలతో ప్రజలను నమ్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ ఆరోపణలు చేస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికార ఆక్రందన చూస్తే రాష్ట్ర ప్రజలకు భయం వేస్తోంది. అయిదేళ్ళు రాష్ట్ర ప్రజలను తొక్కిపెట్టి, ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలనతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి, రాష్ట్రాన్ని అప్పులతో సర్వనాశనం చేసి, మళ్ళీ ఈ రోజు అధికారం కోసం ప్రజల్లోకి వచ్చి, అధికారం ఎప్పుడెప్పుడు వస్తుందా అని పాకులాడుతున్నారు. మళ్ళీ జగన్ రెడ్డికి అధికారం ఇస్తే మనల్ని బతకనిస్తాడా? అని ప్రజలు భయపడిపోతున్నారన్నారు.
20 ఏళ్లలో రూ. 8 లక్షల కోట్లు ఎలా వచ్చాయి జగన్ రెడ్డి?
2004లో జగన్ ఐటీ డిక్లరేషన్ కేవలం రూ. 9 లక్షలే, నేడు జగన్ ఆస్తులు రూ. 8 లక్షల కోట్లు! ఇవన్నీ ఎలా వచ్చాయో జగన్ సమాధానం చెప్పాలి. 2024లో జగన్మోహన్ రెడ్డి కుటుంబ ఆస్తుల విలువ దాదాపు రూ. 800 కోట్లు చూపించారు, అంటే అనతికాలంలో ఇంత సంపాదించారంటే ఎంత అవినీతి చేసి ఉంటారో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి అన్నారు.
అంబానీ, టాటా లాంటి వారికి కూడా సాధ్యపడలేదు. ఇంత తక్కువ సమయంలో ఇంత ఎత్తుకి ఎదగడానికి కారణం… జగన్మోహన్ రెడ్డిది అవినీతి సంపాదన. ఇంతపెద్ద ఎత్తున అవినీతిచేసి రాష్ట్రాన్ని దోచుకోవడానికి 2027 లో జమిలి ఎన్నికలు వస్తాయి ప్రజలు సిద్ధంగా ఉండాలని మాట్లాడుతున్నారు. అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మరోసారి ప్రజలను వంచన చేయడానికి, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి జగన్ రెడ్డి పన్నాగాలు పన్నుతున్నారని శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు.
కన్నతల్లి అంటేనే లెక్కలేని జగన్‌కి ప్రజలు ఓ లెక్కా?
ప్రజాస్వామ్యంలో బతగడానికి జగన్మోహన్ రెడ్డికి అర్హత ఉందా అని ఆలోచించుకోవాలి. ఇంత అవినీతి చేసి, తల్లి, చెల్లిని మోసం చేసిన వ్యక్తి మళ్ళీ ప్రజలలోకి ఏ విధంగా వస్తాడు? తల్లే జగన్మోహన్ రెడ్డికి లెక్కలేనప్పుడు రాష్ట్ర ప్రజలు ఒక లెక్కా? ప్రజలు ఈ విషయాలను కూడా ఆలోచించాలి. నవరత్నాలు పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేశారు.. నవమోసాలు మోసిన తల్లిని కూడా మోసం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఆలోచనలు చేస్తారో అర్ధం చేసుకోవచ్చన్నారు.
డ్రగ్స్, గంజాయి కంటే జగన్ ప్రమాదం
అవినీతిపరులందరికీ జగన్ రెడ్డి ఒక ఆదర్శం. గంజాయి, డ్రగ్స్ కంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి, దోపిడీ రాష్ట్రానికి చాలా ప్రమాదకరం. తల్లిని, చెల్లిని మోసం చేసి రాష్ట్రంలో ఓ పెద్ద అవినీతిపరుడిగా జగన్ నీచుడుగా మిగిలిపోయారు. నేడు దేశం ఇలాంటి వాళ్ళని చూసి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. వైఎస్ హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని చెప్పే విజయసాయిరెడ్డి, జగన్ రెడ్డి… గత ఐదేళ్లు గాడిదల్ని కాశారా? తల్లి చెల్లికి సమాధానం చెప్పలేక చంద్రబాబు పేరు తీసుకువస్తూ డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నారు. చంద్రబాబు తన ఆస్తులను కుటుంబ సభ్యులకు ఇచ్చారు..కావాలంటే డాక్యుమెంట్లు చూసుకోవచ్చన్నారు.
అవినీతికి జగన్ రెడ్డి బ్రాండ్
చంద్రబాబు జగన్ రెడ్డిలా అవినీతి చేసివుంటే ఈ రాష్ట్రం ఇలా ఉండేది కాదు… ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్న ఒక బ్రాండ్ చంద్రబాబు. షర్మిల రెడ్డికి సమాధానం చెప్పలేక చంద్రబాబు గురించి విజయసాయి రెడ్డి నీచంగా రాజశేఖర్ రెడ్డి మృతితో ఇరికించి మాట్లాడుతున్నారు. తొందర్లోనే విజయసాయి రెడ్డి అప్రూవర్‌గా మారి జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపుతారు. 20 ఏళ్లలో తండ్రి అధికారం, తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని క్విడ్ ప్రో కో, ఇసుక, మద్యం, భూ మాఫియా ద్వారా అత్యంత ధనిక సీఎంగా రికార్డుల్లోకి జగన్ ఎక్కారు. మాఫియా ప్రపంచానికి జగన్ రెడ్డి స్ఫూర్తిగా నిలుస్తారని శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు.
జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతిపరులకు చంద్రబాబు కంటి మీద కునుకు లేకుండా చేస్తారు. జగన్ రెడ్డిని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి చేసిన ద్రోహానికి ప్రజలకు సమాధానం చెప్పాలి. తల్లి మీద కేసులు పెట్టే చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే ఉంది, ఏ ఇంట్లో ఉండదు. ధనదాహంతో జగన్ చేసే దుర్మార్గాలన్నీ ఏదో ఒక రోజున ప్రజాగ్రహజ్వాలల్లో దహనం కాక తప్పదు అని శ్రీనివాసులు రెడ్డి అన్నారు.