-ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా జగన్ బతుకు మారలేదు
• తన అసమర్థత, అవినీతి, వైఫల్యాలు, దుర్మార్గాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే జగన్ ఫేక్ ప్రచారానికి తెరలేపాడు
• టీడీపీ రాష్ట్రఅధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీమంత్రి జవహర్, మహిళానేత వంగలపూడి అనిత, మాజీఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుల్ని తన ఫేక్ పబ్లిసిటీలో పావులుగా మార్చాడు
• చంద్రబాబు, లోకేశ్ సహా, టీడీపీ నేతలు అననిమాటలు అన్నట్లుగా సాక్షిమీడియాతోపాటు, తనకుబాకాఊదే నీలిమీడియా, వైసీపీసోషల్ మీడియాలో జగన్ నీతిమాలిన ప్రచారం చేయిస్తున్నాడు
మాజీమంత్రి కొల్లు రవీంద్ర
తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఫేక్ కంపెనీలుసృష్టించి, వేలకోట్లు కొల్లగొట్టిన జగన్మోహన్ రెడ్డి, 2019కి ముందు అధికారం దక్కించుకోవడానికి ఫేక్ హామీలతో ప్రజల్ని వంచించాడని, ముఖ్యమంత్రి అయ్యాక ఫేక్ పథకాలతో ఫేక్ పాలన చేస్తూ, ఫేక్ బటన్లు నొక్కుతున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!
“సాక్షిమీడియా, తనకు బాకాఊదే బ్లూమీడియా సాయంతో జగన్ ఫేక్ ప్రచారంచేస్తూ, ప్రజల్ని మోసగిస్తూ, పబ్బం గడుపుకునే ప్రయత్నాలుచేస్తున్నాడు. షాదీతోఫా, కల్యాణమస్తు పేరుతో ప్రభుత్వం పత్రికలకు, ఇతర సమాచార సాధనాలకు ఇచ్చిన ప్రకటనలే అందుకే నిదర్శనం. షాదీ తోఫా పేరుతో ముఖ్యమంత్రి నొక్కిన బటన్ తాలూకా సొమ్ము ఒక్క లబ్ధిదారుకి కూడా చేరలేదు. గతంలో టీడీపీప్రభుత్వం అమలుచేసిన పెళ్లికానుక పథకం తాలూకా ఫోటోలతో జగన్ తనమీడియాలో భారీఎత్తున ప్రచారంచేసుకోవడం సిగ్గుచేటు.
షాదీతోఫా పథకం పేరుతో జగన్ బటన్ నొక్కడమే గానీ ఎవరికీ డబ్బులు అందలేదు
నవీన్ కుమార్ (సన్ ఆఫ్ నర్రాపుల్లయ్య) కు గతంలో టీడీపీప్రభుత్వం పెళ్లికానుక కింద ఆర్థిక సాయం చేసింది. అప్పుడు వారు దిగిన ఫొటోల్ని జగన్ ఇప్పుడు తనప్రభుత్వ ప్రచారానికి వినియోగించుకోవడం నిజంగా నీచాతినీచం. అలానే విదేశీవిద్య పథకం లబ్ధిదారుల విషయం లో కూడా జగన్ అతని బ్లూమీడియా విషప్రచారమే చేస్తోంది. లబ్ధిదారుల జాబితాలో చూపిన వారి పేర్లే మరలా చూపుతూ, ఒక్కరే వివిధదేశాల్లోని వివిధయూనివర్శిటీల్లో చదువుతున్న ట్టు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఇలా ఫేక్ పబ్లిసిటీతో ఫేక్ పాలన చేయడం జగన్ కు మొదటి నుంచీ ఉన్న అలవాటే. అదేవిధంగా టీడీపీ రాష్ట్రఅధ్యక్షులు అచ్చెన్నాయుడు అననిమాట ల్ని అన్నట్టుగా దుష్ప్రచారానికి తెరలేపారు. ప్రభుత్వం అమరావతిప్రాంతంలో ఇళ్లస్థలాలు ఇవ్వడాన్ని తాముగానీ, తమపార్టీగానీ ఎప్పుడూ వ్యతిరేకించలేదు. రాజధానికి భూములి చ్చినరైతులతో గతప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను గౌరవించి, వాటిప్రకారం రైతులకు, ఆప్రాంతప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మాత్రమే కోరుతున్నాం. తాము ప్రజలగురిం చి ఆలోచించి మాట్లాడుతుంటే, జగన్ అతని నీలిమీడియా తమమాటల్ని, ఆలోచనల్ని వక్రీ కరిస్తూ విషప్రచారంచేస్తోంది.
బాబాయ్ హత్యకేసు నుంచి బయటపడేందుకు, వివేకా కుమార్తె డాక్టర్ సునీతపై విషప్రచారం చేయిస్తున్నాడు
అమ్మఒడి పథకాన్ని ఆపేస్తామని లోకేశ్ గారుఅన్నట్టు, మాజీమంత్రి జవహర్ చెప్పినట్టు, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడినట్టు ఎంతకాలంఇలా ఫేక్ ప్రచారంతో పబ్బం గడుపుకుంటారని జగన్ ను, అతని నీలిమీడియాను, వైసీపీపేటీఎం బ్యాచ్ ని ప్రశ్ని స్తున్నాం. చంద్రబాబు, లోకేశ్ గార్లే లక్ష్యంగా గతంలో కూడా ఇదేవిధమైన నిందారోపణలతో జగన్, అతని మీడియా, పేటీఎంబ్యాచ్ విషప్రచారంచేసి, ప్రజల్ని నమ్మించి వారిఓట్లు దండు కొని అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యమంత్రి అయ్యి 4ఏళ్లుగా అసమర్థపాలనతో రా ష్ట్రాన్ని, ప్రజల్ని నాశనంచేసిన జగన్మోహన్ రెడ్డి, తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడాని కి తన, పరబేధాల్లేకుండా అందరినీ తన విషప్రచారంలో పావులుగా వాడుకుంటున్నాడు. దివంగత వై.ఎస్.వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత తెలుగుదేశం పార్టీలో చేరబోతోంది అంటూ ఆమెపై దుష్ప్రచారానికి తెరలేపారు. తనతండ్రిని చంపినవారిని శిక్షించడంకోసం ఆమె పోరాడుతుంటే, దాన్ని జీర్ణించుకోలేకనే ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు. తప్పుడు ప్రచారం , తప్పుడు కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డిఇలా ఎన్నాళ్లు పబ్బంగడుపుకుంటాడు అని ప్రశ్నిస్తున్నాం. వైసీపీవీరాభిమాని, జగన్మోహన్ రెడ్డి అభిమాని అయిన వ్యక్తి మెడలో పసుపుకండువా వేసి, వెనక చంద్రబాబుగారి బొమ్మలుపెట్టి, అతనితో బీసీలు, ఎస్సీఎస్టీలను కించపరిచేలా మాట్లా డించి, టీడీపీవాళ్లు ఆయావర్గాలను ఇలా అన్నారు..అలా అన్నారు అంటూ విషప్రచారం మొ దలెట్టారు. అతనిపై తాము డీజీపీకిఫిర్యాదుచేస్తే ఇంతవరకు చర్యలుతీసుకోలేదు. టీడీపీలో ఎవరైనా అలామాట్లాడతారా? అసలు అలాంటివారిని మాపార్టీ దగ్గరకు రానిస్తుందా?
తన అసమర్థపాలన, వైఫల్యాలు, అవినీతి, దుర్మార్గాలు కప్పిపుచ్చుకోవడానికే జగన్ ఫేక్ ప్రచారానికి తెరలేపాడు
తన వైఫల్యాలు, తననేరాలు,ఘోరాలు, తప్పులు, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే జగన్మో హన్ రెడ్డి తెలుగుదేశంపార్టీ లక్ష్యంగా ఫేక్ వార్తలతో ఫేక్ ప్రచారంచేయిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి నారాబ్రాహ్మణి మద్ధతుఇస్తున్నట్లుగా ఫేక్ వార్తలు సృష్టించడం, టీడీపీమహిళానేత వం గలపూడి అనిత జగన్మోహన్ రెడ్డిని మరలాముఖ్యమంత్రిని చేయాలన్నట్టు దుష్ప్రచారం చేయడం, చంద్రబాబుగారు సచివాలయాన్ని రూ.180కోట్లతో నిర్మిస్తే, రూ.970కోట్లతో నిర్మిం చారని నీతిమాలినప్రచారం చేయడం, దివంగతనేత జయలలితగారి ఫామ్ హౌస్ ను నారా బ్రాహ్మణి గారుకొన్నట్లు విషప్రచారం చేయడం.. ఇవీ జగన్మోహన్ రెడ్డి ఘనతలు. ఇలాంటి చేయడంలో మాత్రమే జగన్, అతని నీలిమీడియా, పేటీఎం బ్యాచ్ సిద్ధహస్తులు. ప్రజలకు, రాష్ట్రానికి పనికొచ్చేపనులు చేయడంలో వీళ్లు చేతగాని దద్దమ్మలు.
లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్ కు సమాధానం చెప్పలేక ఆయన ఫొటోల్ని కూడా మార్ఫింగ్ చేస్తున్నారు
నారాలోకేశ్ గారు యువగళంపాదయాత్రలో గతంలో తెలుగుదేశంపార్టీ చేసిన అభివృద్ధిని చూపిస్తూ, సెల్ఫీ ఛాలెంజ్ విసురుతుంటే, ఆయనకు సమాధానంచెప్పలేక ఆఫొటోలను కూడా జగన్ మార్ఫింగ్ చేసి, తన రాజకీయానికి వాడుకుంటున్నాడు. ఆఖరికి సొంత బాబాయ్ ని దారుణంగా చంపించి, ఆయన ఫొటోల్ని కూడా తనస్వార్థరాజకీయానికి వాడు కుంటున్నాడు. ప్రచారపిచ్చితో ఇంతగా దిగజారిన ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నాం.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన విషప్రచారాన్నే జగన్ మరలా తన అధికారాంతంలో నమ్ముకున్నాడు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడుకూడా జగన్ టీటీడీకి చెందినపింక్ డైమండ్ చంద్రబాబుగారి ఇంట్లో ఉందని, డీఎస్పీపోస్టింగ్ ల్లో కమ్మవారికే చంద్రబాబు ప్రాధాన్యతఇచ్చాడని విషప్రచారం చేయించాడు. ఇలాతనకు ఏదిఅనిపిస్తే దాన్ని దుష్ప్రచారంచేసి, తనచుట్టూవారితో ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చాడు. జగన్ నడత, నడక, చేతలుఅన్నీ ఫేక్. అధికారంలోకి వస్తే జాబ్ క్యాలండర్ అని, సీపీఎస్ రద్దు అని, విద్యుత్ ఛార్జీలు పెంచనని, మద్యాన్ని పూర్తి గా నిషేధిస్తాననిచెప్పిన జగన్ ఇప్పుడు ఏంచేస్తున్నాడు? జగన్ చెప్పేదొకటి…చేసేదొకటని ప్రజలకు అర్థమైంది. ప్రజలు ఎక్కడతనను నిలదీస్తారో అన్నభయంతో వారికి ముఖంచూపిం చలేక చంద్రబాబునాయుడు గతంలో అభివృద్ధికి సంబంధించి చేసిన పనుల్నే మళ్లాచేసుకుం టూ తనమీడియాలో తనగురించి డబ్బా కొట్టించుకుంటున్నాడు. కడపస్టీల్ ప్లాంట్ ఏర్పాటు కు చంద్రబాబుగారు గతంలో శంఖుస్థాపనచేస్తే, జగన్ మరలా శంఖుస్థాపనచేశాడు. అలానే భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి నిలబడే కొబ్బరికాయకొట్టి, మమ అనిపించాడు. భావనపాడు పోర్ట్ నిర్మాణానికి మరలా శిలాఫలకం వేయడం లాంటి పనులతో బతుకుతు న్న జగన్ బతుకుఫేక్ బతుకు కాదా? గతంలో జీ.ఎం.ఆర్ సంస్థను తప్పుపట్టిన జగన్, మరలా దానికే భోగాపురం విమానాశ్రయ నిర్మాణ బాధ్యతలు అప్పగించడంలోని ఆంతర్యం ఏమిటి? అలానే మెగా సంస్థను తప్పుపట్టి, మరలా పోలవరం నిర్మాణాన్ని మెగా కృష్ణారెడ్డికే అప్పగించలేదా? బందర్ పోర్ట్ నిర్మాణాన్నికూడా మెగా కృష్ణారెడ్డికే కట్టబెట్టాడు. ఇప్పటికే పోర్ట్ డిజైన్ పూర్తిగా మార్చేశారు. నిర్మాణంపేరుతో బ్యాంకులనుంచి లోన్లుతీసుకొని చివరకు పనులు ఆపేసి జారుకుంటారు. ఇలాఎక్కడికక్కడ ఫేక్ పనులతో, ఫేక్ పాలనతో బతుకుతు న్న ఫేక్ ముఖ్యమంత్రి పెద్దచిన్నా తేడాలేకుండా రామోజీరావు లాంటి వారిపై విమర్శలు చేస్తున్నాడు. పోలీసుల్ని, ప్రైవేట్ సైన్యాన్ని అడ్డంపెట్టుకొని బతుకుతున్న ముఖ్యమంత్రికి బుద్ధిచెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.” అని రవీంద్ర తేల్చిచెప్పారు.