Suryaa.co.in

Andhra Pradesh

జగన్ జీవితమంతా అబద్దాలమయమే

అక్రమ సంపాదనతో పొరుగు రాష్ట్రాల్లో ప్యాలెస్ లు కట్టుకున్న జగన్ చంద్రబాబుని విమర్శించడమా?
అసలైన దోపిడిదారు, పెత్తందారు, గొజదొంగ జగనే
పేదల పెన్నిధి చంద్రబాబు నాయుడే
– టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ

నేడు సామర్ల కోట సభలో సీం జగన్ పచ్చి అబద్దాలతో ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేశారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ద్వజమెత్తారు. గురువారం నాడు ఆమె మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…. రూ. 43 వేల కోట్లు దోచుకుని 10 ఏళ్ల నుంచి బెయిల్ పై తిరుగుతున్న జగన్ చంద్రబాబు నాయుడిని విమర్శించటం సిగ్గుచేటు. 2004 ఎన్నికల అఫడవిట్ లో జగన్ ఆస్తుల విలువ రూ. 1 కోటి 30 లక్షలే. నేడు దేశంలోనే రిచెస్ట్ సీఎం ఎలా అయ్యారు?

అక్రమ సంపాదనతో పొరుగు రాష్ట్రాల్లో ప్యాలెస్ లు కట్టుకున్న జగన్ చంద్రబాబుని విమర్శించడమా? అసలైన దోపిడిదారు, పెత్తందారు, గొజదొంగ జగనే. ఎన్నికల ముందు 25 లక్షల ఇళ్లు కట్టిస్తామని జగన్ చెప్పారు. కానీ కేవలం 4 లక్షలు ఇళ్లు కట్టి, చంద్రబాబు నాయుడు కట్టిన 3 లక్షల టిడ్కో ఇల్లు కలిపి తామే 7 లక్షల ఇళ్లు కట్టినట్టు అబద్దాలు చెప్తూ సిగ్గులేకుండా మేం కట్టిన ఇళ్లను పేపర్లలో పోటోలు వేసి ప్రకటనలిస్తున్నారు.

జగన్ చెప్పిన లెక్కల ప్రకారం ఇళ్ల స్థలాల పంపిణీకి, ఇళ్ల నిర్మాణానికి రూ. మీ 2 లక్షల కోట్లు అవుతుంది. కానీ నాలుగేళ్ల నుంచి బడ్జెట్ మీరు హౌసింగ్ కి కేటాయించింది కేవలం 23 వేల కోట్లే . ఇళ్ల పట్టాల పేరుతో రూ. 7 వేల కోట్ల దోపిడి చేసిన పెత్తందారులు మీరు కాదా జగన్ ? పేదలపై జగన్ కి అంత ప్రేమ ఉంటే ? నాలుగున్నరేళ్ల నుంచి చంద్రబాబు నాయుడు కట్టిన టిడ్కో ఇళ్లు ఎందుకు పంపిణీ చేయలేదు? అమరావతి ప్రాంతంలో కట్టిన 4500 ఇళ్లకు మౌళిక సదుపాయాలు ఎందుకు కల్పించలేదు? చంద్రబాబు నాయుడు కట్టిన గృహాల్ని సిగ్గులేకుండా తమరే కట్టినట్టు పత్రికల్లో పోటోలు వేసుకుంటున్నారు.

ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 2.70 లక్షలు ఇచ్చామని చెబుతున్నారు, కానీ ఇందులో కేంద్రం వాటా 1.80 లక్షలు మిగిలిన రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఇవ్వకుండా బిల్లులు ఎగ్గొట్టిన హీన చరిత్ర జగన్ రెడ్డిది. ఇళ్ల స్ధలాల కోసం సేకరించిన 71,811 ఎకరాల్లో నిజంగా కొన్నదెంత? అందులో ప్రభుత్వ భూములెంత? వాటిలో మీ కమీషన్లు ఎంత? ఇది చెప్పే దమ్ము జగన్ కి ఉందా?

చంద్రబాబు నాయుడు పేదల పెన్నిధి
రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ లో సైతం పేదలకు 10 లక్షల 73 ఇళ్లు కట్టిన ఘనత చంద్రబాబు నాయుడుదే. పక్కా గృహాల కోసం కేంద్రం ఇచ్చే రూ. 1.50 లక్షలతో పాటు అదనంగా రూ. 1 లక్ష ఇచ్చి పేదలకు ఇళ్లు కట్టించాం. గ్రామీణ ప్రాంతాల్లో 7 లక్షల 76 వేల 456 ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 2.62,216 ఇళ్లు నిర్మించాం. వాటితో పాటు గతంలో నిలిచిపోయిన 2,17,375 గృహాల్ని నిర్మించాం. భూమి కొనుగోలు కింద 5 వేల ఎకరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంపిణి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాజకీయ నాయకుడు ఏదైనా చేస్తానంటే చేయాలని జగన్ అన్నారు. మరి ఆయన అమరావతి ఎందుకు నిర్మించలేదు?

సీపీఎస్ ఎందుకు రద్దు చేయలేదు? మద్యపాన నిషేదం ఎందుకు చేయలేదు? అయితే జగన్ రాజకీయ నాయకుడు కానట్టే కదా? నా ఎస్సీలు, నా ఎస్టీలంటున్న జగన్ ..దళితుడ్ని చంపిన అనంతబాబును పక్కన పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? డా. సుధాకర్ ని పిచ్చివాడిగా ముద్ర వేసి చంపితే ఎందుకు నోరు మెదపలేదు? బీసీ రిజర్వేషన్లలో 10 కోత కోసి 16,800 మందిని రాజకీయంగా ఎదగకుండా అడ్డుకున్న జగన్ కి నా బీసీలు అనే హక్కుందా?నాలుగున్నరేళ్లలో 26 మంది బీసీల్ని వైసీపీ కార్యకర్తలు పొట్టనపెట్టుకున్నారు, వారిపై ఏం చర్యలు తీసుకున్నారు? రేపల్లెలో తమ అక్కను వేధించిన వారిని ప్రశ్నించిన బీసీ విద్యార్దిని చంపిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారు?

నా మైనార్టీలంటున్న జగన్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యపై ఎందుకు మాట్లాడలేదు?అసలైన పెత్తందారులు మీరే. బీసీలు అధికంగా ఉన్న ఉత్తరాంధ్రకు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిని, కాపులు ఎక్కువగా ఉన్న గోదావరి జిల్లాలకు మిధున్ రెడ్డి, అయోద్య రామిరెడ్డిలకు పార్టీ బాద్యతలు అప్పగించారు. పెత్తందారులు మీరు కాదా?

నాలుగున్నరేళ్ల నుంచి భూ కబ్జాలు, మాఫియాలతో ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న దోపిడి దారులు, పెత్తందారులు, గజ దొంగలు మీరే. 43 వేల కోట్లు దోచుకుని 10 ఏళ్ల నుంచి జగన్ బెయిల్ పై తిరుగుతున్నారు. జగన్ లా చంద్రబాబుకి వ్యవస్ధల్ని మ్యానేజ్ చేయటం రాదు. వైసీపీ అక్రమాలు, అవినీతి ప్రశ్నిస్తున్నారనే చంద్రబాబు నాయుడిని అక్రమంగా జైల్లో పెట్టారు. జైల్లో పెట్టింది చంద్రబాబు నాయుడిని కాదు, రాష్ట్ర ప్రజల్ని అన్న సంగతి జగన్ గుర్తుంచుకోవాలని అనురాధ హెచ్చరించారు.

LEAVE A RESPONSE