-జగన్ కు పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో బాప్టిజం జరిగిందో లేదో చెప్పాలి
-కాబట్టే భారతి యాగానికి రాదు
-అసలు భార్యాభర్తలిద్దరు గుళ్లకు ఎందుకు కలసిరారు?
-భార్యా, భర్త కలిసి చేసేది యజ్ఞం
-జగన్ తిరుమలకు వెళ్లి సంతకం పెట్టలేదు
-వెంకటేశ్వర స్వామి కూడా జగనన్నే మా భవిష్యత్తు అనాలా?
-జగన్ ఇచ్చిన సీబీఐ ఛార్జిషీట్ లో క్రిష్టియన్ అని క్లియర్ గా ఉంది. అయినా డ్రామాలు ఎందుకు?
-క్రిష్టియానిటి ప్రకారం నడుచుకోవాలి
-వైఎస్ రాజశేఖర్ రెడ్డి దహన సంస్కారాలు క్రిష్టియానిటి ప్రకారమే చేశారు
-జగన్ కు హైదరాబాద్ లో ఉన్న ఇంటిపై క్రాస్ పెట్టి ఉన్నారు
-ఫ్యామిలీ అంతా క్రిష్టియన్. నీవు మాత్రం హిందువా?
నీ ఇల్లు నాది కాదంటావు, సాక్షి నాది కాదు, నీ మతం నీది కాదంటావు.నేను హిందువునని గర్వంగా చెప్పగలను. నీవు చెప్పగలవా?
-వైఎస్ చనిపోయిన స్థలమైన స్మృతివనం వద్ద నారా లోకేష్ నివాళులర్పించడం టీడీపీ సంస్కృతికి నిదర్శనం
-టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన స్థలమైన స్మృతివనం వద్ద నారా లోకేష్ నివాళులర్పించడం ఆయన సంస్కృతికి అద్దం పడుతోంది. సంస్కారం గురించి జగన్, వైసీపీ నాయకులు తెలుసుకోవాలి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంస్కారవంతులు. కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలలో లోకేశ్ పాదయాత్ర నిర్వహించారు. ఎక్కడ చూసినా జనం నీరాజనాలు పలికారు.
కర్నూలు జిల్లా ప్రజలు 2014 ఎన్నికల్లో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించారు. వారి చేతే కర్నూలులో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపాం. కర్నూలు జిల్లాకు ఎయిర్ పోర్టు, మెగా సోలార్ పార్క్, మెగా సీడ్ పార్క్, జెయిన్ ఇరిగేషన్ ప్రాజెక్టు, 3వేల కోట్ల రూపాయలతో ఇరిగేషన్ ప్రాజెక్టులు తేవడం జరిగిది. 2019 ఎన్నికల్లో 14కు 14 వైసీపీకే ఇచ్చారు. 2 ఎంపీలకూడా ఇచ్చారు. వీరు కర్నూలు జిల్లాకు ఏం ఉద్ధరించారో తెలపాలి. లోకేశ్ విసిరిన ఛాలెంజ్ కు కర్నూలు జిల్లాలోని 14 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా ఆ చాలెంజ్ ను స్వీకరించలేదు. మేం ఇది చేశాం అని ఒక్క ఎమ్మెల్యే కూడా ముందుకు వచ్చి చెప్పిన పాపాన పోలేదు.
కర్నూలు జిల్లా అభివృద్ధికి ఏ ఎమ్మెల్యేగానీ, ఏ ఎంపీగానీ ఏమీ చేయలేదు. లోకేశ్ విసిరిన ఛాలెంజ్ ను మేం స్వీకరిస్తున్నామని, కర్నూలు జిల్లాకు మేం ఇది చేశామని ప్రజలకు ధైర్యంగా వైసీపీ నాయకులు చెప్పగలరా? టీడీపీ నిర్మించిన వాటికి జగన్ రిబ్బన్ కటింగ్ లు చేస్తున్నాడు. పెళ్లి చేసుకునేది ఒక్కసారే మళ్లీ మళ్లీ పెళ్లీళ్లు చేసుకోరు. అని వైసీపీ నాయకులు గ్రహించాలి.
యువగళం 100 రోజుల సెలబ్రేషన్ ను టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అందరూ చేసుకోవాలి. జగన్ యాగాలు చేస్తున్నాడు. మళ్లీ రాజు కావాలని, శతువులు పతనం చెందడానికి రాజశ్యామలయాగం చేస్తారు. సొంత డబ్బులతో యాగం చేసుకోవాలిగానీ ప్రజల డబ్బుతో యాగాలు చేసుకోవడంలో న్యాయం లేదు. సొమ్ము మాది అధికారం నీదా? హిందువులు దేవాలయాలలో కానుకలు సమర్పించుకుంటే ఆ నిధులతో యాగాలు చేసుకోవడమా?
భార్యా, భర్త కలిసి చేసేది యజ్ఞం. జగన్ భార్య భారతి హిందువు కాదు.. కావున ఆమె యాగానికి రాదు. మరి జగన్ క్రిష్టియనా? హిందువా? ఒంటిమిట్ట ఆలయానికి వస్త్రాలు తీసుకెళ్లేటప్పుడు కాలు బెణికింది.. వెళ్లలేకపోయారు. 24 గంటల్లో కాలు ఎవరు బాగుచేశారు ఆ డాక్టర్ పేరు చెప్పాలి. జగన్ ఊసరవెల్లి లా రంగులు మారుస్తాడు. క్రిష్టియన్ అంటాడు. హిందువు అంటాడు. ఎవరి మతం వారిది. ఏమతాన్ని అనుసరిస్తారో ఎవరికీ తెలియదు.
చంద్రబాబు, లోకేశ్ లు అన్ని మతాల వారిని గౌరవిస్తారు. అన్ని మతాలవారిని సోదరులుగా చూసుకుంటారు. జగన్ తిరుమలకు వెళ్లి సంతకం పెట్టలేదు. జగన్ ఇచ్చిన సీబీఐ ఛార్జిషీట్ లో క్రిష్టియన్ అని క్లియర్ గా ఉంది. అయినా డ్రామాలు ఎందుకు? క్రిష్టియాలిటీ ప్రకారం నడుచుకోవాలి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దహన సంస్కారాలు క్రిష్టియాలిటీ ప్రకారమే చేశారు.
జగన్ కు హైదరాబాద్ లో ఉన్న ఇంటిపై క్రాస్ పెట్టి ఉన్నారు. జగన్ మామ గంగిరెడ్డి దహన సంస్కారాలు క్రిష్టియన్ ఆచారాల ప్రకారం చేశారు. ఫ్యామిలీ అంతా క్రిష్టియన్. నీవు మాత్రం హిందువా? నీ ఇల్లు నాది కాదంటావు, సాక్షి నాది కాదు, నీ మతం నీది కాదంటావు.నేను హిందువునని గర్వంగా చెప్పగలను. నీవు చెప్పగలవా? జరగబోయే బ్రహ్మోత్సవాలకు, తిరుమల ఫంక్షన్లలో సంతకం పెట్టి వెళ్లాల్సిందే.
మాకు క్రిష్టియన్లతో ఎటువంటి వైరం లేదు. దొంగ వైఖరి వద్దు. క్రిష్టియాలిటీయే ముద్దు. ఏసుప్రభువును, చర్చి బిషప్ ని, పాస్టర్ ని, క్రిష్టియన్ సోదరులను, హిందువులను జగన్ మోసం చేస్తున్నారు. జగన్ కు పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో బాప్టిజం జరిగిందో లేదో చెప్పాలి. ఓట్ల కోసం మోసం చేయొద్దు. రాజకీయం కోసం దేవుడితో ఆటలొద్దు. నీవు క్రిష్టియన్ అయినా మేం గౌరవిస్తాం. జగన్ లో మార్పు తీసుకురమ్మని ఆ ఏసుక్రిస్తును వేడుకుంటున్నాను.
టీటీడీలో హత్యా రాజకీయాలు చేస్తున్నారు. పట్టపగలు, అందరూ చూస్తుండగా కత్తులతో దాడులు చేస్తున్నారు. తిరుమలలో వేద పాఠశాల విద్యార్థి బనియన్ కొనుక్కోవడానికి వెళితే అతన్ని కత్తితో పొడవడం జరిగింది. అక్కడ కూడా హంతకుల కుటుంబం ప్రవేశించిందా? తిరుమల పవిత్రతను కాలరాస్తున్నారు. తిరుమలలో రాజకీయ పోస్టర్లు నిషేధం. తిరుమలలో కూడా జగనన్నే మా భవిష్యత్తు అనే స్టిక్కర్లు ఏంటి? వెంకటేశ్వర స్వామి కూడా జగనన్నే మా భవిష్యత్తు అనాలా?
టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి లు నిద్రపోతున్నారు. 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు దర్శన టికెట్లను అమ్మకున్నవారి పేర్లను బయటికి లాగి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవగానే వారి భరతం పడతాం. తిరుమలలో లక్ష్మీ వెంకటేశ్వర కార్పొరేషన్ అని తిరుమలలో ఓ కార్పొరేషన్ పెట్టారు. లోకల్ ఎమ్మెల్యేలందరూ అందులో ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. తిరుమల పరువు తీస్తున్నారు.
దాదాపు 40 కుటుంబాలు తిరుమలలో వంద సంవత్సరాల నుంచి ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్నారు. ప్రస్తుతం ఎవరు, ఏమిటి? అని చూడకుండా తిరుమలలో నివాసాలకు అనుమతిస్తున్నారు. నేర చరిత్ర గలవారా? ఎవరు అని చూడాల్సిన బాధ్యత టీటీడీ, ప్రభుత్వంపై ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలో దోస 20 రూపాయలకు, రూము 5వందలకు దొరికేది. నేడు దోస రూ.200లు, గది అద్దె రూ.5000లు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి వద్ద వ్యాపార ధోరణి మాని.. భక్తి దృష్టితో వ్యవహరించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి తెలిపారు.