– మంత్రి పొన్నం ప్రభాకర్
– కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా స్మృతి స్థల్ వద్ద నివాళులు అర్పించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్ : మేము కొత్తగా పార్లమెంట్ లో అడుగు పెట్టినప్పుడు బెస్ట్ పార్లమెంటీరియన్ అయిన జైపాల్ రెడ్డి దగ్గర పార్లమెంట్ విధానాలు ,నిబందనలు నేర్చుకున్నాం. తెలంగాణ సాధనకు సంబంధించి వ్యూహాన్ని అనాడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలుగా 12 మంది అనేక వ్యూహాలకు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం.
వ్యూహాన్ని ఏర్పాటు చేసుకొని నాయకత్వాన్ని ఒప్పించి తెలంగాణ సాధించుకున్నాం. జైపాల్ రెడ్డి విద్యార్థి నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించారో ,కేంద్ర మంత్రి దాకా వరకు వారి జీవితాన్ని పారదర్శకంగా కొనసాగించారు. ఈనాటి యువత కు వారి రాజకీయ జీవితం ఆదర్శం..మార్గదర్శకత్వం
విద్యార్థి రాజకీయాలు ఉన్నాయి కాబట్టే జైపాల్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. విద్యార్థి సంఘాల రాజకీయాలు ఉండాలి నేను ఇతర నేతలంతా విద్యార్థి రాజకీయాలు ఎన్ఎస్యుఐ నుండి వచ్చాం. విద్యార్థులకు సంబంధించి రాజకీయ స్పూర్తి అవగాహన ఉన్నట్లయితే భవిష్యత్తు రాజకీయాలు పరిణతి చెందిన రాజకీయాలు వస్తాయి.
ఈనాటి యువతరాన్ని విద్యార్థి లోకాన్ని కోరుతున్న విద్యార్థులు దేశంలో ఉన్నటువంటి యువతరం నాయకుల చరిత్ర తెలుసుకోవాలి. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది.హైదరాబాద్ మెట్రో,అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ గా అనేక పట్టణాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లు ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారు.
అభివృద్ధి విషయంలో నిబద్ధత తో వ్యవహరించేవారు.అనేక సంస్కరణలు తెచ్చి బెస్ట్ పార్లమెంటెరియన్ గా అవార్డు పొందారు. అందరికీ అందుబాటులో ఉండే జైపాల్ రెడ్డి ని ఈతరం ఆదర్శంగా తీసుకోవాలి వారికి నా ఘన నివాళులు అర్పిస్తున్నా.