హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కార్యక్రమం లో భాగంగా తెలంగాణ భవన్ లో జమ్మి చెట్టును నాటిన పార్లమెంట్ మాజీ సభ్యులు వినోద్ కుమార్ .
ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు, హిందూ సంస్కృతి సంప్రదాయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జమ్మి చెట్టును ప్రతి గుడి ఆవరణలో నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తలపెట్టాలని కోరారు.
ఈ కార్యక్రమం లో రాజ్య సభ మాజీ సభ్యులు రావుల చంద్ర శేఖర్ రెడ్డి ,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, సభ్యులు గర్రెపల్లి సతీష్, ఎన్ ఎన్ రాజు. బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభ ప్రద్ పటేల్, కిషోర్ గౌడ్,కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూది మెట్ల బాలరాజు, బీ ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ,బి ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లె రవికుమార్ ,బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.