-కనీస సీట్లు గెలిపించుకుండా ముఖ్యమంత్రి పదవి అడగటం సరి కాదు
-మన బలాన్ని మనం బేరీజు వేసుకోవాలి
-ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నికల తరవాత మాట్లాడదాం
-సముచిత స్థానాల్లో గెలిపించండి, ముఖ్యమంత్రి పదవి గురించి అప్పుడు మాట్లాడుదాం
-మళ్లీ ఓడిపోవడానికి నేను సిద్ధంగా లేను
-జన సేనాధిపతి పవన్ కల్యాణ్ స్పష్టీకరణ
15 నిమిషాలు సమయం ఇస్తే మా ప్రతాపం చూపిస్తామన్న ఎంఐఎంకు 7 స్థానాలు వచ్చాయి.. ఎంఐఎంలా కాదు.. కనీసం విజయకాంత్ లా కూడా మనల్ని గెలిపించలేదు. అభిమానం ఓట్లుగా మారితేనే సీఎం అవుతారు. అజాత శత్రువును కాను.. కొంత మందికి నన్ను శత్రువుగా చూసినా ఓకే.. నన్ను ఎంత విమర్శిస్తే.. అంతగా రాటుతేలుతా.
గత ఎన్నికల్లో 30-40 సీట్లు వచ్చుంటే ఇప్పుడు సీఎం సీటు వచ్చే తీరాలి. కానీ సీట్లు లేవప్పుడు ఏం చేయగలం? ఓ ప్రాంతానికే పరిమితం అయిన ఎంఐఎంకు ఏడు స్థానాలు వస్తాయి.. రాజకీయాల్లో తన ప్రభావం చూపుతోంది. కానీ జనసేనకు కనీసం 10 స్థానాలైనా రాకుంటే ఎలా..? నాయకులు నా దగ్గరకు పిర్యాదులు చేయడానికి రాకండి, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రండి. నన్ను తిట్టలేక మనోహర్ ని తిడుతున్నారు, ఆయనపై తప్పుడు పోస్టులు సోషల్ మీడియాలో పెడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను.
మనోహర్ నన్ను అడగకుండా ఒక్క మాట కూడా బయట మాట్లాడరు, అది గుర్తుంచుకోండి, ఆయనను ఎవరైనా ఏమైనా అంటే వారు వైసీపీ కోవర్ట్ అని ఒప్పుకున్నట్లు. నాదెండ్ల మనోహర్ ని కులం పేరుతో మన జనసేన నాయకులే విమర్శిస్తున్నారు.. అతన్ని టార్గెట్ చేస్తే పార్టీ నుండి సస్పెండ్ చేస్తా. ఆయన నా వెనుక బలంగా నిలబడ్డారు. ఆయనపై ఎంతో మంది విమర్శలు చేసినా సరే ఆయన ఒక్క మాట మాట్లాడకుండా నిలబడ్డారు, ఆయనపై ఎవరైనా ఒక్క మాట మాట్లాడినా సరే నేను వారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తాను.
జనసేనలో దీర్ఘకాలం పనిచేసేవారు కావాలి, కాలక్షేపం చేసేవారు వద్దు, వారికి పదవులు ఇవ్వం. పొత్తులపై పూర్తిస్థాయి చర్చలు ఉన్నరోజు, మీడియా ముందు కూర్చొని విధివిధానాలు ప్రకటించి అప్పుడు పొత్తుతో ముందుకు వెళతాం, అంతేగాని నాలుగు గోడల మధ్య ఒప్పందాలు చేయను. నాకు పోగొట్టుకోవడానికి ఏమి లేదు.అవమాన పడ్డాను, ఓడిపోయాను, తిట్టించుకున్నాను, నిలబడ్డాను. సముచిత స్థానాల్లో గెలిపించండి, ముఖ్యమంత్రి పదవి గురించి అప్పుడు మాట్లాడుదాం. జనసేన – టీడీపీ – బీజేపీ అలయెన్స్ తో ఎన్నికలకు వెళుతున్నాం.ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నికల తరవాత మాట్లాడదాం . కష్టాల్లో ఉన్నప్పుడే పవన్ కల్యాణ్ గుర్తోస్తాడేమో? మోసం చేసే వాళ్లే జనానికి నచ్చుతారేమో..? అయినా నన్ను నమ్ముకున్న వాళ్ల కోసం.. ఈ రాష్ట్రం కోసం నేను నిలబడతా
టీడీపీ నేతలను సీఎం చేసేందుకు జనసేన లేదు.. మన బలాన్ని మనం బేరీజు వేసుకోవాలి.. అవసరమైనప్పుడు తగ్గడమే కాదు, బెబ్బులిలా తిరగబడాలి. నాకు సలహాలిచ్చే చాలామంది మన పార్టీ నాయకులు కూడా మీరు అది చేయాలి, ఇది చేయాలి అంటారు, కనీసం భీమవరం వచ్చి వారెవరూ ప్రచారం కూడా చేయలేదు, రూపాయి పార్టీకి ఇవ్వలేదు, కేవలం జనసైనికులు నాతో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో సకల కళా కోవిదులకు ఒకటే చెబుతున్నా, నన్ను తిట్టడానికి మీ పార్టీలో బుడతలు బయటకు వస్తారు కదా, దమ్ముంటే వారిలోంచి ఒకరిని CM అభ్యర్థిగా ప్రకటించండి చూద్దాం. మళ్లీ ఓడిపోవడానికి నేను సిద్ధంగా లేను. పెళ్లిళ్ల విషయంలో కులం పాటించని చాలామంది కాపు నాయకులు, రాజకీయంగా మాత్రం కులం ప్రస్తావన తెస్తారు, కులాన్ని వడులుకోమని చెప్పట్లేదు, కులాలను కలుపుకుని పనిచేయమంటున్నాను.
ఒకప్పుడు TRS పార్టీ, ఇప్పుడు జాతీయ పార్టీ BRS కూడా పొత్తుల ద్వారా నిలబడిన పార్టీ, ఒకప్పుడు మనతో కూడా పొత్తులకు సిద్ధపడ్డారు అది తెలుసుకోండి.మన పార్టీకి కనీస సీట్లు గెలిపించుకుండా CM పదవి అడగటం సరి కాదు అని నేను చెప్పాను. అది అర్దం చేసుకోవాలి. గత ఎన్నికల్లో ఓట్లు వేసి ఉంటే ఖచ్చితంగా CM అయ్యేవాడిని. ఓట్లు వేయండి అప్పుడు మాట్లాడుదాం . గుండె దమ్ము లేని వారు రాజకీయాల్లోకి రావద్దు, నాకు ఉంది నేను వచ్చాను. బలం, భావజాలం ఉన్న వారు రాజకీయాల్లోకి రావాలి అనేవారికి జనసేన ఒక వేదిక కావాలి అని పార్టీ ప్రారంభించాను.