Suryaa.co.in

Telangana

పేపర్ లీక్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సబిత కనుసన్నల్లోనే

-జనార్దన్ రెడ్డిని వెంటనే భర్తరఫ్ చేయాలి
-ఇది 30 లక్షల మంది నిరుద్యోగుల సమస్య
-30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ఆడుకున్నారు
-ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలి
-బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్

గ్రూప్ 1 రద్దును స్వాగతిస్తున్నాం , మిగతా వాటిని కూడా రద్దు చేయాలి.తెలంగాణలో మార్చి 11 న వెబ్ సైట్ హ్యాక్ అయింది. ఇది ఒక్కరి సమస్య కాదు. తెలంగాణ లోని 30 లక్షల మంది నిరుద్యోగుల సమస్య. పేపర్ లీక్ ముఖ్యమంత్రి , కేటీఆర్, హరీష్ రావు , సబిత కనుసన్నల్లోనే జరిగింది. పేపర్ లీక్ చేసిన ప్రవీణ్ తో పాటు అతనికి సహకరించిన కాన్ఫిడెన్షియల్ రూమ్ లో పనిచేసే శంకర లక్ష్మీని కూడా అరెస్ట్ చేయాలి.

జనార్దన్ రెడ్డిని వెంటనే భర్తరఫ్ చేయాలి.తెలంగాణలోని 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడుకున్నారు.ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలి.విపక్ష నేతలపై పెట్టిన నిఘా , 5 ఏళ్ల నుంచి కాన్ఫిడెన్షియల్ రూమ్ లో పనిచేస్తున్న ఉద్యోగుల కదలికలపై ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు? కాన్ఫిడెన్షియల్ రూమ్ లో ముఖ్యమంత్రి , మంత్రుల ఏజెంట్లు ఉన్నారు.

2016 లో జరిగిన గ్రూప్ 1 పరీక్షలో కూడా అవకతవకలు జరిగాయి.ఆర్టికల్ 317 ప్రకారం జనార్దన్ రెడ్డిని భర్తరఫ్ చేయాలి.పేపర్ లీకేజీపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి , దోషులకు శిక్ష పడే వరకు ఉద్యమం కొనసాగిస్తాం.

LEAVE A RESPONSE