* లాండ్, సాండ్, మైన్, వైన్ అన్ని మింగేస్తున్నారు
*భార్య, బిడ్డల దగ్గరే పేర్ని నానికి విలువ లేదు
* ఆయన మాటలను పట్టించుకునే పరిస్థితి లేదు
* దసరా తరువాత వైసీపీకి దంచుడే
*తిరుపతి మీడియా సమావేశంలో జనసేన నాయకులు డా.పి.హరిప్రసాద్, కిరణ్ రాయల్
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బకాసురుడు లాంటి వాడని, ఎంత అవినీతి సొమ్ము తిన్నా ఆయన ఆకలి తీరడం లేదని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డా.పి. హరిప్రసాద్ విమర్శించారు. ఇలాంటి బకాసురుడికి బుద్ధి చెప్పే రోజు అతి దగ్గర్లోనే ఉందని అన్నారు. సోమవారం తిరుపతిలో ఆయన, తిరుపతి అసెంబ్లీ ఇంచార్జి కిరణ్ రాయల్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ “జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక కొంతమంది వైసీపీ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారు. ముఖ్యంగా పేర్ని నాని ఇంకా మంత్రి పదవి ఉందన్న భ్రమలో బతుకుతున్నారు. ఆయన్ను, ఆయన మాటలను పట్టించుకునే వారు ఎవరూ లేరు. మిమ్మల్ని మీ నాయకుడు ఇంట్లో కూర్చోబెట్టినట్లే… మీ నాయకుడిని మేము ఇంట్లో కూర్చొబెట్టే రోజు దగ్గర్లోనే ఉంది. రైతే రాజు అని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి… ఈ రోజు రైతులను అప్పుల పాల్జేశారు. కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి… కేసులకు భయపడి సాష్టాంగ నమస్కారాలు చేశాడు. చెత్తపై పన్ను విధించిన చెత్త పుత్రుడు ఈ ముఖ్యమంత్రి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 151 నుంచి 15కు పడిపోవడం గ్యారెంటీ అని అన్నారు.
* విలువ లేని మనిషి పేర్ని నాని : కిరణ్ రాయల్
తిరుపతి ఇంఛార్జు కిరణ్ రాయల్ మాట్లాడుతూ “ఈ రాష్ట్రంలో విలువ లేని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది మాజీ మంత్రి పేర్ని నాని గారే. ఆయనకు సొంత పార్టీలో విలువ లేదు… సొంత ఊరిలో విలువ లేదు… భార్య, బిడ్డల దగ్గర విలువ లేదు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడం హాస్యస్పదంగా ఉంది. ఆయన్ను సొంత పార్టీ వాడుకొని వదిలేసిన మంత్రి పదవి పీకేసినా ఇంకా మంత్రి పదవి ఉందన్న భ్రమలో బతుకుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్లు రాదన్న భయంతో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. నాని ఖబడ్డార్… మీరు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలితే మేము మీ ఇంట్లో విషయాలను బయటకు తీయాల్సి ఉంటుంది. మీ సుపుత్రుడు అరాచకాలు ఎక్కువైపోతున్నాయని మీ నియోజకవర్గంలో వినిపిస్తోంది. వాటన్నింటిని బయటకు తీస్తాం జాగ్రత్త.
సింహాన్ని బోనులో పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
జనసేన పార్టీకి దమ్ముంటే సింగిల్ గా రావాలని కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. జనసేన సింగిల్ గా వస్తుందా? పొత్తులు పెట్టుకుంటుందా? అనేది మా నాయకుడు నిర్ణయిస్తాడు. ఎవరూ ఎలా వచ్చిన మా నాయకుడు సింహం సింగిల్ గానే వస్తాడు అని వైసీపీ వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. మీ సింహాన్ని బోనులో పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి కంగారుపడొద్దు. దమ్ముంటే ప్రత్యేక హోదా తీసుకురండి అని నాని గారు మాట్లాడుతున్నారు. మేము ప్రత్యేక హోదా తీసుకొస్తే 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు గెలిచింది మా ఇళ్లల్లో పాచిపని చేయడానికా? మేము గాజులు వేసుకొని, చీరలు కట్టుకున్న తేడాగాళ్లం అని మీరు ఒప్పుకుంటే మా నాయకుడు కేంద్రంతో మాట్లాడి ప్రత్యేక హోదా తీసుకురావడానికి ప్రయత్నిస్తారు.
ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక సాయం
వైసీపీ నాయకుల్లా మా నాయకుడికి సిమెంటు ఫ్యాక్టరీలు లేవు. ల్యాండ్, సాండ్ మాఫియాలు లేవు. అయినా ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో చనిపోయిన 3 వేల మంది కౌలు రైతులకు ఆర్థిక సాయం అందించడానికి ముందుకు వచ్చారు. ఇప్పటికే 272 మందికి సాయం అందించారు. వచ్చే నెలలో కడపలో మరో 132 మందికి సాయం అందిస్తారు. దసరా తరువాత జనసేన రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రారంభమవుతుంది. మీరు చేసిన అరాచకాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామ”ని అన్నారు.