Suryaa.co.in

Andhra Pradesh

ఆత్మకూరు ప్రచారంలో జయప్రద

– బీజేపీ అభ్యర్ధికి మద్దతుగా అగ్రనేతల ప్రచారం
– ఆరుగురు స్టార్‌క్యాంపెయినర్లను ఎంపిక చేసిన బీజేపీ

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో, బీజేపీ అభ్యర్ధికి మద్దతుగా సినీ నటి జయప్రద రంగంలోకి దిగనున్నారు. గత కొద్దికాలం క్రితం బీజేపీలో చేరిన జయప్రద, ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారబరిలో దిగనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఆమె 19న ఆత్మకూరులో ప్రచారం నిర్వహించనున్నారు. కాగా పార్టీ తరఫున ఆరుగురుని స్టార్‌ క్యాంపెయినర్లుగా నాయకత్వం ఎంపిక చేసింది. ఆ ప్రకారంగా..17,18వ తేదీల్లో జాతీయ కార్యవర్గసభ్యుడు, రాష్ర్ట మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, 18,19వ తేదీల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందీశ్వరి, 19,20 తేదీల్లో జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, 19న రాజ్యసభసభ్యుడు సీఎం రమేష్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. వీరంతా బహిరంగసభలు, రోడ్‌షోలు, పాదయాత్ర ద్వారా బీజేపీ అభ్యర్ధి విజయం కోసం పనిచేయనున్నారు.

LEAVE A RESPONSE