-ఒకరు కూలుస్తా అని, మరొకరు పేలుస్తా అంటున్నారు
-టీపీసీసీ తెలంగాణ ప్రదేశ్ క్రిమినల్ సెంటర్
-పి.యూ.సీ చైర్మన్ ,ఎమ్మెల్యే ఏ. జీవన్ రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి కేసిఆర్ చేస్తుంటే వీళ్ళు టెర్రరిస్టులాగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ అద్భుత కట్టడాలు నిర్మిస్తుంటే వాళ్లకు కడుపు మండుతోంది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సచివాలయం గుమ్మటాలు కూలుస్తా అంటున్నాడు. బీజేపీ కట్టడాలు కూలిస్తే ప్రజలు ఆ పార్టీ ని భూమిలో పాతి పెడతారు. కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ లకు కూడా గుమ్మటాలు ఉన్నాయి.. ముందు సంజయ్ వాటిని కూల్చి రావాలి.
రేవంత్ సంజయ్ ల టెర్రరిస్టు భాష ను ప్రజలు గమనిస్తున్నారు. వారి పార్టీలకు ప్రజలు ఎపుడూ ఎన్నికలు వచ్చినా తగిన బుద్ది చెబుతారు. ఒకరు కూలుస్తా అని, మరొకరు పేలుస్తా అంటున్నారు.టీపీసీసీ తెలంగాణ ప్రదేశ్ క్రిమినల్ సెంటర్ అయ్యింది. రేవంత్ కు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చి ఏఐసీసీ ఆల్ ఇండియా క్రిమినల్ సెంటర్ అయ్యింది. మీ పార్టీలు అధికారంలో ఉన్న దగ్గర కూల్చి రండి.ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని కూల్చివేశారు.
కాంగ్రెస్ పార్టీని అహింసవాదం నుండి హింసా వాదానికి తీసుకువచ్చాడు రేవంత్ రెడ్డి.అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ధరణి పోర్టల్ రద్దు చేస్తాం అని అంటున్నారు.కాంగ్రెస్, బిజెపి పార్టీలకు అవి పాదయాత్రలు కావు. అంతిమయాత్రలు. ఒకపక్క ఎలక్షన్ జరిగితే మరో పక్క నుండి యాత్రలు చేస్తున్నారు. జనం లేక పాదయాత్రలు విలవిల పోతున్నాయి.పాద యాత్రలు కాంగ్రెస్ బీజేపీ లకు పాడె యాత్రలు,అంతిమ యాత్రలు గా మారాయి.ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఉండాల్సిన వాళ్లు పార్టీల అధ్యక్షులు అయ్యారు.