– బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య
న్యూఢిల్లీ : దేశ ప్రజలకు చేసిన గాయాలు మానాలన్నా, దేశానికి చేసిన ద్రోహం మరవాలన్నా గుంటూరు నగరంలోని జిన్నా టవర్ పేరు మార్చాల్సిందేనని బీజేపీ జాతీయ కార్యదర్శి
అన్నారు. టవర్‌కు రంగులు మార్చినంత మాత్రాన దేశ విభజనకు కారకుడైన జిన్నా పునీతుడు కాడన్నారు. దేశ విభజన సమయంలో హత్యకు గురైన లక్షల భారతీయుల ప్రాణాలు తిరిగిరావన్నారు. రంగులు మార్చడం ఊసరవెల్లికి సహజమని, మోసం చెయ్యడం వైసీపీ నైజమన్నారు. నాటకాలు ఆపండి, ప్రజల మనోభావాలు గౌరవించాలని ఆయన పేర్కొన్నారు. దేశ ముద్దుబిడ్డ డా.కలామ్ పేరును జిన్నా టవర్‌కు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.