John Woodroffe (Arthur Avalon) (1865- 1936)
మన దేశాన్ని ఇంగ్లిష్ ప్రభుత్వం పరిపాలిస్తున్న రోజుల్లో 1902లో కలకత్తాలో ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. భారతీయ తంత్ర విద్యపై విస్తృతమైన పరిశీలన చేసి మహానిర్వాణ తంత్రం వంటి 20 సంస్కృత తంత్ర గ్రంథాల్ని ఇంగ్లిష్ లోకి అనువదించారు. Is India Civilized? అన్న గొప్ప పుస్తకం రాసి భారతీయ సంస్కృతి వైశిష్ట్యాన్ని ప్రపంచానికి తెలియజేశారు.
“India is an idea” అని గట్టిగా అని ఆ నిజాన్ని లోకానికి తెలియజేసింది ఈయనే. మకాలి (Macaulay) ప్రతిపాదిత ఇంగ్లిష్ విద్యావిధానాన్ని వ్యతిరేకించారు ఈయన. 10కి పైగా అధ్యయన గ్రంథాలు రాశారు. “యూరోపియన్ శరీరంలో భారతీయ సనాతన ద్రవ్యం” అని ఈయన్ను యం.పి. పండిట్ అన్నారు. అప్పట్లో బెంగాలీలు ఈయన్ను “అమ్మవారు తనకోసం సృష్టించుకున్న ముద్దుబిడ్డడైన మొదటి ఆంగ్లేయుడు”.అని అనేవారు. ఈయన వ్రాసిన The Serpant Power, Introduction to Tantra, Garland of letters. World as power వంటి పుస్తకాలు చాల ప్రాచుర్యాన్ని పొందాయి. ఈయన పుస్తకాల్ని చదివే ప్రయత్నం చెయ్యండి. మన గుఱించి మనకు తెలియనిది, మనం తెలుసుకోవాల్సింది తెలుస్తూంటుంది.
– రోచిష్మాన్ 9444012279