Suryaa.co.in

Andhra Pradesh

తెలుగుదేశం పార్టీలో చేరి రాష్ట్ర ప్రగతిలో యువత భాగస్వామ్యం కావాలి

-గన్నే ప్రసాద్ (అన్నా)

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 41,42 డివిజన్, భవానీపురం నందు సోమవారం క్లస్టర్ ఇంచార్జీ యేదుపాటి రామయ్య ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు మరియు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు శిబిరాన్ని సందర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి  గన్నే ప్రసాద్ (అన్నా).

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరి రాష్ట్ర ప్రగతిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని, చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం జాబ్ ఫస్ట్ లక్ష్యంతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని ప్రజలకు వివరించి, ఎమ్మెల్సీ ఓటర్ నమోదు చేసుకోవడంతో పాటు టిడిపి సభ్యత్వంతో పార్టీ అందించే ప్రయోజనాలను యువతకు వివరించి పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వం నమోదు చేయాలని పార్టీ శ్రేణులకు అన్నా గారు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో ఐటీడీపి పశ్చిమ నియోజకవర్గం కోర్డినేటర్ శ్రవంతి మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE