-మొదటి నుంచి నేను చంద్రబాబు నాయుడు కి వ్యతిరేకంగా పనిచేశా
-నేడు రాక్షస పాలన సాగిస్తున్న జగన్ ను గద్దె దించాల్సి ఉంది
-జగన్ ఏమన్నా భారతీ సిమెంట్ డబ్బులు తెచ్చి ఇస్తున్నాడా?
-చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
రాష్ర్టాభివృద్ధి-అమరావతి కోసమే తాను బీజేపీ నుంచి టీడీపీలో చేరానని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. తాను మొదటినుంచి చంద్రబాబును వ్యతిరేకించినప్పటికీ, జగన్ రాక్షస పాలన అంతమొందించాలంటే, చంద్రబాబు నాయకత్వమే సరైనదని గుర్తించానని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ ఇంకా ఏమన్నారంటే..
రాష్ట్ర భవిష్యత్ కోసం తెలుగు దేశంలో చేరాను. మొదటి నుంచి నేను చంద్రబాబు నాయుడు కి వ్యతిరేకంగా పనిచేశాను.అయితే నేడు రాక్షస పాలన సాగిస్తున్న జగన్ ను గద్దె దించాల్సి ఉంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ రాష్ట్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారు. సంక్షేమం అంటే చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తుకెళ్లడం కాదు. జగన్ ఏమన్నా భారతీ సిమెంట్ డబ్బులు తెచ్చి ఇస్తున్నాడా? 9 లక్షల కోట్లు అప్పులు చేసినా మరోవైపు చెత్తపైనా పన్నులువేస్తున్నాడు. ఈ డబ్బులు అన్నీ జగన్ ఏం చేస్తున్నాడు?అమరావతినే రాజధానిగా ఉంచుతాను అని చెప్పిన జగన్…తరువాత మాట మార్చి మూడు రాజధానులు అన్నాడు.మూడు రాజధానులు అన్నారని నేను ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో దీక్ష చేశాను విశాఖ అయితే అభివృద్ది చెందిన ప్రాంతం కాబట్టి అక్కడ దోచుకోవచ్చు అని విశాఖ రాజధాని అని జగన్ అన్నాడు. రాక్షసుడు అయిన జగన్ ను రాష్ట్రం నుంచి పారద్రోలాల్సి ఉంది. నరేంద్ర మోదీ నాయకత్వం కలిగిన పార్టీ నుంచి నేను బయటకు రావడానికి కారణం అమరావతిని, రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకోవడమే.