– వారి పనితీరును ప్రశంసించిన జగన్
తాడేపల్లి: వైసీపీకి చెందిన ఉమ్మడి జడ్పీ చైర్మన్లు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా చైర్మన్
హారికపై టీడీపీ నేతల దాడిని కలసికట్టుగా ఎదుర్కొన్నందుకు ఆయన వారిని అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని సూచించారు.
స్ధానిక సంస్ధలను బలోపేతం చేయాలని, అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కూడా బూత్ లెవల్నుంచి బలోపేతం చేసేందుకు తగిన కార్యాచరణ
రూపొందించుకుని ముందుకు సాగాలని జగన్ సూచించారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ – రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో కార్యక్రమం జరుగుతున్న తీరుపై వివరాలు తెలుసుకుని, మరింత ఉత్సాహంగా కార్యక్రమం నిర్వహించాలని నేతలకు జగన్ సూచించారు.
జగన్ను కలసిన వారిలో పిరియా విజయ (శ్రీకాకుళం), మజ్జి శ్రీనివాసరావు (విజయనగరం), జల్లిపల్లి సుభద్ర (విశాఖ జిల్లా), విప్పర్తి వేణుగోపాలరావు
(తూర్పుగోదావరి), బూచేపల్లి వెంకాయమ్మ (ప్రకాశం), ఆనం అరుణమ్మ (SPS నెల్లూరు), ముత్యాల రామగోవిందు రెడ్డి (YSR కడప), యర్రబోతుల పాపిరెడ్డి (కర్నూలు), బోయ గిరిజమ్మ (అనంతపురం) గోవిందప్ప శ్రీనివాసులు (చిత్తూరు) ఉన్నారు.