Suryaa.co.in

Andhra Pradesh

జర్నలిజం జర్నలిస్టులు (జర్నలిజం బేసిక్స్) పుస్తకావిష్కరణ

* పుస్తకాన్ని ఆవిష్కరించిన సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

విజయవాడ: రచయిత సీనియర్ జర్నలిస్ట్ ఈపూరి రాజారత్నం రచించిన జర్నలిజం-జర్నలిస్టులు (జర్నలిజం బేసిక్స్) ప్రత్యేక పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ నందు శనివారం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార,పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆవిష్కరించారు. జాతీయ పత్రిక దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర జర్నలిస్టులకు మంత్రి పార్థసారథి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీనియర్ జర్నలిస్ట్ రాజారత్నం రచించిన జర్నలిజం జర్నలిస్టులు జర్నలిజం బేసిక్స్ పుస్తకం తనను ఎంతో ఆకట్టుకుందని అన్నారు. అదే విధంగా కొత్తగా జర్నలిజం లోకి ప్రవేశించే యువకులకు ఈ పుస్తకం ఒక దిక్సూచి వలె ఉంటుందని పేర్కొన్నారు. జర్నలిజంలో బేసిక్స్ నేను కూడా తెలుసుకోవటానికి ఇది దోహదపడుతుందని తెలిపారు.

ప్రభుత్వంలో జరుగుతున్న మంచి చెడులను వివక్షతా రహితంగా ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడైతే జర్నలిస్టు నిజాయితీతో, చిత్తశుద్ధితో ఉంటాడో అప్పుడే ప్రజాస్వామ్యం పది కాలాల పాటు మనగగలుగుతుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత సీనియర్ జర్నలిస్ట్ ఈపూరి రాజారత్నం, జర్నలిస్టులు మెడకాయల మస్తాన్ రావు,బత్తుల సాంబశివరావు, లోకం చెప్పని నిజం ఎడిటర్ ఎస్.కె రఫీ, తెలుగుదేశం పార్టీ మంగళగిరి మండల ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్, ఈపూరిస్ టీవీ18 డైరెక్టర్ డాక్టర్ ఈపురి శేషగిరి, వినుకొండ నజరేత్ బాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE