సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది. గతంలో ఇదే అంశంపై రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. సీఎం హోదాలో జగన్ సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారంటూ న్యాయవాది వెంకటేష్ వాదనలు వినిపించారు. జగన్‌కు నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌పై వైఖరి ఏమిటని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. రఘురామ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.
అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు రిజిస్ర్టీ తిరస్కరించిన విషయం తెలిసిందే. సాంకేతిక కారణాలు, పూర్తి వివరాలు లేకపోవడం వల్లే తిరస్కరించింది.
జగన్, విజయసాయి బెయిల్‌ను రద్దుచేయాలని రఘురామరాజు గతంలో దాఖలుచేసిన పిటిషన్లను హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఆ కోర్టు తీర్పుపై ఆయన హైకోర్టులో అప్పీలు పిటిషన్లు దాఖలు చేశారు. జగన్, విజయసాయిరెడ్డి, సీబీఐలను ప్రతివాదులుగా చేర్చారు. అయితే రిజిస్ట్రీ సాంకేతిక అభ్యంతరాలు లేవనెత్తి పిటిషన్లను తిరస్కరించింది. దీంతో రఘురామ తిరిగి జగన్, విజయసాయి బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు.