Home » సమ్మె విరమించిన జూడాలు

సమ్మె విరమించిన జూడాలు

– జూనియర్ డాక్టర్లు చేసిన డిమాండ్లకు ప్రభుత్వం సానుకూల స్పందన రావడం తో సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన జూనియర్ డాక్టర్లు
– మంత్రి దామోదర్ రాజనర్సింహకు కృతజ్ఞతలు
– దామోదర్ రాజనర్సింహ, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గార్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన జూడాలు.
– రాష్ట్ర వైద్య చరిత్రలో చారిత్రాత్మక దినోత్సవం: దామోదర్ రాజనర్సింహ

హైదరాబాద్: రాష్ట్ర వైద్య చరిత్రలో చారిత్రాత్మక దినోత్సవం. జూనియర్ డాక్టర్లు గతంలో రెండు సార్లు స్టైఫండ్ ల విడుదల గురించి మా దృష్టికి తెచ్చారు. చాలా ఏళ్లుగా సమస్యలు ఉన్నాయని చేప్పారు. గ్రీన్ ఛానెల్ ద్వారా స్టైఫoడ్, వసతి భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. వైద్యులకు రక్షణ కావాలని కోరారు. దీనిపై జరిగిన చర్చలు ఫలించాయి. జూడాల సమస్యల పరిష్కారం కోసం 406 కోట్ల జీవో విడుదల చేసాం.

మా శాఖ అధికారులు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులను సందర్శించి హాస్టల్ లు నిర్మించాల్సిన అవసరం ఉందని తేల్చారు. ఉస్మానియా మెడికల్ కాలేజిలో హాస్టల్ లు, రోడ్ ల నిర్మాణం, మరమతుకు 121 కోట్లు కేటాయించాము. గాంధీ మెడికల్ కాలేజీకి 79 కోట్లు మంజూరు చేశాం. కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్ ల పునరుద్ధరణకు 3.5 కోట్లు కేటాయించాము. ఉస్మానియా ఆస్పత్రిలో కొత్త భవన నిర్మాణం అంశం కోర్ట్ లో ఉంది. కొత్త భవన నిర్మాణానికి మేము సానుకూలంగా ఉన్నాం. సరైన సమయంలో ప్రభుత్వం ఉస్మానియా కొత్త భవనంపై నిర్ణయం తీసుకుంటుంది.

పేదలకు జిల్లా స్థాయిలోనే మెరుగైన వైద్యం అందించాలని చూస్తున్నాం. విద్య, వైద్యం ప్రతి పేదవాడికి సంబందించిన విషయం. ప్రమాణాలతో కూడిన విద్య, మెరుగైన వైద్యం అందించడం మా బాధ్యత. మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ సంఖ్య పెంచుతున్నాం. ఫుడ్, డ్రగ్స్ ల్యాబ్ లని మరింత బలోపేతం చేస్తాం. వైద్య ఆరోగ్య శాఖ పాలసీ లో మార్పులు తీసుకురాబోతున్నం. జూడాలకు ధన్యవాదాలు. రాజకీయాలు అవసరం లేదు.

గత ప్రభుత్వం తొమిదిన్నర సంవత్సరాలుగా జూడాలను పట్టించుకోలేదు. దీర్ఘకాలంగా జూడాల డిమాండ్లు పెండింగ్ లో ఉన్న గత ప్రభుత్వం నెరవేర్చలేదు. మా ప్రభుత్వం కేవలం 11 రోజుల్లో 600 కోట్ల BRO విడుదల చేసి మా చిత్తశుద్ధి చూపించాం. మెరుగైన వైద్య, విద్య అందిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.

నాణ్యమైన వైద్య విద్య ను అందించే బాధ్యత ప్రభుత్వానిది: ఉస్మానియా జూడాలు
మా స్టయిపెoడ్ అంశంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చారిత్రక నిర్ణయం. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం నిర్మాణం పై స్పష్టత రాలేదనే బాధ లో మేము ఇవ్వాళ సమ్మె కొనసాగిచాం. కానీ మంత్రి దామోదర రాజనర్సింహ గారితో చర్చల అనంతరం సమ్మె విరమిస్తున్నాం.

Leave a Reply