– మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం
పాలకుర్తి: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మీడియా సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి పై ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలను ఖండించారు.
ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నైజం నీది. ఉద్యమ సమయంలో పదవులను పట్టుకుని ప్రాకులాడిన చరిత్ర నీది. పాలకుర్తిలో సరియైన ప్రత్యర్థి లేకపోవడంతోనే ఇన్ని రోజులు నీ ఆటలు సాగాయి.
ఇన్ని రోజులు ప్రజలను పీడించుకు తిన్నావు. పాలకుర్తి ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో నిన్ను ఓడించి సరైన తీర్పునిచ్చారు. ప్రజలకు ఎర్రబెల్లి పీడ విరగడైంది. ప్రజలు తిరస్కరించిన నీకు జ్ఞానోదయం కావడం లేదు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కారు. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారు. అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేశారు. ఓ ఆర్ ఆర్ ను లీజుకు ఇచ్చి.. ఆ పైసలతో రైతు రుణమాఫీ చేసిన ఘనత బీఆర్ ఎస్ ది. మీరా మాకు నీతులు చెప్పేది? ప్రజలకు ఇచ్చిన హామీలను పది నెలల్లో నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిది. మా సీఎం ను విమర్శించే అర్హత నీకు లేదు.