– పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటితో జలకళ.
– తెలంగాణ ఉద్యమం తర్వాతనే సాగునీటి ప్రాజెక్టులకు మోక్షం.
– కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలోని గుడిపల్లి రిజర్వాయర్ ను రైతులతో కలిసి సందర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
గుడిపల్లి: కల్వకుర్తి పరిధిలో పంటలకు మరో నలబై ఐదు రోజులు నీళ్లు ఇవ్వాల్సి ఉంటుంది. శ్రీశైలం నీటిని చుక్క చుక్క సద్వినియోగం చేసుకోవాలి. అన్ని ప్రాంతాలకు సమానంగా నీళ్ళు ఇవ్వాలి. కల్వకుర్తి మోటర్ లతో 240 రోజులపాటు నీటిని పంపింగ్ చేయొచ్చు.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను అదే లెవెల్ లో చేపట్టినం. శ్రీశైలం లో బురద వచ్చే వరకు నీటిని తోడే అవకాశం ఉంటుంది.డెడ్ స్టోరేజ్ వరకు నీటిని పంపింగ్ చేయవచ్చు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ జూరాల వద్ద చేపడితే నీటిని పంపింగ్ చేయలేం.శ్రీశైలం నుండి నలభై ఐదు రోజుల్లో తొంబై టీ ఏం సి లు ఎత్తి పోయవచ్చు. నీళ్ళు లేని చోట పాలమూరు సోర్స్ పెట్టమని అంటారు. నీళ్ళు వున్న శ్రీశైలం ను ఆంధ్రాకు ధార దత్తం చేయడానికి అలా మాట్లాడుతారు. కల్వకుర్తి పంపింగ్ ఇవాల్టి కి కొనసాగుతుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నుండి కూడా మార్చి ఆఖరు వరకు పంపింగ్ చేయొచ్చు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను పడావు పెట్టింది.
ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడం లక్ష్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీకారం. మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ అసంపూర్తిగా ఉన్న కె.ఎల్. ఐ ప్రాజెక్ట్ పథకానికి 3వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ టన్నులు,కాల్వలు,పవర్ లైన్స్,సర్జుఫుల్,పంపు హౌజులు,మోటార్స్ పూర్తి చేసి 4లక్షల ఎకరాలకు సాగు నీళ్లు మరియు కాల్వల ద్వారా,భూగర్భ జలాలు ద్వారా మరో లక్ష ఎకరాలకు మొత్తం 5లక్షల ఎకరాలకు సాగు నీళ్లు అందించారని అన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిగిలిన 35లక్షల ఎకరాల కు సాగు నీళ్లు అందించి రైతులను రాజులను చేయాలన్న సంకల్పంతో కె.సి.ఆర్ నీటి లభ్యత ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని నిరంజన్ రెడ్డి అన్నారు. 90శాతం పూర్తి అయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తట్టెడు మట్టి తీయకుండా పడావు పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని విమర్శించారు.
27వేల ఎకరాల భూసేకరణ జరిపి 32వేలకోట్ల ఖర్చు చేసి 27వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించి నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. కేవలం 1000కోట్లు ఖర్చు చేసి 10శాతం పనులు పూర్తి చేయకుండా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. పాలమూరు బిడ్డగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పట్టడమే కాకుండా రేవంత్ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. నీటి లభ్యత లేని జూరాల దగ్గర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పడం రైతులను మోసం చేయడం కోసమేనని నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు.
నిరంజన్ రెడ్డి వెంట గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్,నందిమల్ల.అశోక్,భీమయ్య,సురేందర్ రెడ్డి,శివరామ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రఘుపతి రెడ్డి, వనం.రాములు, పృథ్వీ రాజ్, బి.బాలరాజు, వేణు యాదవ్, తిరుపతయ్య, మాణిక్యం, ధర్మా నాయక్, మురళీ సాగర్, ప్రేమ్ నాథ్ రెడ్డి, సూర్యవంశం, గిరి,ఇమ్రాన్,హేమంత్ ముదిరాజ్,స్వాతి హరిబాబు,బాబు నాయక్ తదితరులు ఉన్నారు.