– తెలంగాణ బీసీలకు రిజర్వేషన్లు వద్దా?
– బీజేపీ ఎందుకు బీసీలకు ద్రోహం చేస్తుంది?
– బీసీ ద్రోహి రామచంద్రరావు
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్: బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు కొత్త మురిపెం లో ఉన్నాడు. పార్టీ అధ్యక్ష పదవి వచ్చిందన్న ఆనందంలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఆయన తీరు ఉంది. అవుట్ డేటెడ్ బీఆర్ఎస్ నాయకులను చేర్చుకుని ఏదో ఘనకార్యం చేసినట్టు తెగ హడావిడి చేస్తున్నాడు.
రామచంద్రరావు ఎంత హడావిడి చేసినా తెలంగాణ ప్రజలు బీజేపీని నమ్మరు. కేంద్రంలో 400 సీట్లు గెలుస్తామని చివరకు 240 సీట్లకు పరిమితమయ్యారు. మీ పని కేంద్రంలోనే అయిపోయింది. ఇక తెలంగాణలో ఎవరు పట్టించుకుంటారు? మా రాహుల్ గాంధీ దెబ్బ కు ఏం చేయాలో అర్థం కాక వ్యర్థ ప్రసంగాలు చేస్తున్నరు.
నకిలీ ఓట్ల పైన రాహుల్ గాంధీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆయన సాక్ష్యాలతో సహా ఎన్నికల కమిషన్ తీరు బట్టబయలు చేస్తున్నారు. మీకు దమ్ముంటే ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అయినా ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తుంటే బీజేపీ ఎందుకు ఉలిక్కి పడుతోంది?
గుమ్మడికాయ దొంగ ఎవరంటే బీజేపీ ఎందుకు భుజాలు తడుముకుంటోంది? రాహుల్ గాంధీ నకిలీ ఇండియన్ అని రామచంద్రరావు మాట్లాడుతున్నాడు. మీరు నకిలీ జాతీయ వాద నాయకులు. పైకి మాత్రమే మీది జాతీయ వాదం. లోపల అంతా మతతత్వం. అధికార తత్వం. అధికారం కోసమే మీరు జాతీయతను రెచ్చగొడతారు. మీరా మా రాహుల్ గాంధీ గురించి మాట్లాడేది?
ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన చరిత్ర రాహుల్ గాంధీ కుటుంబానిది. ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ఒక్క బీజేపీ నాయకుడిని చూపించాలి. ఈ దేశ రక్షణ కోసం మూడు సార్లు యుద్ధం చేసిన గెలిచిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది. అమెరికా ను కూడా ఉక్కు మహిళ ఇందిరాగాంధీ లెక్క చేయలేదు.
దేశమంతా యుద్ధం చేయండి. మీ వెంట మేం ఉంటామంటే చేతులెత్తిసిన చరిత్ర మోదీ ది. ట్రంప్ చెప్పాడని యుద్ధం ఆపేసి దేశ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. రామచంద్రరావు ముందు తెలంగాణ బీసీ లకు సమాధానం చెప్పు. బీసీ ద్రోహి రామచంద్రరావు.
బీహార్ లో బీజేపీ భాగస్వామ్యంలో ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు పెంచింది. షెడ్యూల్ కులాలు, తెగలు, ఓ బీసీలు, ఈ బీసీల కు 65 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2023 నవంబర్ 9 న శాసనసభ బిల్లును ఆమోదించింది. నవంబర్ 10న బీహార్ శాసన మండలి కూడా ఈ బిల్లును ఆమోదించింది. ఆ వెంటనే ఆ రాష్ట్ర గవర్నర్ కూడా ఆమోదించారు. నవంబర్ 21 న ఈ బిల్లు చట్టంగా మారి అమలులోకి వచ్చింది.
మరి తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ బిల్లు ఎక్కడుంది? గవర్నర్ ఆమోదించకుండా న్యాయ సలహా కోసం కేంద్రానికి ఎందుకు పంపించారు? బీహార్ కో న్యాయం.. తెలంగాణ కో న్యాయమా? తెలంగాణ బీసీలకు రిజర్వేషన్లు వద్దా? బీజేపీ ఎందుకు బీసీలకు ద్రోహం చేస్తుంది? ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల కోసం 70 మంది ఎంపీలతో ధర్నా చేశాం. బీసీ రిజర్వేషన్ల 42 శాతం పెరిగితే బీజేపీకి ఎందుకు కడుపు మంట?
తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లు కు జై కొట్టి పార్లమెంట్ దగ్గరకు వెళ్ళగానే బీజేపీ నేతలు నై అంటున్నారు. గుజరాత్, యూపీ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో బీసీ కోటాలో ముస్లింలకు బీజేపీ రిజర్వేషన్లు కల్పించారు. తెలంగాణ మాత్రం ముస్లిం లను బూచి గా చూపించి రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారు.