Suryaa.co.in

Telangana

న్యాయం, ధర్మం, ప్రజాస్వామ్యమే గెలిచింది

– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్

నిరుద్యోగులు, విద్యార్థులతో పాటు, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న బండి సంజయ్ కి బెయిల్ లభించడం ప్రజాస్వామ్య విజయం.కోర్టు ఉత్తర్వులు బీఆర్ఎస్ సర్కార్ కు చెంప పెట్టు.కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధింపు, కేసీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనం. ప్రగతి భవన్ డైరెక్షన్లోనే కరీంనగర్లో బండి సంజయ్ విడుదల సందర్భంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్లో… బండి సంజయ్ బెయిల్ పై విడుదల సందర్భంగా, 144 సెక్షన్ విధించాల్సిన అవసరం ఏమొచ్చింది?జైలు నుంచి విడుదల సందర్భంగా ఎక్కడ ర్యాలీగా వస్తారోనన్న భయంతోనే 144 సెక్షన్ విధించారు.ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ పార్టీ అక్రమ కేసులతో బండి సంజయ్ ని అరెస్టు చేయించి, చివరకు బొక్క బోర్లా పడింది.

రేపటి ప్రధాని పర్యటనను, పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించి, సక్సెస్ చేస్తాం.రేపటి ప్రధాని సభతో బీఆర్ఎస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. కేసీఆర్ పిట్ట బెదిరింపులకు, ఉడుత ఊపులకు బీజేపీ భయపడదు. “లీకేజీలు, ప్యాకేజీల మంత్రం బిఆర్ఎస్ ది అయితే… భారత్, భవిష్యత్తు బిజెపిది”

LEAVE A RESPONSE