Suryaa.co.in

Andhra Pradesh

15లక్షల ఇళ్లు నిర్మిస్తానన్న ముఖ్యమంత్రి వాగ్ధానం ఏమైంది?

– ఉగాదినాటికి 3.50లక్షలమంది పేదలకు ఇళ్లునిర్మించి తాళాలు ఇస్తామన్న వైసీపీప్రభుత్వహామీ తుస్సేనా?
• 2019-20 ఆర్థికసంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముక్కి,మూలిగినిర్మించిన ఇళ్లు కేవలం 5 మాత్రమే.
• జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గృహనిర్మాణంపై నిర్వహించిన తొలిసమీక్షసమావేశంలోనే టీడీపీప్రభుత్వంలోప్రారంభమైన 6లక్షలఇళ్లను ఆపేయించాడు.
• ఇళ్లనిర్మాణం పేరుతో జగన్మోహన్ రెడ్డి, పేదలకు అరచేతిలో వైకుంఠంచూపిస్తూ, దారుణంగా వంచిస్తున్నాడు.
• ఇళ్లస్థలాలపేరుతో రాష్ట్రవ్యాప్తంగా రూ.4,500కోట్లుదోచుకున్న వైసీపీనేతలు, ఇళ్లనిర్మాణంపేరుతో ఇంకెన్నివేలకోట్లు కాజేస్తారో చూడాలి.
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు

పేదవాడి సొంతింటికలను చిధ్రంచేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మూడేళ్లలో పేదలకోసం ఒక్కటంటే ఒక్కఇల్లుకూడా నిర్మించలేదని, గతంలో టీడీపీప్రభుత్వంలో 10లక్షల5వేల590 ఇళ్లునిర్మించారని ఈప్రభుత్వంలోని మంత్రే అసెంబ్లీసాక్షిగా చెప్పాడని, ఏప్రభుత్వంలో పేదలసొంతింటికల సాకారమైందో చెప్ప డానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు స్పష్టంచేశారు.మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయం లో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

టీడీపీప్రభుత్వం గతఐదేళ్లలో రాష్ట్రప్రభుత్వ నిధులతో 10లక్షల 5వేల590ఇళ్లు నిర్మిస్తే, కేంద్రప్రభుత్వ నిధులతో టిడ్కోద్వారా 2లక్షల68వేలఇళ్లనిర్మాణంచేపట్టి, 2లక్షలఒకవెయ్యి ఇళ్లకు పైడా పూర్తిచేసిందని కేంద్రప్రభుత్వమే సమాధానంచెప్పింది. బీజేపీ ఎంపీ జీ.వీ.ఎల్.నరసింహారావు అడిగినప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి పార్లమెంట్ లో ఈ విషయాన్ని తెలిపారు.

దాదాపు 12 లక్షలపైచిలుకు ఇళ్లనిర్మాణం చంద్రబాబునాయుడిహాయాంలో పూర్తయింది. అవికాకుండా రాష్ట్రవ్యాప్తంగా మరో 18లక్షలఇళ్ల నిర్మాణం లబ్ధిదారులసహాయసహాకారాలంతో టీడీపీహాయాంలో ప్రారంభమైంది. ఆవిధంగా ప్రారంభమైన ఇళ్లనిర్మాణం వైసీపీప్రభు త్వం అధికారంలోకిరాగానే నిలిచిపోయింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గృహనిర్మాణంపై నిర్వహించిన తొలి సమీక్షసమావేశంలోనే టీడీపీహాయాంలో ప్రారంభమైన ఇళ్లలో 6లక్షలకు పైగాఇళ్లనిర్మాణం నిలిపివేయాలని ఉత్తర్వులిచ్చారు.
ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలోని 6లక్షలమంది నిరుపేదల ఇంటినిర్మాణఆశలను ఈ ముఖ్యమంత్రి చిధిమేశాడనే చెప్పాలి.

గతప్రభుత్వాలు ప్రారంభించినపనులను తరువాతవచ్చినప్రభుత్వా లు కొనసాగించడమనేది ఎప్పటినుంచో వస్తున్నఆనవాయితీ. కానీ దాన్ని ఈముఖ్యమంత్రి పాతరేశాడు. తనహాయాంలో గొప్ప గా ఇళ్లనిర్మాణం ఉంటుందని చెప్పిన ముఖ్యమంత్రి, తన మూడే ళ్లపాలనలో ఒక్కఇంటినీ నిర్మించలేకపోవడం ఆయన అసమర్థత కాదా? ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడుచెప్పినదానికి విరుద్ధంగా రాష్ట్రంలో ఇళ్లనిర్మాణం జరగలేదనే చెప్పాలి.

మూడేళ్ల తనపాలనలో జగన్మోహన్ రెడ్డిఇదివరకు చెప్పినదాని ప్రకారం ఇప్పటికే 15లక్షలఇళ్లనిర్మాణం పూర్తికావాలి. కానీ 15కూడా నిర్మించలేదు. టీడీపీప్రభుత్వంఉన్నప్పుడు కేంద్రప్రభుత్వం ఇచ్చే ఆర్థికసహాయంగ్రామీణప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకుకూడా లభించేలా శ్రద్ధచూపి, ఆదిశగా 6లక్షలపైచిలుకు ఇళ్లనిర్మాణానికి అంకురార్ప ణచేయడం జరిగింది. ఆ విధంగా టీడీపీప్రభుత్వంలో సగానికిపైగా, మరికొన్నిచోట్ల 80శాతం, 90శాతం వరకుపూర్తైన ఇళ్లనుకూడా ఈ ముఖ్యమంత్రిసంపూర్ణంగా పూర్తిచేయించలేకపోయాడు. అదీ ఈ అవినీతి ముఖ్యమంత్రి పనితనం. పేదలఇళ్లనిర్మాణం అంటే ఈ ముఖ్యమంత్రికి ఎందుకంత కక్ష, కసి అని ప్రశ్నిస్తున్నాం?

కేంద్రప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం 2019-20 ఆర్థికసంవత్సరంలో కేంద్రప్రాయోజితపథకాలనిధులతో పూర్తైన ఇళ్లు కేవలం 5మాత్రమే. అలానే 2020-21 ఆర్థికసంవత్సరంలో పూర్తైన ఇళ్లు సున్నా. (ఒక్కటీలేదు.) ఈ లెక్కలు మేంచెప్పడం లేదు..కేంద్రప్రభుత్వమే పార్లమెంట్ లో చెప్పింది. జగన్మోహన్ రెడ్డికి పేదలనిర్మాణంపై ఉన్న విద్వేషం, నిర్లక్ష్యాలకు కేంద్రప్రభుత్వ లెక్కలేనిదర్శనం. మూడేళ్ల జగన్ పాలనలో ఏ ఒక్కవ్యక్తికీ శాశ్వత ప్రయోజనంకలిగించే కార్యక్రమం ఒక్కటీచేపట్టలేదు.

ముఖ్యంగా బడుగుబలహీనవర్గాలు, దళితులు, మైనార్టీలకు శాశ్వతలభ్ది కలిగించే ప్రయోజనం ఒక్కటీకూడా ఈముఖ్యమంత్రి తనమూడేళ్లపాలనలో చేయలేదని చెప్పడంలో ఎలాంటిసందేహం లేదు. టీడీపీ హాయాంలో బహుళఅంతస్తుల్తో సుందరంగా నిర్మిం చిన 2లక్షలకుపైగా టిడ్కోఇళ్లను అసలైనలబ్ధిదారులకు ఇవ్వకుం డా ఈముఖ్యమంత్రి వారిని వేధిస్తున్నాడు. ఆఇళ్లు అర్హులకు ఇస్తే, ఎక్కడ చంద్రబాబునాయుడికి పేరొస్తుందోనన్న దుగ్ధ, అసూ యతోనే జగన్మోహన్ రెడ్డి ఆఇళ్లను పాడుపెట్టాడు.

లక్షలాది పేద లు నిలువనీడలేకుండా హలోలక్ష్మణా అనివిలపిస్తున్నా ఈ ముఖ్యమంత్రి మనసుకరగడంలేదు. వైసీపీఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో పూర్తైన టిడ్కోఇళ్లుపేదలకు అందక, వారు అవస్థలు పడుతున్నా పట్టించుకోవడంలేదు. పేదలగోడు, వారి బాధలు వైసీపీప్రజాప్రతినిధుల చెవికి ఎక్కడంలేదా అనిప్రశ్నిస్తు న్నాం. పేదలు బహుళఅంతస్తులనివాసాల్లో నివాసం ఉండటం, సంతోషంగా జీవించడం వైసీపీఎమ్మెల్యేలకు, మంత్రులు, ముఖ్య మంత్రికిఇష్టంలేదు. కాబట్టే టీడీపీప్రభుత్వం నిర్మించిన 2లక్షలపైచి లుకు టిడ్కోఇళ్లను దయ్యాలకొంపలుగా మార్చాడు.

పేదలు పక్కాఇళ్లలో సంతోషంగా ఉండాలని కలలుగన్న మహాను భావుడు స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు. ఆయన హాయాంలో పేదలకోసం పక్కాఇళ్లనిర్మాణం ఆనాటి ఉమ్మడి రాష్ట్రం లో విరివిగా జరిగింది. తరువాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్ర బాబునాయుడుగారు మరో అడుగుముందుకేసి, పేదల ఇళ్ల నిర్మాణంలో సరికొత్తహంగు, అర్భాటాలు చూపారు. బహుళ అంత స్తుల భవనాలు నిర్మించిపేదలకు ఇచ్చారు. ఆవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోకూడా బహుళఅంతస్తుల ఇళ్లనిర్మాణం జరిగేలా చర్యలు చేపట్టారు.

కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జగనన్న కాలనీలపేరుతో పేదలకుఇచ్చినఇళ్లస్థలాలన్నీ కాలువలు, చెరువు లు, కుంటలపక్కనే ఇచ్చారు. కొన్ని చోట్ల శ్మశానాలనే ఇంటిస్థలా లుగా మార్చి పేదలకుఇచ్చామని గొప్పలుచెప్పుకున్నారు. ఎక్క డో గ్రామాలు, పట్టణాలకు దూరంగా నివాసానికి అనుకూలంకానీ స్థలాలనుతక్కవధరకు కొన్న అధికారపార్టీ ఎమ్మెల్యేలు పేదలకు మంచిచేస్తున్నామంటూ కల్లబొల్లికబుర్లుచెప్పి, ఆ స్థలాలనుప్రభు త్వానికి ఎక్కవధరకు అమ్మారు. ఎకరం రూ.5, రూ10లక్షల విలు వచేసే భూములను ప్రభుత్వానికి ఎకరా రూ.30లక్షలనుంచి రూ.50 లక్షలవరకు అంటగట్టిన అధికారపార్టీనేతలు, రాష్ట్రవ్యాప్తం గా రూ.4,500కోట్లవరకు మింగేశారు.

తరువాత ఆ ఇళ్లస్థలాలనే చదునుచేసే నెపంతో మరోకొత్తరకం అవినీతికిపాల్పడ్డారు. పేదల కు ఇళ్లస్థలాలపేరుతో రూ.4,500కోట్లను స్వాహాచేసిన వైసీపీప్రభు త్వం, చివరకు నివాసానికిపనికిరాని స్థలాలను కూడా పేదలకు ఇవ్వలేదు. తామేఇళ్లునిర్మించి ఇస్తామనిచెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, తరువాత లబ్దిదారులే నిర్మించుకుంటే , ఆనక తీరుబడి గా నిధులిస్తామంటూ కొత్తమెలిక పెట్టింది. అసలే నివాసానికి పని కిరానిస్థలాలు, మరోపక్క వైసీపీప్రభుత్వం పెట్టిన నిబంధనలతో పేదలు ఆ జానెడుజాగాల్లో ఇళ్లుకట్టుకోవాలో, వద్దో తెలియక లబో దిబోమంటున్నారు.

ప్రభుత్వం ఇంటినిర్మాణంలో పెట్టిన మూడు నిబంధనల్లో ప్రభుత్వమే సకలహంగులతో ఇల్లునిర్మించి, పేదలకు ఇంటితాళం అప్పగిస్తుందన్న నిబంధనకే ఎక్కువమంది మొగ్గుచూపారు. ఆవిధంగా ప్రభుత్వమాయలో పడినవారిలో రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల50వేలమంది ఉన్నారు. ఉగాదినాటికే ఇళ్లు నిర్మించి పేదలచేతిలో ఇంటితాళాలు పెడతామనిచెప్పిన ప్రభుత్వం వచ్చేఉగాదినాటికి ఎందరుపేదలచేతిలో ఇంటితాళాలుపెడుతుందో సమాధానంచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.

జగన్ ప్రభుత్వం చెప్పినట్టుగా 3లక్షల50వేలమంది పేదలకు ప్రభుత్వఖర్చులతో ఇళ్లునిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మూ డేళ్లువచ్చేనాటికి నిర్మిస్తామన్న 15లక్షలఇళ్లనిర్మాణం ఏమైందో కూడా ఈముఖ్యమంత్రి సమాధానంచెప్పాలని డిమాండ్ చేస్తున్నా .

పేదలకు ఇళ్లునిర్మించిఇవ్వడంచేతగాని ఈముఖ్యమంత్రికి పేదలుతరతరాలనుంచి ఉంటున్న ఇళ్లను క్రమబద్ధీకరించేపేరుతో ఓటీఎస్ వసూళ్లకు పాల్పడటాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. పేదలనుఇళ్లపేరుతో వంచించిన ఈముఖ్యమంత్రి చర్యలను, బాధ్య తగలప్రతిపక్షంగా టీడీపీప్రజాక్షేత్రంలో ఎండగడుతుందని తేల్చిచె బుతున్నాం.

LEAVE A RESPONSE