రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన పేర్ని కామేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పీకే రావుగా కాంగ్రెస్, వైసీపీలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి, ప్రస్తుతం ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్ కు పీకే రావు సన్నిహితులు.
బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన విశాఖకు చెందిన సీతంరాజు సుధాకర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఈ పదవికి రాజీనామా చేయడంతో అప్పటినుంచి ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లాకు చెందిన పీకే రావును నియమిస్తూ ఉత్తర్వులు వెలుపడ్డాయి.