– ట్యాబ్ ల పంపిణీ ముసుగులో 221కోట్లు కొట్టేసి, తనకుతాను భారీ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చుకున్న కంసమామ జగన్ రెడ్డి
• రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వఎయిడెడ్ పాఠశాలల్లోని 8వతరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకోసం చేపట్టిన 5,18,740 ట్యాబ్ లపంపిణీ ఆసాంతం కుంభకోణాలమయమే
• ఎం.ఆర్.పీ రూ.14,500లు ఉండి, అమెజాన్ లాంటి ఆన్ లైన్ సైట్లలో డిస్కౌంట్ పై రూ.11,999కి లభించే 8.7 అంగుళాల స్క్రీన్ సైజ్ ఉన్న ఏ7లైట్ శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ (మోడల్ ఎస్.ఎమ్.టీ.220) ని రూ.13,262కు కొన్నాడు
• ఆన్ లైన్ ద్వారా ఒక్కో ట్యాబ్ పైరూ.2,500 లు తగ్గుతున్నప్పుడు, 5లక్షల ట్యాబ్ లు ఒకేసారి కొంటే ఒక్కోట్యాబ్ రూ. 9వేలకే వచ్చేది
• ఆ లెక్కన రూ.9వేలకు లభించే ట్యాబ్ ని జగన్ రెడ్డి రూ.13,262కి కొని, ఏకంగా రూ.221కోట్ల విలువైన భారీ బర్త్ డే గిఫ్ట్ కొట్టేశాడు
• అత్యంతదారుణంగా విద్యార్థులు, వారితల్లింద్రుల్ని బెదిరింపులకు గురిచేస్తూ, వేధిస్తున్న బైజూస్ సంస్థతప్ప, మరే సంస్థ జగన్ రెడ్డికి దొరకలేదా?
• బైజూస్ వేధింపులపై, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (N.C.P.C.R) కు ఫిర్యాదులు అందింది నిజంకాదా?
• 1.2 బిలియన్ డాలర్ల అప్పులుచేసి, ఎగనామం పెట్టిన దివాళా సంస్థ బైజూస్ ను దేనికోసం జగన్ రాష్ట్రానికి ఆహ్వానించాడు?
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
విద్యార్థులు, ఉపాధ్యాయులకు ట్యాబ్ ల పంపిణీపేరుతో జగన్ రెడ్డి తన పుట్టినరోజు నాడు తనకుతానే రూ.221కోట్ల భారీగిఫ్ట్ ఇచ్చుకొని, విద్యార్థులపాలిట తానేనిజమైన కంసమా మనని నిరూపించుకున్నాడని టీడీపీ జాతీయఅధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆగ్ర హం వ్యక్తంచేశారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
బైజూస్ రూపంలో, ట్యాబ్ ల పంపిణీ పేరుతో జగన్ రెడ్డి తనకు తానే భారీ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చుకున్నాడు.
“జన్మదినం నాడుకూడా జగన్ రెడ్డి జనాన్ని దోపిడీచేయడం మానలేదు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ట్యాబ్ లపంపిణీ రూపంలో కంసమామ జగన్ రెడ్డి, తనకుతానే బైజూస్ రూపంలో వందలకోట్లవిలువైన భారీ గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. పుట్టినరోజునాడు కూడా నీ మింగుడు ఆపకపోతే ఎలా జగన్ రెడ్డి? రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వతరగతి చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు జగన్ రెడ్డి నేడు ట్యాబ్ ల పంపిణీ చేపట్టాడు. అందుకోసం రూ.688కోట్లతో 5,18,740 ట్యాబ్ లు కొన్నట్టు చెప్పిన జగన్ రెడ్డి, ఒక్కో ట్యాబ్ కు రూ.13,262 ఖర్చుచేశాడు. అంతేగాకుండా విద్యార్థులకు అవసరమైన స్టడీ కంటెంట్ కోసం దేశంలో దివాళాతీసిన బైజూస్ సంస్థను పనిగట్టుకొని రాష్ట్రానికి తీసుకొచ్చి, తానేదో చాలా గొప్ప పని చేస్తున్నట్టు జగన్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నాడు. ట్యాబ్ లపంపిణీ, పాఠ్యాంశాలకోసం బైజూస్ సంస్థతో ఒప్పందం ముసుగులో జగన్ రెడ్డి ఎంత దోచేశాడో ప్రజలంతా తెలుసుకోవాలి.
కనీసంగా రూ.9వేలకు లభించే శాంసంగ్ ట్యాబ్ ని రూ.13,262కు కొనడం ద్వారా జగన్ రెడ్డి రూ.221కోట్లు స్వాహా చేశాడు
8.7 అంగుళాల స్క్రీన్ సైజ్ ఉన్న ఏ7లైట్ శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ (మోడల్ ఎస్.ఎమ్.టీ.220) లు విద్యార్థులకు ఇస్తున్నట్టు, ఆ మోడల్ ట్యాబ్ ఒక్కోటి రూ.13,262కు కొనుగోలుచేసినట్టు, (688కోట్లు/5,18,740) నేడు భారీ ప్రకటనల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి బిల్డప్ ఇచ్చాడు. జగన్ రెడ్డి చెప్పిన శాంసంగ్ ట్యాబ్ ధర అమెజాన్ వంటి ఆన్ లైన్ సైట్లలో చూస్తే, దానివిలువ ఎం.ఆర్.పీ. రూ.14,500లుఉంటే, డిస్కౌంట్లో భాగంగా రూ.11,999 లకే లభిస్తున్నట్టు ఉంది. ఆన్ లైన్ వెబ్ సైట్ లో రూ.11,999లుగా ఉన్న ట్యాబ్ ను, అదనంగా రూ.1263లు చెల్లించి జగన్ రెడ్డి రూ.13,262కు ఎందుకు కొన్నాడో ఆలోచించాలి.
ఒక్కట్యాబ్ పైనే ఎం.ఆర్.పీ ధరకంటే ఆన్ లైన్ సంస్థలు రూ.2,500లు తగ్గింపును ఇస్తున్నప్పుడు, 5లక్షల ట్యాబ్ లు కొనుగోలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి శాంసంగ్ కంపెనీ నుండి ఇంకా ఎన్నిరెట్లు అదనంగా తగ్గింపులభించే అవకాశం ఉండేదో ప్రతిఒక్కరూ ఆలోచించాలి. ఆవిధంగా ప్రభుత్వానికి ఇంతభారీ కొనుగోళ్లలో ప్రత్యేకతగ్గింపులతో తక్కువలో తక్కువగా ఒక్కో ట్యాబ్ రూ.9వేలకే లభించి ఉండేది. రూ.9వేలకు వచ్చే ట్యాబ్ ను జగన్ రెడ్డి ఎక్కువధరపెట్టి, రూ.13,262కుకొని, కొనుగోళ్లలోనే రూ.221కోట్లు మింగేశాడు. (రూ.4,262 X 5,18,740).
మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగానే కేంద్రప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జగన్ రెడ్డి ట్యాబ్ స్ర్కీన్ సైజ్ విషయంగా 8.7 అంగుళాల ప్రత్యేకనిబంధన టెండర్ డాక్యుమెంట్ లో చేర్చాడు.
ట్యాబ్ ల పంపిణీలో స్కామ్ చేయడంకోసం, ముందస్తుగా జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగానే జగన్ రెడ్డి అండ్ కో 8.7అంగుళాల శాంసంగ్ మోడల్ ట్యాబ్ ల పంపిణీకి ఫిక్స్ అయ్యాడని జ్యుడీషియల్ ప్రివ్యూ వెబ్ సైట్ లోని సమాచారంతో బట్టబయలైంది. సదరు వెబ్ సైట్ లో ఆగస్ట్ 17-2022నాటి డాక్యుమెంట్లు పరిశీలిస్తే, పేజీనెం-7 పాయింట్ నెం.3లో ఎస్.వీ.ఎస్ టెక్నాలజీసంస్థ లేవనెత్తిన అభ్యంతరాలు చూడవచ్చు. 8.7అంగుళాల నిబంధనను 8 అంగుళాలు అంతకంటేఎక్కువగా మార్చాలని జ్యుడీషియల్ ప్రివ్యూలో ఎస్.వీ.ఎస్. టెక్నాలజీవారు విజ్ఞప్తిచేశారు. స్క్రీన్ సైజ్ ని 8 అంగుళాలు ఆ పైన అని మారిస్తే, అనేక ప్రముఖకంపెనీలు టెండర్ లో పాల్గొనే అవకాశం ఉంటుందని, మరిన్ని మోడళ్ల ట్యాబ్ లు అందుబాటులోకి వస్తాయని చెప్పింది. అలాకాకుండా ప్రభుత్వం 8.7 అంగుళాలే అనే నిబంధన విధించడంవల్ల ఆ సైజ్ ట్యాబ్ లు పంపిణీచేసే శాంసంగ్ కు మాత్రమే మేలుజరుగుతుందని సదరుసంస్థ అభిప్రాయపడింది.
ఎస్.వీ.ఎస్. టెక్నాలజీ వారు మాత్రమేకాకుండా, క్లస్టర్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, వారిమన్ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్, ఏసర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎమిజో సొల్యూషన్స్ సంస్థలు కూడా ట్యాబ్ డిస్ ప్లే (స్క్రీన్) సైజుపై అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. అమిజోసొల్యూషన్స్ సంస్థ జాతీయస్థాయిలో అమలవుతున్న కేంద్రప్రభుత్వ నిబంధనల్నికూడా జగన్ ప్రభుత్వం ముందు ఉంచింది. జ్యుడీషియల్ రివ్యూ పేజీనెం-13లో సదరుసంస్థ (ఆగస్ట్ 27,2021న) కేంద్రప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎమ్.ఈ.ఐ.టీ.వై) నిబంధనలు ప్రస్తావించింది.ఆ నిబంధనలప్రకారం దేశవ్యాప్తంగా ట్యాబ్ ల కొనుగోళ్ల సందర్భంలో ఆయా రాష్ట్రాలు/సంస్థలు 8 అంగుళాలు అంతకంటే ఎక్కువ స్క్రీన్ సైజ్ ను కనీసనిబంధనగా పాటించి ట్యాబ్ లు కొనుగోలు చేయాలని స్పష్టంగా కేంద్రమంత్రిత్వశాఖ తెలియచేసింది.
కానీ నేడుదానికి విరుద్ధంగా 8.7అంగుళాల స్క్రీన్ సైజ్ ని కనీస అర్హతగా టెండర్లో చేర్చడం కేంద్ర ప్రభుత్వ సర్క్యులర్ కు విరుద్ధమని స్పష్టంగా తెలియచేయడమే కాకుండా, అనేక ఇతర రాష్ట్రాల్ని ఉదాహరణగా పేర్కొంది. ఈ విధంగా ఇన్నిసంస్థలు జాతీయస్థాయి నిబంధనలు ప్రస్తావించిమరీ ట్యాబ్ స్క్రీన్ సైజ్ 8అంగుళాలు అంతకంటే ఎక్కువ ఉండాలని చెబితే, కంసమామ జగన్ రెడ్డి 8.7 అంగుళాలే కావాలని పట్టుబట్టడంలోని ఆంతర్యం, ముమ్మాటికీ దోపిడీనే. మ్యాచ్ ఫిక్సింగ్ లోభాగంగానే జగన్ రెడ్డి విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్ స్క్రీన్ సైజ్ ను 8.7అంగుళాలకు పరిమితంచేసి, తాను ముందుగా నిర్ణయించుకున్న శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ను అధికధరకు కొనుగోలుచేశాడని కచ్చితంగా చెప్పగలం.
కమీషన్ల కోసమే దివాళాతీయబోతున్న బైజూస్ సంస్థను జగన్ రెడ్డి రాష్ట్రానికి ఆహ్వానించాడు
విద్యార్థులకు మంచిచేయడానికి, వారికిపాఠాలు చెప్పడానికి, వారికి అవసరమైన కంటెంట్ ఇవ్వడానికి జగన్ రెడ్డికి రేపోమాపో అస్తమించబోతున్న బైజూస్ సంస్థ తప్ప, మరేకంపెనీ దొరకలేదా? బైజూస్ సంస్థ 1.2 బిలియన్ డాలర్ల అప్పుఎగ్గొట్టిందని, రుణదాతలు సదరుసంస్థను ఒత్తిడిచేస్తున్నారని జాతీయ ఆంగ్లదినపత్రిక (డిసెంబర్16-2022న బిజినెస్ స్టాండర్డ్)లో రాశారు. త్వరలో దివాళాతీయబోతున్న , బైజూస్ సంస్థ గత ఆర్థికసంవత్సరంలో (2020-21) రూ.4,588కోట్ల అప్పులఊబిలోకి కూరుకుపోయిందని, 2,500మంది ఉద్యోగుల్ని ఆ సంస్థ గతఏడాది తొలగించిందని మీడియాలో కథనాలువచ్చాయి.
అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే, బైజూస్ సంస్థపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్.సీ.పీ.సీ.ఆర్.-జాతీయ బాలలహక్కుల కమిషన్) వారికి ఫిర్యాదులు అందడం జరిగింది. సదరు కమిషన్ ఛైర్మన్ ప్రియాంక్ కనుంగో “బైజూస్ సంస్థ విద్యార్థులు, వారితల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు సేకరించి, పలురకాలుగా వారిని బెదిరింపులకు గురిచేస్తునట్టు” తమకు ఫిర్యాదులు అందాయని, త్వరలోనే బైజూస్ సంస్థకు నోటీసులుజారీ చేసి కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు. నేడు మనదురదృష్టం అలాంటి సంస్థతో కంసమామ జగన్ రెడ్డి చేతులుకలపడం. ఒక 420 కంపెనీ బైజూస్ తో కేవలం కమీషన్లకోసమే మరో420 జగన్ రెడ్డి చేతులు కలిపినట్టు ఈ వ్యవహారంద్వారా అర్థమవు తోంది.
నాడు ముందుచూపుతో చంద్రబాబుగారు నెలకొల్పిన ఏపీ కంటెంట్ కార్పొరేషన్ ని, దేనికి నీరుగార్చావు జగన్ రెడ్డి?
విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించి, వారికి మేలు చేసేవాడే అయితే ఈ 420 ముఖ్య మంత్రి, గతంలో చంద్రబాబునాయుడు రాష్ట్రంలో వివిధరకాల కంటెంట్ల రూపకల్పన కోసం ఫిబ్రవరి14-2018న జీవోనెం-4తో ఏర్పాటు చేసిన కంటెంట్ కార్పొరేషన్ ఎందుకు మూతపడే లా చేశాడో చెప్పాలి. ఆ కార్పొరేషన్ షట్టర్ మూసేయించిన జగన్ రెడ్డి, డిజిటల్ కార్పొరేషన్ గా దానిపేరుమార్చాడు. చంద్రబాబు గారు ఏర్పాటుచేసిన కంటెంట్ కార్పొరేషన్ అందుబాటులోఉంటే, నేడు ఈప్రభుత్వం బైజూస్ లాంటి దివాళాకోరు సంస్థల్ని ఆశ్రయించ కుండా, మనమే మనవిద్యార్థులకు అవసరమైన కంటెంట్లను అతితక్కువఖర్చుతో తయారు చేసుకోవడానికి అవకాశముండేది. బైజూస్ సంస్థలైతే తనకు అడిగినంత కమీషన్లు ఇస్తామనే జగన్ రెడ్డి, గతప్రభుత్వంలో ఏర్పాటైన కంటెంట్ కార్పొరేషన్ ను మూసేయించాడు అనుకోవాలి.
వివిధరాష్ట్రాలు కేంద్రప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ట్యాబ్ ల పంపిణీ టెండర్లలో అనేక కంపెనీలు పాల్గొనే అవకాశం కల్పిస్తే, జగన్ రెడ్డి ఒక్కడే కమీషన్లకక్కుర్తితో అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు.
దేశంలో జగన్ రెడ్డి ఒక్కడే విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వడంలేదు. గతంలో ఉత్తరప్రదేశ్ 7లక్షలు, గుజరాత్ 3లక్షలు, హర్యానా రాష్ట్రాలు 5లక్షల ట్యాబ్ లు విద్యార్థులకు పంపిణీ చేశాయి. ఆయారాష్ట్రాలు ఏవీ జగన్ రెడ్డిలాగా నాకు 8.7 అంగుళాల స్క్రీన్ సైజ్ ఉన్న ట్యాబ్ లే కావాలి… ఫలానా కంపెనీ ఫలానా మోడల్ ట్యాబ్ లే కావాలని మ్యాచ్ ఫిక్సింగ్ నిబంధన లు పెట్టలేదు. ఆయా రాష్ట్రాలన్నీ 8అంగుళాలు, అంతకంటేఎక్కువ స్క్రీన్ సైజ్ ఉండాలనే కేంద్రప్రభుత్వ నిబంధన అమలుచేయడమేకాక, టెండర్లలో అనేకకంపెనీలు పాల్గొనేలా అవకాశమిచ్చాయి. ఆవిధంగా మిగతారాష్ట్రాల్లో ఏసర్ కంపెనీ, లెనోవో లాంటి పేరున్న సంస్థ లు టెండర్లలో పారదర్శకంగా పాల్గొని ట్యాబ్ లు పంపిణీ చేశాయి. కానీ అటువంటి కంపెనీల కు రాష్ట్రంలో అవకాశం లేకుండాచేసి, అవేవీ టెండర్లలో పాల్గొనకూడదన్న దురుద్దేశంతోనే జగన్ రెడ్డి కావాలనే ట్యాబ్ స్క్రీన్ సైజ్ ని 8.7అంగుళాలు ఉండాలనే నిబంధన పెట్టాడు.
ట్యాబ్ ల కుంభకోణంపై, వైసీపీనేత డీ.ఎల్.రవీంద్రారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి బొత్స ఏం సమాధానం చెబుతాడు? వైసీపీనేత డీ.ఎల్. రవీంద్రా రెడ్డి బైజూస్ తో ప్రభుత్వ ఒప్పందం అంతా ఒక మోసమని, బైజూస్ తో ఒప్పందాలను మిగతారాష్ట్రాలన్నీ వ్యతిరేకించాయని చెప్పలేదా! బైజూస్ తో ప్రభుత్వం ఒప్పందంచేసుకునేలా కడపకుచెందిన ఇద్దరు అధికారపార్టీ నేతలు చక్రం తిప్పారన్న మాజీమంత్రి డీ.ఎల్. రవీంద్రారెడ్డి వ్యాఖ్యల్ని జగన్ , బొత్స ఎలా సమర్థించుకుంటారు” అని పట్టాభిరామ్ ప్రశ్నించారు.