Suryaa.co.in

Andhra Pradesh

శ్రీ పృథ్వీశ్వర స్వామిని దర్శించుకున్న కనకమేడల దంపతులు

రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ – ఉషారాణి దంపతులు ఆదివారం చల్లపల్లి మండలం నడకుదురులోని ప్రాచీన శైవక్షేత్రం శ్రీ పృథ్వీశ్వర స్వామిని దర్శించుకున్నారు. పృథ్వీశ్వర స్వామి దేవస్థాన రాజగోపుర వార్షికోత్సవ వేడుకలు పురస్కరించుకొని ఎంపీ దంపతులు పృథ్వీశ్వరుని సేవలో తరించారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ఆలయ సమగ్ర అభివృద్ధి ప్రదాత మండవ రవీంద్ర – రమణ కుమారి దంపతుల ఆధ్వర్యంలో వేద పండితులు కంఠంరాజు సాయి గణపతి దీక్షితులు స్వామి వారికి పూజలు అభిషేకాలు చేశారు. ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ – ఉషారాణి దంపతులు, మండవ రవీంద్ర – రమణ కుమారి దంపతులు రుద్రహోమం, నవ గ్రహ హోమాలు ఘనంగా నిర్వహించి మహా పూర్ణాహుతి సమర్పించారు.

LEAVE A RESPONSE