Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి ఢిల్లీ యాత్ర తిక్కలోడు తిరనాళ్లకెళ్లినట్లుంది

– టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్

ఏపీ సీఎం జగన్‌ పర్యటన తిక్కలోడు తిరణాలకు వెళ్లినట్లుందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఎద్దేవా చేశారు. ప్రధాని, హోం మంత్రితో ఏం మాట్లాడారు? ప్రత్యేక హోదా డిమాండ్‌ చేశారా లేదా అని ప్రశ్నించారు.

కనకమేడల ఇంకా ఏమన్నారంటే.. ముఖ్యమంత్రి డిల్లీ పర్యటన గోప్యతపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ప్రధాని, హోంమంత్రి ని కలిసి ఏం మాట్లాడారో ‎జగన్ ఎందుకు చెప్పటం లేదు? కేంద్రాన్ని ఏం అడిగారు? అప్పులిమ్మని అడిగారా? మీ కేసుల మాఫీ గురించి అడిగారా? వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ నిలిపివేయమని కోరారా ? 25 మంది ఎంపీలనిస్తే ప్రత్యేక హోదా అన్నారు? తర్వత మాట మార్చారు. కేంద్రంలో ఎన్డీయేకు పూర్తి మెజార్టీ ఉన్నందున హోదాపై కేంద్రాన్ని ప్రాధేయపడటం తప్ప కమాడింగ్, డిమాండ్ చేయలేమని జగన్ అన్నారు.

‎ కానీ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి తగిన బలం లేదు, తామే ఈ ఎన్నికలో కీలకమని వైసీపీనే అంటోంది. ఈ అవకాశం వినియోగించుకుని కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తారా కేంద్రాన్ని దేబిరించి అప్పులు తెచ్చుకోవటం జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఆనవాయితీగా మారింది. ఇప్పటికే పరిమితికి మించి అప్పులు తెచ్చారు, కానీ వాటితో అభివృద్ది చేశారా అంటే అదీ లేదు.

రోడ్లపై కనీసం గుంతలు కూడా పూడ్చలేదు.వైసీపీ ప్రభుత్వ ఆర్దిక విధానాల్ని కాగ్ తప్పు పట్టినా..‎ జగన్ రెడ్డి మాత్రం ఎందుకు లెక్కలు ‎ ఎందుకు బహిర్గతం చేయటం లేదు?

జగన్ తన స్వార్డం కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు.జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రహస్యంగా ఉంచడానికి మీ కుటుంబ అంశం కాదు, రాష్ట్రానికి సంబందించిన అంశం.కేంద్రాన్ని జగన్ రెడ్డి ఏం ‎ అడిగారో ఆయన ప్రజలకు చెప్పాలి.

LEAVE A RESPONSE