Suryaa.co.in

Andhra Pradesh

ఎమ్మెల్యేలను పశువుల్లా కొనడం ఏ రాజ్యాంగ స్ఫూర్తి బాబూ..?

– బాబు అధికారంలో ఉంటే స్వజన ప్రయోజనాలు.. లేనప్పుడు రాజ్యాంగ పరిరక్షణా..!?
– రాజ్యాంగ వ్యవస్థలను ఎవరు నిర్వీర్యం చేశారో చర్చిద్దామా బాబూ..?
– మీడియా స్వేచ్ఛ అంటే ఎల్లో మీడియా స్వేచ్ఛా బాబూ..?
– మాజీ మంత్రి కురసాల కన్నబాబు

అధికారంలో లేనప్పుడే బాబుకు రాజ్యాంగం గుర్తొస్తుంది
రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఇది. రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని నిర్వహిస్తూ రాజ్యాంగ రూపశిల్పి, మహనీయుడు అంబేద్కర్‌ గారిని స్మరించుకున్నాం. రాజ్యాంగ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందిస్తామని ప్రతిజ్ఞ చేయడం మన విధిగా భావించాం. కానీ కొంత మంది తమ స్వార్థ రాజకీయ అవసరాల కోసం ఈరోజును కూడా వాడుకుంటున్నారు. ప్రతి దాన్ని రాజకీయంగా చూసే వారిలో మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబునాయుడు.

చంద్రబాబు నాయుడు తానో గొప్ప రాజ్యాంగ ప్రేమికుడిలా ఓ ప్రేమ లేఖను ప్రజలకు రాశారు. ఆ లేఖ నిండా జగన్‌ పై శాపనార్ధాలు..ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడమే ఉన్నాయి. దెయ్యాలు వేదాలు వల్లించడం అనే సామెత అచ్చు గుద్దినట్లు చంద్రబాబునాయుడికి సరిపోతుంది. రాజ్యాంగం గురించి, రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడిన ఈ పెద్ద మనిషికి అధికారంలో లేనప్పుడు రాజ్యాంగం గుర్తుకువస్తుంది. అధికారంలో లేనప్పుడు ప్రజల హక్కులు, బాధ్యతలు గుర్తుకు వస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం స్వజన ప్రయోజనాలు మాత్రమే గుర్తుకు ఉంటాయి. తనవారి ప్రయోజనాలకు భంగం కలగకుండా ఏదైనా చేస్తాడు.

చర్చకు వస్తావా బాబూ..?
ఈ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలన చేసింది ఎవరనే అంశంపై చర్చకు వస్తావా చంద్రబాబు..? మహానేత రాజశేఖరరెడ్డి రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలన చేస్తే…ఆయన అడుగు జాడల్లో ఆ స్ఫూర్తిని అందుకుని జగన్మోహన్‌ రెడ్డి గత మూడున్నరేళ్ళుగా అంబేద్కర్ ఆశయ సాధన దిశగా పరిపాలన చేస్తున్నారు. రాజ్యాంగ పరిరక్షణ గురించి గొప్పగా మాట్లాడుతున్న చంద్రబాబు హయంలో ఏం చేశారో మేం చేప్తాం.. మీరు చర్చకు వస్తారా..?. అబద్దాలను అలవోకగా, దుర్మార్గంగా సొంత బాకాలతో ప్రచారం చేసి, లేనిది ఉన్నట్లు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు. ఆ లేఖలో చంద్రబాబు పడ్డ తపన ప్రజల కోసం మాత్రం కాదు.

ఎమ్మెల్యేలను పశువుల్లా కొనడం ఏ రాజ్యాంగ స్ఫూర్తి బాబూ..?
ఎన్టీఆర్‌ ను కూలదోసి క్యాంపు రాజకీయాలు నడపడం రాజ్యాంగ పరిరక్షణ అవుతుందా..? ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొని, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం ఏ రాజ్యాంగ స్ఫూర్తి అనేది చంద్రబాబు చెప్పాలి. అమరావతి రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేసి.. ఓత్‌ ఆఫ్‌ సీక్రెసీకి తిలోదకాలు ఇచ్చి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, 4,500 ఎకరాలను ఏవిధంగా సంపాదించుకున్నారో సీఐడీ స్పష్టంగా చెప్పింది.

మంత్రి వర్గ ఉపసంఘం కూడా అదే తేల్చింది. దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అంటూ చంద్రబాబు చేసిన వాఖ్యలు ఈ దేశానికి ఆయన ఇచ్చిన సందేశమా..? అనేది జవాబు చెప్పాలి. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతిసేలా బీసీల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ అనేక సార్లు చంద్రబాబు అడ్డగోలు వాఖ్యలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల్లో.. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించమని రైతులు రోడ్డెక్కితే.. కాల్పులు జరిపి రైతులను చంపేశాడు.

బషీర్‌బాగ్‌లో గుర్రాలతో మహిళలను తొక్కించిన వ్యక్తి చంద్రబాబే. జీతాలు పెంచమని అంగన్‌వాడీ నుంచి ఎన్జీవోల వరకు ఆందోళనలు చేస్తే లాఠీలతో కొట్టించారు. నోరెత్తిన ప్రతి ఒక్కరిపై అన్యాయంగా కేసులు పెట్టి, దుర్మార్గంగా, కిరాతకంగా కొంతమందిని చంపి తన కుర్చీని కాపాడుకున్నాడు. ఇప్పుడు ఆయన, ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని, రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుందని మాట్లాడటం హాస్యాస్పదం.

వీడేం ఖర్మ రాష్ట్రానికి…!
ఇంగ్లీష్‌ బాష నేర్చుకుంటే పులి పాలు తాగినట్లు అని అంబేద్కర్‌ గారు ఆనాడే చెప్పారు. అలాంటి ఇంగ్లీష్‌ మీడియం విద్యను ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెడితే కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకువచ్చింది మీరు కాదా…?. అమరావతిలో కొంత మంది పేదలకు భూములు ఇస్తామంటే.. వారికి నిలువ నీడ ఉండకూడదని, సామాజిక అసమతుల్యత వస్తుందని కోర్టులకు వెళ్లింది మర్చిపోయారా.?. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు.. అన్నట్లు రాజ్యాంగ స్ఫూర్తి గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు, ఉత్తరాలు రాస్తున్నాడు. వీడేం(బాబు) ఖర్మ ఈ రాష్ట్రానికి అనుకోబట్టే ప్రజలు 2019లో సరైన తీర్పు ఇచ్చారు. చంద్రబాబు కొడుకు లోకేష్‌ను మంగళగిరిలో ఓడించారు. ఆ విషయాన్ని చంద్రబాబు మర్చిపోయాడు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జగన్ గారు నిలిచిపోతున్నాడు.. దాంతో ఇదేం ఖర్మ తెలుగుదేశానికి అని చంద్రబాబు భావిస్తున్నాడు. గతంలో మాదిరిగా చంద్రబాబు చెప్పినవన్నీ వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు.

నియంతలా బాబు పాలన
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, తానొక నియంతలా పరిపాలించిన విషయాన్ని మర్చిపోయాడు. నా మాట నేనే వినను.. అని బిల్డప్‌లు ఇచ్చుకుంటూ, ఒక్క ప్రాజెక్టు కట్టలేదు గానీ, అమరావతిని గ్రాఫిక్స్‌తో మభ్యపెట్టి అమెరికాకు కూడా నేనే పాఠాలు నేర్పానని చెప్పుకున్నాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల హక్కులను కాలరాసి, వారిపై చాలా దుర్మార్గమైన భాష వాడి పరిపాలన చేసింది చంద్రబాబునాయుడే.
బీసీలు నా ఆత్మబంధువులు, నా బ్యాక్‌ బోన్‌ అని, మహిళలకు అన్నింటా పెద్ద పీట వేసి, వారి హక్కులు కాపాడుతున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌. నామినేటెడ్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ ఇచ్చారు. అందులో 50 శాతం మహిళలకు రిజర్వేషన్‌ ఇచ్చారు. నామినేటెడ్‌ పనుల్లో కూడా ఈ వర్గాలకు రిజర్వేషన్‌ ఇచ్చి వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నాయకుడు వైఎస్‌ జగన్‌. జగన్ చేసింది, చేస్తున్నదీ రాజ్యాంగ పరిరక్షణా..? లేక చంద్రబాబు తన పాలనలో వెలగబెట్టింది రాజ్యాంగ పరిరక్షణా.?అని సూటిగా ప్రశ్నిస్తున్నా.

మీడియా స్వేచ్ఛ అంటే ఎల్లో మీడియా స్వేచ్ఛా బాబూ..?
చంద్రబాబునాయుడు ఇంకా ఎంత కాలం ఇలా అబద్దాలు మాట్లాడతాడు. ఎంత కాలం జగన్మోహన్‌ రెడ్డి గారిపై అబద్ధాలు ప్రచారం చేస్తాడు.. చంద్రబాబుకు జగన్‌ పేరెత్తితేనే వణుకు.. నిద్రపట్టదు. చంద్రబాబునాయుడు దృష్టిలో మీడియా స్వేచ్ఛ అంటే ఎల్లో మీడియా స్వేచ్ఛ. ఆయనకు బాజా భజంత్రీలు వాయించే మీడియాకే స్వేచ్ఛ కావాలట. అచ్చోసి వదిలేసినట్లు అబద్దాలను రోజూ వండి వార్చి ప్రజల్లోకి తీసుకెళ్లే ఆ మీడియాకు స్వేచ్ఛ కావాలని చంద్రబాబు కోరుకుంటున్నాడు. ఆ పచ్చ మీడియా మాత్రం చంద్రబాబు బాహుబలి అని, లోకేష్‌ పెద్ద మగధీరుడు అంటూ బిల్డప్‌లు ఇస్తూ రాతలు రాస్తాయి. ఆ రాతలనే ప్రజలు నమ్మాలన్నట్లు ఎల్లో గ్యాంగ్‌ ప్రవర్తిస్తుంది.

వాళ్లు రాసే తప్పుడు కథనాలను ప్రశ్నిస్తే మీడియా స్వేచ్ఛను దెబ్బతీసినట్లు చంద్రబాబు లేఖలు రాస్తున్నాడు. చంద్రబాబు అనుకూల ఎల్లో మీడియా స్వేచ్ఛ వల్ల.. రాష్ట్రంలో మీడియాను ఎంతగా బ్రష్టు పట్టించారో, తెలుగు మీడియాకు దుర్మార్గమైన చెడ్డ పేరు జాతీయ స్థాయిలో ఎవరి వల్ల వచ్చాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పచ్చ పత్రికలు చంద్రబాబు లాంటి వ్యక్తిని మోసే క్రమంలో అసలు ఏం చేస్తున్నామో కూడా వారికే తెలియని పరిస్థితిలోకి వెళ్లి పోయాయి. ఎంత కాలం ఇలా మోస్తాం… అని ఆ పత్రికలు అనుకుని ఉంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పని రాజకీయంగా ఎప్పుడో కనుమరుగయ్యేవాడు.

కోర్టులను తప్పుదోవ పట్టిస్తోంది మీరే కదా..?
ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు ఇచ్చిందంటూ చంద్రబాబు చెప్తున్నాడు తప్పితే.. ఆ కేసులు ఎవరు పెట్టారని మాత్రం మాట్లాడడు. ప్రభుత్వంపై అడ్డగోలు కేసులు వేయించడానికే చంద్రబాబు తన దగ్గర ఒక పెద్ద సెల్‌ నిర్వహిస్తున్నాడు. ఇంగ్లీష్‌ మీడియం పెడితే కేసు…సచివాలయాలు పెడితే కేసు…వాలంటీర్లను పెడితే కేసులు వేశారు. మొన్న జరిగిన ఇప్పటం విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు గురించి ఎందుకు మాట్లాడటం లేదు. కోర్టులను ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారో హైకోర్టే తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసే స్థాయికి వచ్చింది.

చంద్రబాబుకు అనుకూలంగా ఉంటే అన్నీ బాగున్నట్లు..లేదంటే వ్యవస్థలన్నీ నడవడం లేదన్నట్లు చంద్రబాబు చెప్తున్నారు. రైతులే నడవాలి అని కోర్టు చెప్పినప్పుడు అసలు పాదయాత్రే ఆగిపోయింది. అది అమరావతి రాజధాని యాత్ర కాదు.. అదొక రియల్‌ ఎస్టేట్‌ యాత్ర అనేది తేటతెల్లమైంది. మీరు ఎన్ని అబద్దాలు రాసినా, లేనిపోనివి జగన్మోహన్‌ రెడి పై ఆపాదించి రాసినా జనం నమ్మరు. చంద్రబాబు అనుకూల మీడియాలో రాసే రాతలు అబద్దాలు, అసత్యాలు అని చెబితే.. మీడియా స్వేచ్ఛను దెబ్బకొట్టడమని చంద్రబాబు చెప్తున్నారు.

తన హయాంలో ఎంత గొప్పగా పరిపాలించాడో ఒక రాత్రి ప్రశాంతంగా కూర్చుని చంద్రబాబు ఆలోచించాలి. ఈ రోజు వైఎస్‌ జగన్‌ వ్యవస్థల్లోనే సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయడం రాజ్యాంగ స్ఫూర్తి కాదా అని చంద్రబాబునాయుడిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఓర్వలేని, కుల్లు బోతుతనంతో వేదనలు, రోదనలతో టీడీపీ నాయకులు ఏమి సాధిస్తారని అడుగుతున్నా. 43 వేల బెల్ట్‌ షాపులను ఒక్కసారి ఎత్తివేస్తే రాజ్యాంగ విరుద్ధంగా కన్పించిందా…? కార్పొరేట్‌ విద్యా సంస్థలు, కార్పొరేట్‌ డెయిరీల వంటి వాటిని మద్దతుగా నిలబడితే చంద్రబాబుకి బాగుంటుంది. మీ చుట్టూ ఉండే పదిమంది బాగుకోసం పనిచేసే ప్రభుత్వం కాదు మాది అని కన్నబాబు స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE