తిరుపతి: అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం శ్రీశైలం మరియు వారణాసి, బృందావనం, నైమిశరణ్యం, షిర్డీ, శ్రీశైలం, మహానంది, భద్రాచలం, యాదగిరి గుట్ట, రామేశ్వరం, అరుణాచలం, అలంపూర్, త్రిపురాంతకం, వేద పాఠశాల కర్నూలు, వృద్ధాశ్రమం విజయవాడ తదితర అనేక పుణ్య ప్రదేశాలు లో సత్రాలు ఏర్పాటు చేసి వసతి, నిరంతర అన్న దాన కార్యక్రమం నిర్వహిస్తూ వేదం, గోశాల సనాతన ధర్మ కార్యక్రమం లు నిర్వహిస్తూ భారత దేశము లో ప్రఖ్యాతి గాంచిన కరివేన బ్రాహ్మణ సత్రం.. తిరుపతి లో జరిగిన ఎన్నికలు లో కోశాధికారి పదవి కి ఏకగ్రీవంగా ఎన్నికయిన గోపాలుని హరి హర రావు , జాయింట్ సెక్రటరీ గా ఎన్నికయిన కాళంరాజు రామకృష్ణ కి పలువురు అభినందనలు తెలిపారు.
షిర్డీ సాయి బాబా మందిరం, మార్కాపురం నందు బ్రాహ్మణ పెద్దలు సత్కరించారు. యన్. జి. ఓ. ప్రెసిడెంట్ బి. వి. ఎస్. శాస్త్రి , rtc ఉద్యోగ నాయకులు సోమయజుల శాస్త్రి , కలవలపుడి శ్రీనివాస రావు చిప్స్ శ్రీను, గోపాలుని రమేష్ రాష్ట్ర తెలుగు పండిట్ నాయకులు, మాజీ సైనికుల కార్యదర్శి సాయి, బాబా మందిరం కోశాధికారి నాగరాజు ,మల్లయ్య , సాయిబాబా, కృష్ణ, శివాలయం మాజీ చైర్మన్ కేశవ రావు తదితరులు పాల్గొని సన్మానించారు.
బాబా మందిరం కమిటీ ప్రెసిడెంట్ పేరం సత్య నారాయణ, వైస్ ప్రెసిడెంట్ రామడుగు గోపి, జాయింట్ సెక్రటరీ చల్లా పవన్, షేక్ ఖరీం, విజయ్, కృష్ణ మోహన్,కమిటీ సభ్యులు వారి సేవలు కొనియాడి సన్మానించారు. అయోధ్య, అన్నవరం, తిరుమల, కాళేశ్వరం మరికొన్ని పుణ్య ప్రదేశాలు లో సత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు బ్రాహ్మణులకు భవిష్యత్ లో అనేక సేవలు అందిస్తామని నూతనముగా ఎన్నికయిన గోపాలుని హరిహర రావు కోశాధికారి, కాళంరాజు రామకృష్ణ జాయింట్ సెక్రటరీ తెలిపారు హాజరైన సభ్యులకు అభినందనలు తెలిపారు.