– జూబ్లీహిల్స్ ఎన్నికపై కవిత పోస్ట్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి కేసీఆర్ కుమార్తె.. కేటీఆర్ చెల్లెలు కల్వకుంట్ల కవిత ఎక్స్ లో పోస్ట్ చేసిన మెసేజ్ సంచలనంగా మారింది. కర్మ హిట్స్ బ్యాక్.. అంటూ ఇంగ్లీష్ లో ఆమె మెసేజ్ పెట్టారు. ఆమె మెసేజ్ అర్థం.. కర్మ తిరగబడి ఫలితం చూపెడుతోంది” అని.
సొంత బిడ్డ అని కేసీఆర్.. సొంత చెల్లి అని కేటీఆర్ కనికరం చూపకుండా నిర్ధాక్షిణంగా తనను పార్టీ నుండి వెళ్లగొట్టారని రగిలిపోతున్న కవిత.. జూబ్లీహిల్స్ లో బీ ఆర్ ఎస్ అభ్యర్థి ఓటమి చవిచూసిన వైనంపై గట్టిగానే స్పందించినట్లు కనిపిస్తోంది. తనకు చేసిన అన్యాయం ఫలితం.. ఇపుడు జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం రూపంలో వెనక్కి చూపెడుతోంది అన్నట్లుగా తండ్రి.. అన్నపై ఆమె కామెంట్ చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ప్రధానంగా ఆమె కేటీఆర్ ను ఉద్దేశించే అలా కామెంట్స్ చేసి ఉంటారనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతోంది. ఏదేమైనా ఘోర పరాజయంతో సిట్టింగ్ సీటు కోల్పోయి నిరాశ నిస్పృహల్లో ఉన్న సమయంలో కవిత కామెంట్స్ పుండుమీద కారం చల్లినట్లుగా ఉన్నాయని, ఆడబిడ్డ ఉసురు తగులుతోందంటూ రాజకీయ ప్రత్యర్థులు గులాబీ పెద్దలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
