– గొట్టిపాటి హర్షకు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అభినందనలు
అమరావతి :భారత జట్టు అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖ బాలికల అంధుల రెసిడెన్షియల్ విద్యార్థిని పంగి కరుణ కుమారికి కిషోర్ గ్రానైట్స్ అధినేత గొట్టిపాటి హర్ష రూ.5 లక్షల ప్రోత్సాహం ప్రకటించినట్టు రాష్ట్ర దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మంగళవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. ఫైనల్ మ్యాచ్ లో కరుణకుమారి చూపిన ప్రతిభకు ప్రోత్సాహంగా గొట్టిపాటి హర్ష రూ. 5 లక్షల ప్రోత్సాహం ప్రకటించినట్టు తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముందుకు రావడం అభినందనీయమని, గొట్టిపాటి హర్షకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.