Suryaa.co.in

Andhra Pradesh

గంజాయి పెరిగేందుకు కరుణాకర్‌రెడ్డి, ఆయన కుమారుడే కారణం

-షాపింగ్ కాంప్లెక్స్ లకు అనుమతులు ఇవ్వాలంటే రూ.లక్ష- రూ.5 లక్షలు వసూలు
-అనుమతుల పేరిటే అభినయ్ రెడ్డి రూ.500 కోట్లు దోచుకున్నారు
-ఎంతకాలం మీరు తిరుపతి ప్రజలను మోసం చేస్తారు?
-ఇసుక అక్రమ రవాణా ద్వారా ఏడాదికి3 జగన్ వెయ్యి కోట్లు కొట్టేస్తున్నారు
-ప్రతి సిమెంట్ బస్తాకి జగన్ కి వాటా
-భవన నిర్మాణం కార్మికుల సొమ్ము జగన్ దొబ్బేసాడు
-నన్ను బూతులు తిట్టడం తప్ప మంత్రులు పీకింది ఎంటి?
-తాగుబోతుల్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన ఘనుడు జగన్ రెడ్డి

జగన్ పాలనలో ఎక్కువ ఇబ్బంది పడింది భవన నిర్మాణ కార్మికులే.జగన్ పాలనలో బంగారం దొరుకుతుంది ఏమో కానీ ఇసుక దొరకదు.అద్భుతమైన ఇసుక విధానం తీసుకొస్తా అని 60 మంది భవన నిర్మాణ కార్మికులను చంపేశాడు జగన్.ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటూ జగన్ ఇసుక దందా చేస్తున్నారు. రోజుకి ఇసుక అక్రమ రవాణా ద్వారా 3 కోట్లు సంపాదిస్తున్నారు జగన్. ఏడాదికి వెయ్యి కోట్లు కొట్టేస్తున్నారు. ఐదేళ్లలో జగన్ ఇసుక ద్వారా 5 వేల కోట్లు సంపాదిస్తున్నారు.

ఏపి ఇసుక ఏపిలో దొరకదు…ఇతర రాష్ట్రాల్లో దొరుకుతుంది.టిడిపి హయాంలో వెయ్యి రూపాయిలు ఉన్న ట్రాక్టర్ ఇసుక జగన్ పాలనలో 5 వేలకు చేరింది.సిమెంట్ ధరలు జగన్ పాలనలో 60 శాతం పెరిగాయి. ప్రతి సిమెంట్ బస్తాకి జగన్ కి వాటా వెళ్తుంది.భవన నిర్మాణం కార్మికుల సొమ్ము జగన్ దొబ్బేసాడు. సంక్షేమ బోర్డు ద్వారా సేకరించిన సెస్ నిధులు కూడా జగన్ ప్రభుత్వం సుమారుగా వెయ్యి కోట్లు పక్కదారి పట్టించారు. కార్మికుల ఆడపిల్లలకు పెళ్లయితే ఒక్కొక్కరికి రూ.20 వేలు చొప్పున బోర్డు అందించే పెళ్లి కానుక రద్దు చేశారు.ప్రసవించిన కార్మికుని భార్య లేక కూతుర్లకు ఒక్కొక్కరికి రెండు కాన్పులకు కాన్పుకు రూ.20 వేలు చొప్పున సాయం రద్దు చేశారు.కార్మికులకు రూ.5 లక్షల ప్రమాధ బీమా రద్దు చేశారు. ప్రమాదంలో గాయపడి, వికలాంగులుగా మిగిలిన కార్మికునికి ఇచ్చే రూ.5 లక్షలు ఆర్థికసాయం రద్దు చేశారు.ప్రమాదాల్లో గాయపడిన కార్మికులకు ఆస్పత్రి ఖర్చులకు రూ.3 వేలు చొప్పున ఇచ్చే ఆర్థిక సాయం రద్దు చేశారు.

సహజ మరణం, ప్రమాదంలో మరణించిన కార్మికుని అంత్యక్రియలకు రూ.20 వేలు ఆర్థిక సాయం రద్దు చేసింది జగన్ ప్రభుత్వం.రిజిస్టర్‌ కాని కార్మికులు ప్రమాదంలో మరణిస్తే రూ.50 వేలు పరిహారం రద్దు చేశారు జగన్.కార్మికులకు టూల్‌ కిట్లు కొనుగోలు చేసుకునేందుకు రూ.2,500 రద్దు చేశారు.నిర్మాణ రంగంలో నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు ఒక్కో కార్మికునికి 15 రోజులకు అందించే రూ.7 వేలు రద్దు చేశారు.కార్మికులకు పెన్షన్‌ పథకం రద్దు. ప్రమాదంలో వికలాంగులుగా మారిన కార్మికులకు అందించే కృత్రిమ అవయవాలు రద్దు ఇచ్చే పథకాన్ని రద్దు చేశారు. నన్ను బూతులు తిట్టడం తప్ప మంత్రులు పీకింది ఎంటి? సబ్జెక్ట్ మీద ఛాలెంజ్ చేస్తే పారిపోతారు.మంత్రి జయరాం ఏనాడైనా కార్మికుల సమస్యల గురించి పట్టించుకున్నారా?మెరుగైన ఇసుక పాలసీ తీసుకొస్తాం.తక్కువ ధరకే ఇసుక అందిస్తాం.కోవిడ్ సమయంలో 10 వేల రూపాయిలు ఇస్తామని జగన్ రెడ్డి భవన నిర్మాణ కార్మికులను మోసం చేశారు. జిరాక్స్ డబ్బులు కూడా వృధా. సంక్షేమ బోర్డు ని పునరుద్ధరిస్తాం. తాగుబోతుల్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన ఘనుడు జగన్ రెడ్డి.ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులను కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చి ఉంటారు. పెండింగ్ లో ఉన్న అన్ని క్లైమ్ లు క్లియర్ చేస్తాం.ప్రభుత్వం చుట్టూ మీరు తిరగాల్సిన అవసరం లేదు. గతంలో ఎలా అయితే పెళ్లి కానుక, భీమా, ఆర్ధిక సహాయం అందిచామో అలాగే టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే అందిస్తాం.అన్న క్యాంటీన్ లు తిరిగి తెరుస్తాం.భవన నిర్మాణం లో ఉన్న ఇతర రంగాలకు కామన్ వర్కింగ్ షెడ్లు ఏర్పాటు చేస్తాం.

తిరుపతి కి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.ఒకరు కరుణాకర్ రెడ్డి… రెండో ఎమ్మెల్యే అభినయ్ రెడ్డి.ఇళ్ల నిర్మాణాలకు, షాపింగ్ కాంప్లెక్స్ లకు అనుమతులు ఇవ్వాలంటే రూ.లక్ష- రూ.5 లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ డబ్బంతా సాయంత్రానికి అభినయ్ రెడ్డి కి చేరుతుంది.ఇళ్లలో బోరు వేయాలన్నా రూ.లక్ష- రూ.2 లక్షలు ముట్టజెప్పాల్సిందే. ఇలా అనుమతుల పేరిటే అభినయ్ రెడ్డి రూ.500 కోట్లు దోచుకున్నారు.
ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి డ్రగ్స్, గంజాయిపై పోరాడుతున్నానని పైకి బిల్డప్ ఇస్తున్నారు. ఆకస్మిక తనిఖీలంటూ రోడ్లపైకి వచ్చి హడావుడి చేస్తున్నారు. నగరంలో డ్రగ్స్, గంజాయి ఇంతగా పెరిగి యువత పెడదోవ పట్టడానికి కారణం ఈ ఎమ్మెల్యే కుమారుడా? కాదా? దీనిపై విచారణ చేస్తే కరుణాకరరెడ్డి కుమారుడే దోషి అని తేలుతుంది. ఎంతోమంది తల్లిదండ్రులు తమ బిడ్డలను తిరుపతికి పంపిస్తే వారి భవిష్యత్తు ను అభినయ్ రెడ్డి నాశనం చేస్తున్నాడు. మంగళం, జీవకోన, కొర్లగుంటలో కొన్నేళ్లుగా పేద, మధ్య తరగతి ప్రజలు కష్టపడి పైసాపైసా కూడబెట్టుకుని కొనుక్కున్న భూములు, ఇంటి స్థలాలను కార్పొరేటర్లు, వైకాపా నాయకులు రాత్రికి రాత్రే కబ్జా చేస్తూ చుట్టూ గోడలు కట్టేస్తున్నారు. అభినయ్ రెడ్డి సెటిల్ మెంట్లు చేస్తూ ఆస్తి విలువలో ఇంత అని కమిషన్ తీసుకుంటున్నారు.

గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, ఆయన కొడుకు అభినయ్ రెడ్డి, వైకాపా కార్పొరేటర్లను ఎవరైనా ప్రశ్నిస్తే సాయంత్రానికి సచివాలయ సిబ్బంది అక్రమ నిర్మాణాలంటూ ఇళ్ల వద్దకు వెళ్లి నోటీసులు ఇస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈమధ్య నిర్వహించిన బార్ టెండర్లలో దరఖాస్తు చేసిన వ్యక్తులను సిండికేట్ చేసి ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేయడంతోపాటు, వారి నుంచి రూ.10 కోట్లు వసూలు చేశారు. ఇటువంటి ఎమ్మెల్యే తిరుపతిలో మద్య నిషేధంపై పోరాడుతున్నానని చెబితే ఎవరైనా నమ్ముతారా? ఎమ్మెల్యే గారూ ఇంతకంటే పెద్ద జోక్ ఏమైనా ఉందా? ఎంతకాలం మీరు తిరుపతి ప్రజలను మోసం చేస్తారు? ప్రజల భూములను అధికార పార్టీ నాయకులు కొట్టేస్తున్నారు. డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి అమాయకులకు అమ్మి వారిని మోసం చేస్తున్నారు. తిరుపతి నగరంలో సొంత స్థలమున్న వ్యక్తులు ఇప్పుడు భయం గుప్పిట్లో ఉన్నారు. నెల రోజుల పాటు యజమానులు అటువైపు చూడకుండా, స్థలం చుట్టూ గోడ కట్టుకోకుండా ఉంటే ఎప్పుడు ఎమ్మెల్యే అనుచరులు వచ్చి ఆక్రమిస్తారోనని భయపడుతున్నారు.

LEAVE A RESPONSE