– సిగ్గు, శరం ఉంటే వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ మంత్రులు మాట్లాడాలి
-బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమార స్వామి
విజయవాడ : అనేక జిల్లాల్లో పర్యటన చేసి రైతులను కలిశాను. ఎపి లో కరవు విలయ తాండవం చేస్తుంది.రైతులు రోధిస్తున్నా మంత్రులు, అధికారులు కనీసం కలిసిన పరిస్థితి లేదు. 450 మండలాల్లో కరవు ఉంటే…103 మండలాలే అని ప్రభుత్వం చెబుతుంది. సీఎం సొంత జిల్లాల్లోనే కరవుతో రైతులు అల్లాడుతున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు మునిగిపోయినా సిఎం లో స్పందన లేదు. జగన్మోహన్ రెడ్డి నిజంగా సిగ్గు పడాల్సిన అంశం.
రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్ల నీరు కూడా లేని దుస్థితి. కర్ణాటక కాలువల్లో నీరు పారుతుంటే… ఎపి లో రైతుల కళ్ల ల్లో మాత్రమే నీరు కారుతుంది. అధికారులు కూడా రాజకీయ నాయకులు తో సమానంగా సీట్లకే పరిమితం అవుతున్నారు. కాలువలు పూడిపోయినా… అవసరమైన చర్యలు చేపట్టలేదు. కరవు మండలాల విషయంలో అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినా చలనం లేదు. ఈనెల 28న రాష్ట్ర వ్యవసాయ శాఖ కమీషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. వైసీపీ పాలనలో రైతులు పరిస్థితి చాలా దుర్భరంగా మారింది.
నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు కూడా యధేచ్చగా అమ్ముతున్నారు. వీటి వెనుక వైసిపి నాయకుల హస్తం ఉందనేది బహిరంగ సత్యం. మా ఆందోళన తో అయినా ప్రభుత్వం స్పందించాలి. సిగ్గు, శరం ఉంటే వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ మంత్రులు మాట్లాడాలి. లేదంటే ఆ తరువాత మంత్రులు ఎక్కడ కనపడితే అక్కడే అడ్డుకుంటాం.