పార్టీని బలహీన పర్చడానికే కాసాని జ్ఞానేశ్వర్ 119 సీట్లలో పోటీచేస్తామని మాట్లాడారు
అంతర్జాతీయ నిపుణులను పిలిపించి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించాలి
ఏకపక్షంగా కమిటీలను రద్దు చేశారు
ఇసుక కొట్టుకుపోవడం అంటే అది ఇంకా ప్రమాదకరం
కేంద్ర కమిటీ ఇచ్చిన నివేదికను పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టలేదు
టీడీపీ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి నెల్లూరి దుర్గాప్రసాద్
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగడానికి కారణం ఇసుక కొట్టుకు పోయిందని కారణం చెబుతున్నారు. ఇసుక కొట్టుకుపోవడం అంటే అది ఇంకా ప్రమాదకరం. పిల్లర్ల కింద ఇసుక కోట్టుకొని పోతే అది ఎంత ప్రమాదకరమో సామాన్యులకు కూడా తెలుసు. సుందిళ్ల, అన్నారం బ్యారేజిలకు బుంగలు పడ్డాయి. ఏ ప్రాజెక్టు తీసుకన్నా డిజైన్ చేసేటప్పుడే రిపేరుబుల్‌గా ఉండే విధంగా ఉంటుంది. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు రిపేరుబుల్ చేసే విధంగా నిర్మించినట్లు కనబడటం లేదు.
కేసీఆర్ అంత తానై ఒక ఇంజనీరింగ్ నైపుణ్యం ఉన్న వ్యక్తిలా కాళేశ్వరం గురించి మాట్లాడారు. కాళేశ్వరం నిర్మించిన నాలుగున్నర సంవత్సరాలకే పిల్లర్లు కుంగిపోవడం చూస్తే దీనిలో అవినీతి జరిగిందని స్పష్టంగా తెలుస్తున్నది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా విచారించారు. కేంద్ర కమిటీ ఇచ్చిన నివేదికను పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టలేదు. దీని వల్ల ప్రజలలో అపోహలకు దారి తీస్తున్నది. అవసరమైతే అంతర్జాతీయ నిపుణులను పిలిపించి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించాలి. కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించాలి.
కాసాని జ్ఞానేశ్వర్ బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతూ టీడీపీపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాం. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో 25 నుంచి 30 సీట్లలలో పోటీ చేయాలనే ఉద్దేశంతో 4నెలల క్రితమే జాతీయ అధ్యక్షులు కోర్ కమిటీని వేయడం జరిగింది. కానీ, కాసాని జ్ఞానేశ్వర్ ఈ కమిటీని పట్టించుకోలేదు. పార్టీని బలహీన పర్చడానికే కాసాని జ్ఞానేశ్వర్ 119 సీట్లలో పోటీచేస్తామని మాట్లాడారు. కాసాని ఏకపక్షంగా కమిటీలను రద్దు చేశారు. 6 నెలల వరకు కమిటీలను వేయలేదు. చంద్రబాబు నాకు ఫ్రీహాండ్ ఇచ్చారని కాసాని జ్ఞానేశ్వర్ చెప్పుకోవడంతో మేము ఎవరం జోక్యం చేసుకోలేదు.
అబద్దాలు చెప్పడంలో కాసాని జ్ఞానేశ్వర్ ఈ రాష్ట్రంలో నెం.1. చంద్రబాబు ఇంటి నుంచి కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పోతున్నాయని అన్న కాసాని.. ఈ విషయంపై అమ్మవారిపై ప్రమాణం చేస్తావా? బడుగు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేయాలనే చంద్రబాబు గారు కాసాని జ్ఞానేశ్వర్‌ను రాష్ట్ర అధ్యక్షులుగా చేయడం జరిగింది. రాబోయే రెండు మూడు నెలలో అన్ని కమిటీలను వేసుకొని పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతాం.
కాసాని జ్ఞానేశ్వర్ బండారం బయట పెడతాం: డాక్టర్ ఎ.ఎస్.రావు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి
మొన్నటి వరకు అధ్యక్షునిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ చంద్రబాబు ని పొగిడి ఆయన బిఆర్‌ఎస్‌లో చేరగానే ఆయన రక్తంలో పింక్ కలర్ కలిసి పోయినట్లుంది. ఇప్పుడు చంద్రబాబు పై తప్పుడు విమర్శలు చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ పార్టీతో లోపాయికార ఒప్పందం చేసుకున్నారు. నీ నీచ లోపాయికారితనాన్ని టీడీపీకి అంటగడతవా? కాసాని జ్ఞానేశ్వర్ లాంటి ఎంతో మందిని తెలుగుదేశం పార్టీ తయారు చేసుకుంటుంది. మా పార్టీ అధినేత చంద్రబాబు పై గాని, నారా లోకేష్ పై గాని మరో సారి కాసాని జ్ఞానేశ్వర్ విమర్శలు చేస్తే అతని బండారం బయట పెడతాం.
రావుల లాంటి వారు పార్టీ నుంచి వెళ్లిపోవడానికి కాసాని జ్ఞానేశ్వరే కారణం: కందికంటి అశోక్ కుమార్ గౌడ్, మల్కాజ్‌గిరి పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు
మా జాతీయ పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ను నమ్మి రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి అప్పచెబితే.. ఏ విధంగా అమ్ముడు పోయాడో చూశాం. పదవుల కోసం మా పార్టీపై అభాండాలు వేయడం తప్పు. రావుల చంద్రశేఖర్ రెడ్డి లాంటి వారు పార్టీ నుంచి వెళ్లిపోవడానికి కాసాని జ్ఞానేశ్వరే కారణం. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరూ కాసాని జ్ఞానేశ్వర్ వెంట వెళ్లలేదు. మేమంతా చంద్రబాబు వెంట ఉన్నాం. చంద్రబాబు చెప్పిన వాటికి మేమంతా కట్టుబడి ఉంటాం.
ఖమ్మం సభ విజయవంతం అయిన తరువాత కేసీఆర్ భయపడి కాసాని ద్వారా తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని చూశారు. ఖమ్మం సభ తరువాత ఐదు సభలు పెడతామని, బస్సు యాత్ర చేస్తామని కాసాని గారు చెప్పి చేయలేదు. 119 సీట్లలో పోటీ పెడతామని చెప్పిన కాసాని తట్టా, బుట్టా సర్ధుకొని బిఆర్‌ఎస్‌లో చేరారు.
ఒక ఎన్నికల్లో పోటీ చేయనంత మాత్రాన ఏమీ కాదు: గుళ్లపల్లి ఆనంద్, ఆదిలాబాద్ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు
తెలుగుదేశం పార్టీ సూర్య, చంద్రులు ఉన్నంత వరకు ఉంటుంది. ఒక ఎన్నికల్లో పోటీ చేయనంత మాత్రాన ఏమీ కాదు. చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమంతా పనిచేస్తాం.
కాసాని జ్ఞానేశ్వర్ వేస్తున్న అభండాలను ప్రజలు నమ్మరు. ప్రజలు విజ్ఞులు: కుందారపు కృష్ణాచారి, భువనగిరి పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు
తెలుగుదేశం పార్టీ అనేక సంక్షోభాలను చూసింది. వాటన్నింటినీ అధిగమించి మరింత బలోపేతం అయి ప్రజల్లోకి వెళ్లడం జరిగింది. 19 సంవత్సరాలుగా రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకున్నా మొక్కవోని ధైర్యంతో కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇక ముందూ పనిచేస్తాం. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు డాక్టర్ కడియాల రాజేందర్ కూడా పాల్గొన్నారు.