– కవిత ఆరోపించిన బినామీ ఆస్తులపై టిఆర్ఎస్ ముందుకు స్పందించడం లేదు?
– అక్రమ సంపాదన పంపకాల్లో వచ్చిన తేడాలతోనే కేసీఆర్ కుటుంబ సభ్యులు గొడవ
– హరీష్ రావు ని కాపాడాలంటే కాలేశ్వరం పై ఎందుకు సీబీఐ విచారణకు అప్ప చెబుతాం?
– కేసీఆర్ కుటుంబం అంతా ఒకటే
– భవిష్యత్తులో అందరూ కలిసి పోతారు
దోచుకున్న సొమ్మును పంచుకోవడంలో వచ్చిన విభేదాలతోనే కవితను సస్పెండ్ – సచివాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మంత్రి సీతక్క చిట్ చాట్
హైదరాబాద్: కవిత ఎపిసోడ్ పెద్ద రాజకీయ కుటుంబ డ్రామా. తెలంగాణ జాతిపితగా చెప్పుకునే కెసిఆర్ కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని బలహీన పరిస్థితుల్లో ఉన్నాడా? నలుగురు కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి మాట్లాడి సర్దుబాటు చేయలేని చేరుకున్నాడా? కాళేశ్వరం ప్రాజెక్టులో కెసిఆర్ కుటుంబం అవినీతి బయట పడేసరికి కేసిఆర్ కుటుంబ సభ్యులు గొడవ పడుతున్నారు
అవినీతి సొమ్ము, అక్రమ సంపాదన పంపకాల్లో వచ్చిన తేడాలతోనే కేసీఆర్ కుటుంబ సభ్యులు గొడవలు పడుతున్నారు.
సంతోష్ రావు బినామీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పందల కోట్లు సంపాదించారని కవిత ఆరోపించింది బినామీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ములుగు లో నన్ను ఓడగొట్టేందుకు వందల కోట్లు ఖర్చు చేశాడు. కవిత ఆరోపించిన బినామీ ఆస్తులపై టిఆర్ఎస్ ముందుకు స్పందించడం లేదు?
కేటీఆర్ ప్రోత్సాహం లేనిది కవితను సస్పెండ్ చేయడం సాధ్యమా? కేటీఆర్ ను కవిత వెనకేసుకురావడం పెద్ద డ్రామా. మొదట కేటీఆర్ ను టార్గెట్ చేసిన కవిత.. ఇప్పుడు హరీష్ రావు సంతోష్ రావు లను టార్గెట్ చేశారు, కవిత సస్పెన్షన్ ఆ పార్టీ ఇంటర్నల్ వ్యవహారం. కానీ కవితను సస్పెండ్ చేసి సంబరాల పేరుతో పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టుకోవడం ఎందుకు? సొంత ఆడబిడ్డ కవితను టిఆర్ఎస్ మహిళా నాయకులతో విమర్శింప చేస్తున్నారు. ఈ మహిళా నాయకులు గతంలో మమ్మల్ని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం అంతా ఒకటే. భవిష్యత్తులో అందరూ కలిసి పోతారు.
కవితను విమర్శించిన మహిళా నాయకురాలు నష్టపోతారు
కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని కవితే అంగీకరించారు. గతంలో కవిత… మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ని విమర్శిస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదు? కానీ కెసిఆర్ కుటుంబ సభ్యులైన హరీష్ రావు సంతోష్ రావుపై ఆరోపణలు చేయగానే సస్పెండ్ చేశారు
కేసీఆర్ కుటుంబం మీద అవినీతి మచ్చ బయట పడగానే కవితను సస్పెండ్ చేశారు. రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో హరీష్ రావు పనిచేస్తున్నారని కవిత మాట్లాడటం రాజకీయ ఆజ్ఞానానికి నిదర్శనం. 2018లో కొడంగల్ ఇన్చార్జిగా రేవంత్ రెడ్డి ని వోడగొట్టేందుకు హరీష్ రావు వందల కోట్లు ఖర్చు చేశారు,
నిజంగా హరీష్ రావును రేవంత్ రెడ్డి కాపాడాలనుకుంటే. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎందుకు విచారణ చేస్తారు? అవినీతిలో హరీష్ ది పెద్ద చెయ్యి. హరీష్ రావు ని కాపాడాలంటే కాలేశ్వరం పై ఎందుకు సీబీఐ విచారణకు అప్ప చెబుతాం? కేసీఆర్ కుటుంబ సభ్యులను ఎవరు నమ్మరు. కాళ్లు మొక్కి కాంగ్రెస్ను ఖతం చేసే ప్రయత్నం చేశారు.
తెలంగాణ ఇచ్చిన పార్టీగా గౌరవం ఇవ్వాలన్న సోయి లేకుండా కాంగ్రెస్ నేతలను చేర్చుకున్నారు. పార్టీ నుండి కవితను సస్పెండ్ చేస్తే చేశారు. కానీ ఆమె దిష్టిబొమ్మను దగ్ధం చేయటం దురదృష్టకరం. తండ్రి కెసిఆర్, అన్న కేటీఆర్ బతికుండగానే కవిత దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
తండ్రిగా, అన్నగా చెల్లె దిష్టిబొమ్మ దగ్దాన్ని ఆపలేకపోయారు. పార్టీ కన్నా సొంత కుటుంబమే కెసిఆర్ కు ముఖ్యం. అందుకే ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారులు త్యాగదనులు ఉన్నప్పటికీ కవితకి ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. దోచుకున్న సొమ్మును పంచుకోవడంలో వచ్చిన విభేదాలతోనే కవితను సస్పెండ్ చేశారు.