– బీఆర్ఎస్ పార్టీకీ గుడ్‌బై
– నేను మొండి దాన్ని
హైదరాబాద్: బీఆర్ఎస్పై తిరుగుబావుటా ఎగురవేసిన ఎమ్మెల్సీ కవిత తన ఎమ్మెల్సీ పదవి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే.. నేను భవిష్యత్తులో ఏం చేయాలనే విషయంపై బీసీ బిడ్డలతో.. సామాజిక తెలంగాణ కోసం పాటుపడే మేధావులతో, జాగృతి నాయకులు, కార్యకర్తలతో చర్చించే నిర్ణయం తీసుకుంటా. ఒక నిర్ణయం తీసుకోవాలనేది ఏమీ లేదు.నేను ఏ పార్టీలో చేరను. అందులో ఎటువంటి అనుమానం లేదు. నేను మొండి దాన్ని. ధైర్యం ఆత్మస్థైర్యం ఉన్న మనిషిని. ప్రస్తుతానికి బీ ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశా. ఆ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని వదిలేసా.మా అమ్మను కలవలేక పోతున్న అదొక్కటే బాధ.