– డీజీపీకి ఫోన్ చేయడం షేమ్….షేమ్…
– ఆదిలాబాద్ బీజేపీ శాసనసభ్యులు పాయల్ శంకర్
ఆదిలాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘రేవ్’ ఘటనలో తన కుటుంబాన్ని రక్షించాలంటూ ఈరోజు డీజీపీకి ఫోన్ చేసినట్లు మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఇదే నిజమైతే కేసీఆర్ కు ఇంతకంటే సిగ్గు చేటు మరొకటి లేదు.
10 ఏళ్ల పాలనలో పోలీసు లాఠీల దెబ్బలకు రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు విలవిల్లాడితే కేసీఆర్ ఏనాడూ నోరు మెదపలేదు. ప్రజా సమస్యలపై కొట్లాడిన ఉద్యమకారులపై లాఠీ దెబ్బలు ఝుళిపించినప్పుడు కేసీఆర్ ఏనాడూ నోరు మెదపలేదు? పోడు భూములపై పోరాడిన గిరిజనులపై, గర్భిణీలను జైల్లో వేసినప్పుడు కేసీఆర్ ఏనాడూ నోరు మెదపలేదు?
కన్న కొడుకు బినామీ సంస్థ వైఫల్యంవల్లే ఇంటర్మీడియట్ లో ఫెయిలై విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కేసీఆర్ ఏనాడూ నోరు మెదపలేదు? సొంత కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని నేరెళ్ల ఘటనలో దళితులపై పోలీసులు దారుణానికి ఒడిగట్టినప్పుడు ఏనాడూ నోరు మెదపలేదు?
ఆనాడు లేవని నోరు… ఇప్పుడెందుకు లేచింది? ఏనాడూ డీజీపికి ఫోన్ చేయని కేసీఆర్ కు తెలంగాణ ప్రజల ప్రాణాలకంటే తన కుటుంబమే ఎక్కువైందా? రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుని, తాగి తందనాలాడితే డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడటానికి సిగ్గు లేదా? తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడినని పదేపదే చెప్పుకునే కేసీఆర్ తప్పు చేసిన వాడిని దండించాలని చెప్పకుండా…. తన కుటుంబాన్ని కాపాడాలని డీజీపీకి ఫోన్ చేయడం షేమ్ షేమ్.