Suryaa.co.in

Telangana

రాష్ట్రంలో ఆర్&బి రోడ్లు అద్దంలా ఉండాలని కేసిఆర్ ఇప్పటికే అదేశించారు

– రాష్ట్ర వ్యాప్తంగా PR(పీరియాడికల్ రెన్యువల్), FDR (ఫ్లడ్ డ్యామేజ్ రోడ్స్) కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 2,500 కోట్లు మంజూరు చేశారు
– కేసీఆర్ ఆదేశాల మేరకు వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు యుద్ద ప్రాతిపదికన పునరుద్ధరణ చేయాలి
– టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలుపెట్టాలని అధికారులకు సూచించారు
– ఎర్రమంజిల్ ఆర్.అండ్.బి ఆఫీస్ ఛాంబర్ లో రాష్ట్ర ఉన్నత అధికారులతో సమీక్షలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్:రాష్ట్రంలో రోడ్లు అద్దంలా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల జరిగిన సమావేశంలో ఆదేశించారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.బుధవారం నాడు ఎర్రమంజిల్ లోని ఆర్.అండ్.బి ప్రధాన కార్యాలయంలో R&B సెక్రటరీ శ్రీనివాస్ రాజు, ENC రవీందర్ రావు లతో సమీక్ష నిర్వహించారు.

గత రెండు సీజన్లలో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు యుద్ద ప్రాతిపదికన పునరుద్ధరణ చేయాలని అధికారులకు దిశా నిర్దేశము చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా PR(పీరియాడికల్ రెన్యువల్), FDR(ఫ్లడ్ డ్యామేజ్ రోడ్స్) కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 2,500 కోట్లు మంజూరు చేశారని అన్నారు. కేసీఆర్ ఆదేశాల ప్రకారం వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల పునరుద్ధరణ పనులు వేగంగా నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని మంత్రి పునరుద్ఘాటించారు.

ఈ రోజువరకు 70% పనులకు టెండర్లు పిలిచామని ,దశలవారిగా LOA లు ఇస్తున్నామని అధికారులు తెలుపగా …మిగతా ప్రక్రియ కూడా జనవరి 5 వ తారీఖు కల్లా పూర్తి చేసి జనవరి 10 నుండి పనులు మొదలు పెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.ఇది వరకే వివిధ దశల్లో ఉన్న పనులను మార్చ్ లోపు పూర్తి చేయాలనీ సూచించారు.

LEAVE A RESPONSE