– మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ఒక చరిత్ర అని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం నిమ్స్ హాస్పిటల్ లో ని పేషేంట్లకు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1969 లోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటికీ, నాటి నాయకులు కేంద్రప్రభుత్వం కు తలొగ్గి ఉద్యమాన్ని నీరుగార్చేవారని పేర్కొన్నారు.
400 మంది మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. 2001 సంవత్సరంలో కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసి సాగర హారం, సకల జనుల సమ్మె, వంట వార్పు వంటి కార్యక్రమాలతో సుదీర్ఘ కాలం పోరాటం చేసి ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు అన్ని వర్గాలను కేసీఆర్ ఐక్యం చేశారని, కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారని చెప్పారు.
దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ అనుసరించిన అహింసా మార్గాన్నే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ అనుసరించిన అహింసా మార్గంలో పోరాడారని తెలిపారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ నవంబర్ 29, 2009 న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని చెప్పారు. కేసీఆర్ దీక్ష తెలంగాణ జాతిని మొత్తం ఏకం చేసిందని అన్నారు. 11 రోజుల కేసీఆర్ దీక్షకు నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు డిసెంబర్ 9 న ప్రకటన చేసిందని తెలిపారు.
చరిత్రలో నిలిచిపోయే ఈరోజు ను విజయ్ దివస్ గా ఘనంగా జరుపుకుంటున్నట్లు వివరించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎంతో అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, నాయకులు మాగంటి సునీత, విప్లవ్ కుమార్, మేడె రాజీవ్ సాగర్, మన్నె గోవర్ధన్ రెడ్డి, పలువురు కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.